నీతి ఆయోగ్
విద్యుత్ పంపిణీ రంగంపై నివేదికను విడుదల చేసిన నీతి ఆయోగ్, ఆర్ఎంఐ
Posted On:
03 AUG 2021 11:59AM by PIB Hyderabad
విద్యుత్ పంపిణీ రంగంలో విధి విధానాలను మెరుగుపర్చే దిశగా , దేశ విద్యుత్ పంపిణీ రంగాన్ని మార్చగల సంస్కరణ మార్గాలను అందించే నివేదికను నీతిఆయోగ్ ఈరోజు విడుదల చేసింది.
‘విద్యుత్ పంపిణీ రంగం చుట్టూ తిరగడం’ పేరుతో నీతి ఆయోగ్, రాకీ మౌంటెయిన్ ఇన్స్టిట్యూట్(ఆర్ఎంఐ) సంయుక్తంగా నివేదికను రూపొందించాయి. నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే సారస్వత్, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, యూనియన్ పవర్ సెక్రెటరీ అలోక్ కుమార్, నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి డాక్టర్ రాకేశ్ సర్వాల్, రాకీ మౌంటెయిన్ ఇన్స్టిట్యూట్ఇన్సిట్యూట్ ఇండియా ప్రిన్సిపాల్ అక్షిమా ఘాటే సమక్షంలో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్ ఈ నివేదికను విడుదల చేశారు.
భారతదేశంలోని చాలా విద్యుత్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) ఏటా నష్టాల పాలవుతున్నాయి. - 2021 ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం నష్టాలు రూ .90,000 కోట్లుగా అంచనా వేయబడ్డాయి. ఈ సంచిత నష్టాల కారణంగా, డిస్కమ్‌లు ఉత్పత్తిదారులకు సకాలంలో చెల్లించలేకపోతున్నాయి. తద్వారా అధిక నాణ్యత కలిగిన విద్యుదుత్తిని, పునుత్పాదక శక్తి ఉత్పత్తులపై ఉత్పత్తిదారులు పెట్టుబడులు పెట్టేలా చేయలేకపోతున్నారు.
భారతదేశంతోపాటు ప్రపంచ విద్యుత్ పంపిణీరంగంలని సంస్కరణ ప్రయత్నాల సమీక్షను ఈ నివేదిక అందిస్తుంది. ఇది ప్రస్తుతం అమల్లో ఉన్న ఉత్తమ విధానాల నుంచి సంపదను సృష్టించే మార్గాలను సంగ్రహిస్తుంది. ‘ఈ నివేదిక పంపిణీ రంగంలో ప్రైవేటు సంస్థల పాత్ర, విద్యుత్ సేకరణ, నియంత్రణ, పర్యవేక్షణ, పునరుత్పాదక ఇంధన ఏకీకరణ, మౌలిక సదుపాయాల మెరుగుదల వంటి అనేక ముఖ్యమైన సంస్కరణలను పరిశీలిస్తుంద’ని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్ అన్నారు. ‘ఒక ఆరోగ్యకరమైన, సమర్థవంతమైన పంపిణీ వ్యవస్థ అవసరం. అది వ్యాపారాన్ని సులభతరం చేయడానికి లేదా జీవిత సౌలభ్యాన్ని మెరుగుపర్చడానికి కావొచ్చ’ని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు.
ఈ నివేదిక నిర్మాణాత్మక సంస్కరణలు, నియంత్రణ సంస్కరణలు, కార్యచరణ సంస్కరణలు, నిర్వాహక సంస్కరణలు, పునరుత్పాదక ఇంధన సమగ్రతపై దృష్టిసారించే పలు అధ్యాయాలుగా విభజించబడింది. ‘ పంపిణీ రంగాన్ని సమర్థంగా మరియూ లాభాలబాట పట్టించడానికి విధాన రూపకర్తలకు ఈ నివేదిక ఓ విషయసూచికలా పనిచేస్తుంద’ని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె. సారస్వత్ అన్నారు. కొన్ని రాష్ట్రాలతో భాగస్వామిగా నీతి ఆయోగ్ఈ సంస్కరణలను ముందుకు తీసుకెళ్తుందని చెప్పారు.
ప్రస్తుత సవాళ్లను పరిష్కరించాల్సిన అవసరానికున్న ప్రాధాన్యతపై రాకీ మౌంటెయిన్ ఇన్స్టిట్యూట్ మేనేజింగ్ డైరెక్టర్ క్లే స్ట్రేంజర్ మాట్లాడుతూ.. ‘అసౌకర్యాల సమస్యలకు బలమైన మరియు దీర్ఘకాలిక పరిష్కార విధానంతోపాటు సంస్థాగత , నిర్వాహక, సాంకేతిక సంస్కరణలు అవసరం. దేశంలోని వివిధ రాష్ట్రాలు విభిన్న సంస్కరణ మార్గాల్లో ప్రయాణించాయి. నేర్చుకోవడానికి గొప్ప విధాన ప్రయోగాలను అందిస్తున్నాయ’న్నారు.
***
(Release ID: 1742040)
Visitor Counter : 263