మంత్రిమండలి

పరిశోధన లో సహకరించుకోవడం కోసం ఇండియన్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ ఎండ్ టెక్నాలజీ (ఐఐఎస్ టి) కి, నెదర్లాండ్స్ కు చెందిన డెఫ్ట్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ (టియు డెఫ్ట్) కు మధ్య సంతకాలు అయిన అవగాహన పూర్వక ఒప్పంద పత్రాని కి (ఎమ్ఒయు) కు మంత్రిమండలి తెలిపిన ఆమోదానికి సంబంధించి

Posted On: 04 AUG 2021 3:58PM by PIB Hyderabad

ఇండియన్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ ఎండ్ టెక్నాలజీ (ఐఐఎస్ టి) కి, నెదర్లాండ్స్ కు చెందిన ద డెఫ్ట్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ (టియు డెఫ్ట్) కి చెందిన విద్యార్థులు, ఫేకల్టీ సభ్యుల ద్వారా విద్య సంబంధి కార్యక్రమాల ను, పరిశోధన కార్యకలాపాల ను చేపట్టడానికి గాను ఆ రెండు సంస్థల లోను గత ఏప్రిల్ 9వ తేదీ నాడు మరియు గత మే 17వ తేదీ నాడు సంతకాలు జరిగి, ఇ-మెయిల్ మాధ్యమం ద్వారా ఇచ్చి పుచ్చుకొన్న అవగాహన పూర్వక ఒప్పంద పత్రాని కి (ఎమ్ఒయు) కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.

ఎమ్ఒయు తాలూకు వివరాలు:

  1. విద్యార్థుల ఆదాన ప్రదాన కార్యకమం: ఉభయ పక్షాలు అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిల లోను, డాక్టరేట్ స్థాయి లోను విద్యార్థుల ను పరస్పరం ఆదాన, ప్రదానాలు చేసుకొనే వీలు ఉంది.  రెండు పక్షాలు పరస్పరం చర్చించుకొని ఈ పథకం లో భాగం గా అధ్యయనం చేపట్టవలసిన రంగాల పై, క్రెడిట్ ల పై నిర్ణయం తీసుకొంటాయి. రెండు పక్షాలు డిగ్రీ శిక్షణ కోసం ఉద్దేశించినటువంటి ఒక ‘ప్రాక్టీకమ్ ఎక్స్ చేంజ్ ప్రోగ్రామ్’ లో భాగం గా ఆతిథేయి భాగస్వామి యొక్క శిక్షణ ప్రణాళిక ను, నియమాల ను అనుసరించవలసి ఉంటుంది.
  2. రెండేసి డిగ్రీ లు/ రెండు రకాల డిగ్రీ ల కార్యక్రమం: ఉభయ పక్షాలు  అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ని గాని, లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ని గాని ప్రదానం చేసే ఉద్దేశ్యం తో విద్యార్థుల కోసం  ప్రత్యేకించినటువంటి ఒక పాఠ్యక్రమాన్ని తీర్చిదిద్దేందుకు వీలు ఉంటుంది. ఇది మాతృ సంస్థ ప్రదానం చేసే ప్రారంభిక డిగ్రీ కి అదనం గా ఉంటుంది.
  3. ఇంటర్న్ శిప్స్ - ప్రాజెక్ట్ వర్కు: రెండు పక్షాలు ఇంజినీరింగ్ ప్రాజెక్టు అసైన్ మెంట్ లతో ముడిపడ్డ పరిశోధనల ను సిద్ధం చేయవచ్చు; తీర్చిదిద్దవచ్చును. వీటి ని విద్యార్థుల ద్వారా భాగస్వామ్య సంస్థ లో వారు స్వల్ప కాలికమైనటువంటి ప్రవాస కాలం లో ను, దీర్ఘ కాలికమైనటువంటి ప్రవాసం లోను  చేపట్టడానికి అవకాశం ఉంటుంది.
  4. ఫేకల్టీ ఎక్స్ చేంజ్ ప్రోగ్రామ్: ఇరు పక్షాలు ఫేకల్టీ ఎక్స్ చేంజ్ ప్రోగ్రామ్ ’  విషయ మై పరిశీలన జరపవచ్చును. ఆ దశ లో వారి ఫేకల్టీ మెంబరు భాగస్వామ్య సంస్థ లో విభిన్నమైనటువంటి పాఠ్యక్రమాల ను అందిస్తారు.  దీనికి గాను పాఠ్యక్రమం లో ఏమేమి ఉండాలి అనేది సంయుక్తం గా అభివృద్ధిపరచడం జరుగుతుంది.
  5. సంయుక్త పరిశోధన: రెండు సంస్థల కు చెందిన ఫేకల్టీ సభ్యులు ఉమ్మడి ఆసక్తి కలిగిన రంగాల లో సంయుక్త పరిశోధన కార్యక్రమాన్ని గుర్తించేందుకు అవకాశం ఉంటుంది.

ప్రయోజనాలు:

ఈ ఒప్పందం పై సంతకాలు జరగడం వల్ల ఇక సహకారం పట్ల ఆసక్తి వ్యక్తం అయ్యే ఈ కింది రంగాల లో ముందంజ వేసేందుకు మార్గం సుగమమం అవుతుంది.  ఆయా రంగాలు ఏమేమిటి అంటే, ఫేకల్టీ సభ్యుల, విద్యార్థుల, పరిశోధకుల తో పాటు విజ్ఞాన శాస్త్ర సంబంధి సామగ్రి, ప్రచురణలు మరియు సమాచారాన్ని ఒక పక్షానికి మరొక పక్షం ఇచ్చిపుచ్చుకోవడం లో తోడ్పాటు లభించగలదు. కలసి పరిశోధనలకు సంబంధించిన సమావేశాలను నిర్వహించడం, పిహెచ్. డి కార్యక్రమం, రెండేసి డిగ్రీలు/ రెండు డిగ్రీల కార్యక్రమం కూడా.

ఈ ఒప్పందం ద్వారా నెదర్లాండ్స్ కు చెందిన అతి పురాతనమైన మరియు అన్నింటి కంటే పెద్దదైన డచ్ సార్వజనిక సాంకేతిక విజ్ఞ‌ాన విశ్వవిద్యాలయం అయినటువంటి ఇడబ్ల్యుఐ, టియూ డెఫ్ట్ తో సహకారానికి పూచీ లభించినందువల్ల విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతిక విజ్ఞాన రంగం లో పరిశోధన పరంగా ఒక సంయుక్త ప్రక్రియ ను అభివృద్ధిపరచేందుకు వీలు చిక్కుతుంది.  దీని ద్వారా దేశం లో అన్ని వర్గాల కు, ప్రాంతాల కు లబ్ధి చేకూరుతుంది.

సంతకాలు అయిన ఈ ఒప్పందం ద్వారా విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక విజ్ఞాన రంగం లో కొత్త కొత్త పరిశోధక కార్యకలాపాల ను మరియు ఎప్లికేశన్ సంబంధి సంభావనల ను వెదకేందుకు చాలా ప్రోత్సాహం లభించనుంది.

 

***



(Release ID: 1742407) Visitor Counter : 182