రైల్వే మంత్రిత్వ శాఖ
భారతీయ రైల్వే నెట్ వర్క్ పై ఉదజని ఇంధన సెల్ ఆధారిత రైళ్ళను నడుపుతూ కాలుష్యరహిత రైల్వేల సాధన దిశగా పని చేస్తున్న భారతీయ రైల్వేల ప్రత్యామ్నాయ ఇంధన సంస్థ (ఐఆర్ ఒఎఎఫ్)
ఈ ప్రాజెక్టు దేశంలో హైడ్రోజెన్ మొబిలిటీ అన్న భావనను ప్రారంభిస్తుంది
తొలుత ఉత్తర రైల్వే సోనిపట్ - జింద్ విభాగంలో 89 కిమీలకు బిడ్ల ఆహ్వానం
మొదటగా 2డిఇఎంయు రేకులను పరివర్తన చేస్తారు, అనంతరం హైడ్రోజెన్ ఫ్యూయెల్ పవర్ కదలిక ఆధారంగా 2 హైబ్రిడ్ లోకోలలో మార్పులు
ఈ ప్రాజెక్టు ఏడాదికి రూ. 2.3 కోట్లు ఆదా చేసేందుకు దారితీస్తుంది.
Posted On:
07 AUG 2021 6:52PM by PIB Hyderabad
ప్యారిస్ పర్యావరణ ఒప్పందం 2015, మిషన్ నెట్ జీరో కార్బన్ ఎమిషన్ రైల్వే ( కార్బన్ ఉద్గారాలను దాదాపుగా సున్నా శాతానికి తగ్గించడం) కింద హరిత వాయువు ఉద్గారాలను తగ్గించాలన్న లక్ష్యాన్ని 2030 నాటికి సాధించేందుకు భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలు అడ్వాన్స్ డ్ కెమిస్ట్రీ సెల్ (ఎసిసి) బ్యాటరీలు, జాతీయ హైడ్రొజెన్ (ఉదజని) మిషన్. అందుకు అనుగుణంగా, దేశంలో ఉదజని చలనశీలత (హైడ్రోజెన్ మొబిలిటీ) అన్న భావనను ప్రారంభించేందుకు ఇటీవలే బడ్జెట్ ప్రకటన చేయడం జరిగింది. ఈ భావనను సవాలుగా తీసుకున్న భారతీయ రైల్వే ప్రత్యామ్నాయం ఇంధన సంస్థ (ఇండియన్ రైల్వేస్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఆల్టర్నేట్ ఫ్యూయెల్ -ఐఆర్ ఒఎఎఫ్), హరిత (బయో) ఇంధనాల పెంపును ప్రోత్సహించేందుకు రైల్వే నెట్ వర్క్‌పై హైడ్రోజెన్ ఫ్యూయెల్ ఆధారిత రైళ్ళ కోసం బిడ్లను ఆహ్వానించింది. ఈ ప్రాజెక్టు ఉత్తర రైల్వేలకు చెందిన సోనిపట్ - జింద్ విభాగంలో 89 కిమీలలో ప్రారంభం అవుతుంది.
తొలుత, 2 డిఇఎంయు రేకులను పరివర్తన చేస్తారు, అనంతరం, 2 హైబ్రిడ్ లోకోలను హైడ్రొజెన్ ఫ్యూయెల్ సెల్ శక్తి కదలిక ఆధారంగా మార్పులు చేస్తారు. డ్రైవింగ్ విధానంలో ఎటువంటి మార్పులు ఉండవు. అంతేకాదు, ఈ ప్రాజెక్టు ఏడాదికి రూ. 2.3 కోట్లను ఆదా చేయడానికి మార్గాన్ని సుగమం చేస్తుంది.
ప్రాజెక్టు వివరాలుః
మంజూరైన పనిః
* 2 డిఇఎంయు రేకులపై ఫ్యూయెల్ సెల్ పవర్డ్ హైబ్రిడ్ ట్రాక్షన్ సిస్టం ఫర్ ట్రైన్ అప్లికేషన్ కు ఏర్పాటు
*2021-22కి చెందిన వర్తమాన పింక్ బుక్ అంశం నెం. 723
* వర్తమాన సంవత్సరానికి కేటాయింపు రూ. 8 కోట్లు
పనికి సంబంధించి సంక్షిప్త పరిధిః
* జులై 2021నాటి ఆర్‌డిఎస్ఒ నిర్దేశిత నెం. ఆర్2/347/ ఫ్యూయెల్ సెల్ -1కు అనుగుణంగా ఆన్‌బోర్డ్ పరికరాలు
* జులై 2021నాటి ఆర్‌డిఎస్ఒ నిర్దేశిత నెం. ఆర్2/347/ ఫ్యూయెల్ సెల్ -1కు అనుగుణంగా ఆ ప్రాంతంలో హైడ్రోజెన్ నిల్వ, ఫిల్లింగ్ స్టేషన్ ఏర్పాటు
టెండర్ ప్రక్రియః
* బిడ్లకు ముందస్తు సమావేశాలు రెండు 17/08/2021 - 09/09/ 2021న జరుగుతాయి
* బిడ్ల సమర్పణ 21/09/2021న ప్రారంభం కానుంది
*టెండర్ల ప్రారంభ తేదీ 05/10/2021న .
***
(Release ID: 1743723)
Visitor Counter : 245