ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ అనంత‌ర వ్యాధులపై అధ్యయనం

Posted On: 03 AUG 2021 3:24PM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్య ప‌రిశోధ‌న శాఖ పరిధ‌లో ప‌ని చేసే స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ 'ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్‌)'.. కోవిడ్‌-19 యొక్క క్లినికల్ ట్రీట్మెంట్ మరియు ఫలితాలను సంగ్రహించడానికి దేశ వ్యాప్తంగా మొత్తం 20 ప్రాంతాల‌లో కోవిడ్‌ క్లినికల్ రిజిస్ట్రీని ఏర్పాటు చేసింది. ఈ సమాచారం ఆసుపత్రిలో చేరిన కోవిడ్ రోగులకు మాత్రమే పరిమిత‌మైంది.
బృహద్ధమని మరియు ఊపిరితిత్తుల వాపు, మ్యూకోర్మైకోసిస్ మొదలైన వివిధ పరిస్థితులపై కోవిడ్ అనంతర అధ్యయనాలు జరుగుతున్నాయి. ఆరోగ్యం అనేది రాష్ట్ర ప‌రిధిలోని విషయం అయినప్పటికీ.. వివిధ కోవిడ్ పరిస్థితులతో బాధపడుతున్న ప్రజల అవసరాలను తీర్చడానికి సంబంధిత ఆరోగ్య కేంద్రాలలో పోస్ట్ కోవిడ్ క్లినిక్‌లను ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. అలాగే, నిపుణుల సమూహాలు వివిధ పోస్ట్ కోవిడ్ పరిస్థితులు/సమస్యలపై మాడ్యూల్స్/ మార్గదర్శకాలపై కూడా పనిచేస్తున్నాయి. కేంద్ర స‌హాయ మంత్రి (ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ) డాక్టర్ భారతి ప్రవీణ్‌ పవార్ ఈ రోజు రాజ్యసభకు ఇచ్చిన ఒక లిఖితపూర్వక సమాధానంలో ఈ విష‌యం పేర్కొన్నారు.

***


(Release ID: 1742038) Visitor Counter : 147