ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 అప్‌డేట్
Posted On:
31 JUL 2021 9:07AM by PIB Hyderabad
దేశవ్యాప్త వాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 46.15 కోట్ల వాక్సిన్‌డోస్‌లను పంపిణీ చేయడం జరిగింది.
దేశంలో ఇప్పటివరకు మొత్తం 3,07,81,263 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
రికవరీ రేటు ప్రస్తుతం 97.37 శాతంగా ఉంది.
గత 24 గంటలలో 37,291 మంది పేషెంట్లు కోవిడ్ నుంచి కోలుకున్నారు.
దేశంలో గత 24 గంటలలో 41,649 కొత్త కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇండియాలో ప్రస్తుతం క్రియా శీల కేస్‌లోడ్ 4,08,920
క్రియాశీల కేసులు మొత్తం కేసులలో 1.29 శాతం గా ఉన్నాయి.
వారపు పాజిటివిటి రేటు 5 శాతం కంటే తక్కువగా ఉంది. ప్రస్తుతం ఇది 2.42 శాతంగా ఉంది.
రోజువారి పాజిటివిటి రేటు 5 శాతం కంటే తక్కువగా, 2.34 శాతం వద్ద ఉంది.
దేశంలో కోవిడ్ పరీక్షల సామర్ధ్యాన్ని గణనీయంగా పెంచడం జరిగింది. ఇప్పటివరకు దేశంలో 46.64 కోట్ల కోవిడ్ పరీక్షలు నిర్వహించడం జరిగింది.
***
(Release ID: 1740991)