ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

జికా వైరస్‌ నియంత్రణలో మహారాష్ట్రకు సాయం చేయడానికి ఉన్నత స్థాయి బృందాన్ని పంపిన కేంద్ర ప్రభుత్వం

प्रविष्टि तिथि: 02 AUG 2021 3:51PM by PIB Hyderabad

జికా వైరస్ పరిస్థితిని పర్యవేక్షించడానికి, కేసుల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వానికి సాయం చేయడానికి ఒక నిపుణుల బృందాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ  మహారాష్ట్రకు పంపింది. ఇటీవల పుణె జిల్లాలో ఒక జికా కేసు నమోదైంది.

    పుణె ప్రాంతీయ డైరెక్టర్ కార్యాలయం నుంచి ప్రజారోగ్య నిపుణుడు, దిల్లీలోని లేడీ హార్డింగ్‌ మెడికల్‌ కళాశాలకు చెందిన గైనకాలజిస్ట్, జాతీయ మలేరియా పరిశోధన సంస్థ నుంచి ఒక శాస్త్రవేత్త ఈ కేంద్ర బృందంలో సభ్యులుగా ఉన్నారు.

    ఈ బృందం రాష్ట్ర ఆరోగ్య శాఖతో కలిసి పనిచేస్తుంది. క్షేత్ర స్థాయి పరిస్థితులను పరిశీలిస్తుంది. జికా నిర్వహణపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్దేశించిన కార్యాచరణ ప్రణాళిక అమలవుతుందో లేదో అంచనా వేస్తుంది. రాష్ట్రంలో జికా వైరస్‌ నియంత్రణ, నిర్వహణకు అవసరమైన సూచనలు చేస్తుంది.

 

***

 


(रिलीज़ आईडी: 1741513) आगंतुक पटल : 177
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Punjabi