పర్యటక మంత్రిత్వ శాఖ
దేశంలో సముచిత పర్యాటక ప్రాంతాలలో ఒకటిగా ఇకో టూరిజాన్ని గుర్తించి అభివృద్ధి చేయనున్న ప్రభుత్వంః జి కిషన్ రెడ్డి
Posted On:
02 AUG 2021 2:57PM by PIB Hyderabad
కీలకాంశాలుః
స్వదేశ్ దర్శన్ పథకం కింద అభివృద్ధి చేయడానికి గుర్తించిన పదిహేను ఇత్తివృత్త సర్క్యూట్లలో ఇకో సర్క్యూట్, వైల్డ్ లైఫ్ సర్క్యూట్ ఉన్నాయి
ఇకో టూరిజం మీద దృష్టి పెట్టి నిలకడైన టూరిజం కోసం జాతీయ వ్యూహం, దిశలకు సంబంధించిన ముసాయిదాను పర్యాటక మంత్రిత్వ శాఖ రూపొందించింది.
దేశంలో అభివృద్ధి చేయదగిన ప్రాంతాలలో ఎకోటూరిజంను నూతన పర్యాటక ప్రాంతంగా పర్యాటక మంత్రిత్వ శాఖ గుర్తించింది. .
స్థిరమైన ఉపాధులకు, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను (ఎస్ డిజి) సాధించేందుకు నిలకడైన పర్యాటకం మూలం అయ్యేందుకు అత్యంత సంభావ్యత ఉందని పర్యాటక మంత్రిత్వ శాఖ గుర్తించింది. ఎకోటూరిజంపై దృష్టితో నిలకడైన టూరిజం కోసం జాతీయ వ్యూహం, దిశలకు సంబంధించిన ముసాయిదాను పర్యాటక మంత్రిత్వ శాఖ రూపొందించింది. ముసాయిదా పత్రాన్ని మరింత సమగ్రం చేసేందుకు పర్యాటక మంత్రిత్వ శాఖ జాతీయ వ్యూహం, దిశలకు సంబంధించిన ముసాయిదాపై ఫీడ్ బ్యాక్‌ను / వ్యాఖ్యలను/ సూచనలను చేయవలసిందిగా గుర్తించిన కేంద్ర మంత్రిత్వ శాఖలను, అన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలను, పరిశ్రమకు చెందిన భాగస్వాములను కోరింది.
స్వదేశీ దర్శన్ పథకం కింద దేశంలో ఇతివృత్త ఆధారిత టూరిజం సర్క్యూట్ లను పర్యాటక మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేస్తోంది. ఈ పథకం కింద గుర్తించిన పదిహేను ఇతివృత్త సర్క్యూట్ లలో ఇకో సర్క్యూట్, వైల్డ్ లైఫ్ సర్క్యూట్ ఉన్నాయి. స్థానిక ప్రజలు, సమాజాల చురుకైన భాగస్వామ్యం ద్వారా ఉపాధిని సృష్టించడం, కమ్యూనిటీ ఆధారిత అభివృద్ధి, పేదలకు అనుకూల పర్యాట పద్ధతి అన్నవి స్వదేశ్ దర్శన పథకం లక్ష్యాలు. స్వదేశ్ దర్శన్ పథకం కింద రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాలు ప్రాజెక్టు ప్రతిపాదనలను సమర్పించడం అన్నది నిరంతర ప్రక్రియ. ఈ పథకం కింద ప్రాజెక్టుల అభివృద్ధి అన్నదానిని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలతో చర్చించిన అనంతరం గుర్తించి, నిధుల అందుబాటును బట్టి ఆమోదముద్ర వేస్తారు. తగిన వివరణాత్మక ప్రాజెక్టు రిపోర్టులు, పథకానికి సంబంధించిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటం, గతంలో విడుదల చేసిన నిధుల వినియోగం ఆధారంగా వీటి అభివృద్ధికి అనుమతి ఉంటుంది.
ఈ సమాచారాన్ని లోక్ సభలో అడిగిన ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి వెల్లడించారు.
(Release ID: 1741522)
Visitor Counter : 180