సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ

ఎస్సీ/ఎస్టీ/ఓబీసీల కోసం పూరించని ఖాళీలు

Posted On: 03 AUG 2021 2:16PM by PIB Hyderabad

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో 90 శాతం కంటే ఎక్కువమంది ఉన్న పది మంత్రిత్వ శాఖలు/విభాగాల్లో; ఎస్సీ, ఎస్టీ, ఓబీల కోసం బ్యాక్‌లాగ్‌ కోటా ఖాళీల భర్తీ పురోగతిని కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం పర్యవేక్షిస్తుంది. మంత్రిత్వ శాఖలు/విభాగాల వారీగా, కేటగిరీల వారీగా; 01.01.2017 నుంచి 01.01.2020 వరకు ఉన్న బ్యాక్‌లాగ్‌ కోటా ఖాళీలపై మంత్రిత్వ శాఖలు/విభాగాల నుంచి పొందిన సమాచారం ఈ క్రింది అనుబంధంలో ఉంది.

 

31.12.2016 నాటికి

31.12.2017 నాటికి

31.12.2018 నాటికి

31.12.2019 నాటికి

ఎస్సీ

ఎస్టీ

ఓబీసీ

ఎస్సీ

ఎస్టీ

ఓబీసీ

ఎస్సీ

ఎస్టీ

ఓబీసీ

ఎస్సీ

ఎస్టీ

ఓబీసీ

8223

6955

13535

15090

13040

16078

13560

12679

15591

14366

12612

15088

.

బ్యాక్‌లాగ్‌ కోటా ఖాళీల గుర్తింపు కోసం అంతర్గత కమిటీలను ఏర్పాటు చేయాలని అన్ని మంత్రిత్వ శాఖలు/విభాగాలకు కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం 16.12.2014న సూచనలు జారీ చేసింది. ఖాళీలు ఏర్పడడానికి కారణాలను అధ్యయనం చేయాలని, ఖాళీలు ఏర్పడటానికి కారణమైన కారకాలను తొలగించాలని, ప్రత్యేక నియామక కార్యక్రమాల ద్వారా ఖాళీలను భర్తీ చేయాలని కూడా సూచించింది.

కేంద్ర సాంఘిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి శ్రీ ఎ.నారాయణస్వామి ఈ సమాచారాన్ని లిఖితపూర్వక సమాధానంగా ఇవాళ లోక్‌సభకు సమర్పించారు.

***


(Release ID: 1741871)