ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఇండియా లో47.22 కోట్లు దాటిన కోవిడ్ -19 వాక్సినేష‌న్ మొత్తం క‌వ‌రేజ్


కోవిడ్ రిక‌వ‌రీ రేటు ప్రస్తుతంం 97.35 శాతం
గ‌త 24 గంట‌ల‌లో న‌మోదైన కొత్త కేసుల సంఖ్య 40,134
ఇండియాలో ప్ర‌స్తుత క్రియాశీల కేసుల సంఖ్య (4,13,718) మొత్తం కేసుల‌లో 1.31 శాతం
రోజువారి పాజిటివిటి రేటు (2.81 శాతం) వ‌రుస‌గా 56 రోజులుగా 5 శాతం కంటే త‌క్కువ‌గా న‌మోదు

Posted On: 02 AUG 2021 9:39AM by PIB Hyderabad

ఇండియాలో కోవిడ్ వాక్సినేష‌న్ క‌వ‌రేజ్ 47.22 కోట్లు దాటింది.  ఈ ఉద‌యం 7గంట‌ల వ‌ర‌కు అందిన  ప్రాథ‌మిక స‌మాచారం ప్ర‌కారం 55,99,690 సెష‌న్‌ల‌లో 47,22,23,639 వాక్సిన్ డోస్‌లు వేయ‌డం జ‌రిగింది.
గ‌త 24 గంట‌ల‌లో 17,06,598 వాక్సిన్ డోస్‌లు వేయ‌డం జ‌రిగింది.

 

హెచ్‌.సి.డ‌బ్ల్యు

మొద‌టి డోస్‌

1,03,11,380

రెండో డోస్‌

78,56,466

ఎఫ్‌.ఎల్‌.డబ్ల్యు

మొద‌టి డోస్‌

1,79,78,353

రెండో డోస్‌

1,13,65,816

18-44 సంవ‌త్స‌రాల
 వ‌య‌సు  మ‌ధ్య‌

మొద‌టి డోస్‌

15,70,22,578

రెండో డోస్‌

88,94,835

45-59 సంవ‌త్స‌రాల
 వ‌య‌సు  మ‌ధ్య‌

మొద‌టి డోస్‌

10,65,50,619

రెండో డోస్‌

3,94,29,559

60 సంవ‌త్స‌రాలు పైబ‌డిన‌వారు

మొద‌టి డోస్‌

7,61,31,656

రెండో డోస్‌

3,66,82,377

మొత్తం 

47,22,23,639

 

కోవిడ్ -19 నూత‌న సార్వ‌త్రిక టీకాక‌ర‌ణ కార్య‌క్ర‌మం 2021 జూన్ నుంచి ప్రారంభ‌మైంది. టీకా కార్య‌క్రమాన్ని వేగ‌వంతం చేసేందుకు  దేశ‌వ్యాప్తంగా దీనిని మ‌రింత విస్త‌రించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంది.
కోవిడ్ మ‌హ‌మ్మారి మొద‌లైన‌ప్ప‌టినుంచి కోవిడ్ బారిన ప‌డిన వారిలో మొత్తం 3,08,57,467 మంది కోలుకున్నారు. గ‌త 24 గంట‌ల‌లో 36,946 మంది పేషెంట్లు కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీనితో కోవిడ్ నుంచి మొత్తం కోలుకున్న వారి శాతం 97.35 శాతం గా ఉంది.

                                                                       

గ‌త 24 గంట‌ల‌లో ఇండియాలో 40,134 కోవిడ్ కొత్త కేసులు న‌మోద‌య్యాయి.
గ‌త 36 రోజులుగా రోజూ 50 వేల లోపు కొత్త కేసులు న‌మోదు అవుతున్నాయి. కేంద్ర‌, రాష్ట్ర‌ప్ర‌భుత్వాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల నిరంతర కృషి కార‌ణంగా కేసుల త‌గ్గుద‌ల సాధించ‌డం జ‌రిగింది.

                                                                           

ఇండియాలో క్రియాశీల కేస్ లోడ్ 4,13,718 గా ఉంది. క్రియాశీల కేసులు మొత్తం పాజిటివ్ కేసుల  సంఖ్య‌లో 1.31 శాతంగా ఉంది.
                                                                         


దేశ‌వ్యాప్తంగా కోవిడ్ వ్యాధి నిర్ధార‌ణ ప‌రిక్ష‌ల‌ను గ‌ణ‌నీయంగా పెంచ‌డం జ‌రిగింది. గ‌త 24 గంట‌ల‌లో దేశ‌వ్యాప్తంగా 14,28,984 కోవిడ్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేశారు.ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో 46.96 కోట్ల (46,96,45,494) కోవిడ్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేశారు.
ఒక  వైపు కోవిడ్ వ్యాధి నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు దేశ‌వ్యాప్తంగా పెంచ‌గా, వార‌పు పాజిటివిటీ రేటు దేశంలో 2.37 శాతంగా ఉంది. రోజువారి పాజిటివిటి రేటు ఈరోజు 2.81 శాతం. రోజువారి పాజిటివిటి రేటు వ‌రుస‌గా 56 రోజులుగా 5 శాతం కంటే తక్కువ‌లోనే ఉంది.

***


(Release ID: 1741431) Visitor Counter : 241