ప్రధాన మంత్రి కార్యాలయం

సిబిఎస్ఇ పరీక్షల లో విజయవంతం గా ఉత్తీర్ణులైనపన్నెండో తరగతి విద్యార్థులను అభినందించిన ప్రధాన మంత్రి

Posted On: 30 JUL 2021 4:04PM by PIB Hyderabad

సిబిఎస్ఇ పరీక్షల లో కృతార్థులైన పన్నెండో తరగతి విద్యార్థుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందన లు తెలిపారు. వారి ని యువ మిత్రులు అంటూ ఆయన సంబోధించారు; వారికి ఒక ఉన్నతమైనటువంటి, సంతోషదాయకమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి భవిష్యత్తు లభించాలి అని ప్రధాన మంత్రి ఆకాంక్షించారు.

 

‘‘ XII తరగతి సిబిఎస్ఇ పరీక్షల లో విజయవంతం గా ఉత్తీర్ణత ను సాధించిన నా యువ మిత్రుల కు అభినందనలు. వారికి ఒక ఉజ్వలమైన, సంతోషదాయకమైన, ఆరోగ్యకరమైన భవిష్యత్తు కై ఇవే శుభాకాంక్ష లు.

మరింత కఠోర కృషి ని చేసి ఉండవలసిందని గాని లేదా మరింత ఉత్తమమైనటువంటి ప్రదర్శన ను కనబరచి ఉండవలసిందని గాని భావించే వారికి నేను ఒకటి చెప్పదలచుకొన్నాను.. మీ అనుభవం లో నుంచి నేర్చుకోండి, మరి మీ శిరస్సు ను ఉన్నతం గా ఉంచుకోండి. ఒక ప్రకాశవంతమైనటువంటి, అవకాశాల తో నిండి ఉన్నటువంటి భవిష్యత్తు మీ కోసం వేచి ఉంది. మీలో ప్రతి ఒక్కరి లోనూ ప్రతిభ కు కొదువ లేదు. నా శుభాకాంక్షలు మీకు ఎప్పుడూ ఉంటాయి.

 

ఈ సంవత్సరం పన్నెండో తరగతి బోర్డుల కు హాజరు అయిన బ్యాచ్ ఇది వరకు ఎరుగని పరిస్థితులలో ఆ పని ని చేసింది.

గడచిన సంవత్సరం లో విద్య జగతి ఎన్నో మార్పుల ను చూసింది. అయినప్పటికి కూడా, వారు కొత్త సాధారణ స్థితి కి అలవాటు పడ్డారు, వారు వారి అత్యుత్తమ ప్రతిభ ను ప్రదర్శించారు. వారిని చూసి గర్వపడుతున్నాను ’’ అని ప్రధాన మంత్రి అనేక ట్వీట్ లలో పేర్కొన్నారు.

***

DS/SH


(Release ID: 1740793) Visitor Counter : 156