వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

పూర్తి అయిన‌ 92.8% రేష‌న్ కార్డుల ఆధార్ సీడింగ్


దేశంలోని 92.7% రేష‌న్ షాపుల వ‌ద్ద ఇపిఒఎస్ ప‌రిక‌రాలు

Posted On: 30 JUL 2021 3:44PM by PIB Hyderabad

జాతీయ స్థాయిలో 21.91 కోట్ల (92.8%) రేష‌న్ కార్డుల‌ను, 70.94 కోట్ల (90%) జాతీయ ఆహార భ‌ద్ర‌తా చ‌ట్ట ల‌బ్ధిదారుల ఆధార్ ను సీడింగ్ చేయ‌డాన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలూ పూర్తి చేశాయ‌ని కేంద్ర వినియోగ‌దారుల వ్య‌వ‌హారాలు, ఆహారం, ప్ర‌జా పంపిణీ మంత్రిత్వ శాఖ స‌హాయ మంత్రి సాధ్వీ నిరంజ‌న్ జ్యోతి శుక్ర‌వారం రాజ్య‌స‌భ‌లో అడిగిన ఒక ప్ర‌శ్న‌కు లిఖిత‌పూర్వ‌క స‌మాధానం ఇస్తూ వెల్ల‌డించారు. దేశంలోని 4.98 ల‌క్ష‌ల (92.7%) రేష‌న్ షాపులు 23/07/2021 నాటికి ఇపిఒఎస్  ప‌రిక‌రాల‌ను క‌లిగి ఉన్నాయ‌ని తెలిపారు. 
వ‌న్ నేష‌న్ వ‌న్ రేష‌న్ కార్డ్ (ఒఎన్ఒఆర్‌సి) ప్ర‌ణాళిక కింద నెల‌వారీగా స‌గ‌టున దాదాపు 1.6 కోట్ల పోర్ట‌బిలిటీ లావాదేవీలు నమోదు అయ్యాయ‌ని, ఇది దేశంలో జ‌రుగుతున్న ప్ర‌జా పంపిణీ వ్య‌వ‌స్థ (పిడిఎస్‌) లావాదేవీల‌లో కేవ‌లం 10% మాత్ర‌మేన‌ని అన్నారు. అంతేకాకుండా, అంత‌ర్‌-రాష్ట్ర (రాష్ట్రంలో /  కేంద్ర‌పాలిత ప్రాంతాల‌లో) అత్య‌ధిక సంఖ్య‌లో లావాదేవీలు స్థిరంగా క‌నిపించాయ‌ని, పిడిఎస్ సంస్క‌ర‌ణ‌ల కింద దాదాపు అన్ని రాష్ట్రాలు /  కేంద్ర‌పాలిత ప్రాంతాలూ ఆహార ధాన్యాల స‌ర‌ఫ‌రా గొలుసు నిర్వ‌హ‌ణ‌ను కంప్యూట‌రీక‌రించాయ‌ని మంత్రి వివ‌రించారు. 
అంత‌ర్ రాష్ట్ర పోర్ట‌బిలిటీ లావాదేవీల విష‌యానికి వ‌స్తే, ఇత‌ర రాష్ట్రాలు/  కేంద్ర‌పాలిత ప్రాంతాల నుంచి  వ‌లుస‌ వెళ్ళిన ఎన్ఎఫ్ఎస్ఎ ల‌బ్ధిదారుల‌కు అంత‌ర్ రాష్ట్ర పోర్ట‌బిలిటీ లావాదేవీల ద్వారా ఆహార ధాన్యాలు పంపిణీలో స‌ర్దుబాటుకు, స‌మ‌న్వ‌యానికి కేంద్ర వ్య‌వ‌స్థ ఎప్ప‌టిక‌ప్పుడు స‌హాయ‌, స‌హ‌కారాల‌ను, సౌల‌భ్య‌త‌ను ఇచ్చి సుల‌భ‌త‌రం చేస్తోంది. 
ఒఎన్ఒఆర్ సి ప్ర‌ణాళిక‌ను ఆగ‌స్టు 2019లో ప్ర‌వేశ‌పెట్టిన‌ప్ప‌టి నుంచి జూన్ 2021 వ‌ర‌కు 29 కోట్ల‌కు పైగా పోర్ట‌బిలిటీ లావాదేవీలు న‌మోదు అయ్యాయి. కాగా, ఈ పోర్ట‌బిలిటీ లావాదేవీల ద్వారా ల‌బ్దిపొందిన వ‌లుసదారుల సంఖ్య ఎక్కువ‌గా ఉండ‌వ‌చ్చు. ఎందుకంటే, ల‌బ్ధిదారు కుటుంబంలోని ఏ స‌భ్యుడైనా కూడా మొత్తం కుటుంబం త‌రుఫున ఒక‌టి లేదా అంత‌క‌న్నా ఎక్కువ లావాదేవీల ద్వారా ఆహార ధాన్యాల‌ను పొందే అవ‌కాశం ఉంది. 
జాతీయ ఆహార భ‌ద్ర‌తా చ‌ట్టం 2013 (ఎన్ఎఫ్ఎస్ఎ)లాభాలను పొందేందుకు దేశ‌వ్యాప్తంగా పోర్ట‌బిలిటీకి అవ‌కాశం ఇచ్చే వ‌న్ నేష‌న్ వ‌న్ రేష‌న్ కార్డ్ (ఒఎన్ఒఆర్‌సి) ప్ర‌ణాళిక ఇప్ప‌టికే 33 రాష్ట్రాలు /  కేంద్ర‌పాలిత ప్రాంతాల‌లో అమ‌లవుతూ, దేశంలోని దాదాపు 86.7% ఎన్ఎఫ్ఎస్ఎ (దాదాపు 69 కోట్ల ఎన్ఎఫ్ఎస్ఎ ల‌బ్ధిదారులు) జ‌నాభాకు వ‌ర్తిస్తోంది. జులై 2021 నుంచి దీనిని ప్రారంభించ‌డం ద్వారా ఢిల్లీ ఈ జాబితాలో తాజాగా చేరింది. రేష‌న్ కార్డుల పోర్ట‌బిలిటీని అమ‌లు చేసేందుకు వారి సాంకేతిక సంసిద్ధ‌త‌పై ఆధార‌ప‌డి సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ఒఎన్ఒఆర్‌సిని అమ‌లు చేయ‌వ‌ల‌సిందిగా మిగిలిన 3 రాష్ట్రాలైన ఛత్తీస్‌గ‌ఢ్‌, అస్సాం, ప‌శ్చిమ్ బెంగాల్ ను క్ర‌మ‌త‌ప్ప‌కుండా త‌మ శాఖ కోరుతోంద‌ని మంత్రి వివ‌రించారు. 

 

***
 



(Release ID: 1740890) Visitor Counter : 125