సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

న్యూస్ ఆన్ ఎయిర్ రేడియో లైవ్-స్ట్రీమ్ ఇండియా ర్యాంకింగ్స్


యువతను ఆకట్టుకుంటున్న జైపూర్, పాట్నా న్యూస్ ఆన్ ఎయిర్ ప్రసారాలు

Posted On: 30 JUL 2021 2:31PM by PIB Hyderabad

న్యూస్ఆన్ ఎయిర్ యాప్‌ ద్వారా ప్రసారం అవుతున్న ఆకాశవాణి ప్రసారాలు జైపూర్, పాట్నా లలో యువతను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఈ రెండు నగరాల్లో ఆకాశవాణి ప్రసారాలను వింటున్న వారిలో 60% వరకు 18 నుంచి 45 మధ్య వయసులో ఉన్నవారు ఉన్నారు. న్యూస్ ఆన్ ఎయిర్ ప్రసారాలకు ర్యాంకింగ్ ఇవ్వడానికి జనాభా ఆధారంగా పెద్ద నగరాల్లో నిర్వహించిన అధ్యయనంలో ఈ ఆసక్తికర అంశం వెల్లడయింది. 

కాస్మోపాలిటన్ నగరంగా పూణే తనను తాను రుజువు చేసుకుంది. నగరంలో న్యూస్ ఆన్ ఎయిర్ ప్రసారం అవుతున్న  ఆకాశవాణి మరాఠీ ప్రసారాలతో పాటు కన్నడ, హిందీ ప్రసారాలకు ఆదరణ లభించింది.  

న్యూస్‌ ఆన్‌ ఎయిర్  యాప్‌లో ప్రసారం అవుతున్న ఆకాశవాణి  రేడియో లైవ్-స్ట్రీమ్‌లు ఎక్కువ  ప్రాచుర్యం పొందిన దేశంలోని ప్రధాన నగరాల ర్యాంకింగ్స్‌లో అహ్మదాబాద్ టాప్ 10 లో చోటు దక్కించుకుంది.  భోపాల్‌ తొమ్మిదవ స్థానంతో పాటు టాప్ 10 లో స్థానం కోల్పోయింది. 

ప్రసార భారతి అధికార యాప్ అయిన  న్యూస్ ఆన్ ఎయిర్ లో ఆకాశవాణి 240 కి పైగా రేడియో కార్యక్రమాలు ప్రసారం అవుతున్నాయి. న్యూస్‌ ఆన్‌ ఎయిర్  యాప్‌లో ప్రసారం అవుతున్న ఆకాశవాణి ప్రసారాలకు భారతదేశంలో మాత్రమే కాకుండా  ప్రపంచవ్యాప్తంగా 85 కి పైగా దేశాలు, 8000 నగరాల్లో పెద్ద సంఖ్యలో శ్రోతలు ఉన్నారు.

భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో న్యూస్‌ ఆన్‌ ఎయిర్  యాప్‌లో ప్రసారం అవుతున్న ఆకాశవాణి  రేడియో ప్రసారాలను శ్రోతలు వింటున్నారు. జూలై 1 నుంచి 2021 జూలై 15 వరకు పక్షం రోజుల సమాచారం ఆధారంగా ఈ ర్యాంకింగ్‌లు ఇవ్వబడ్డాయి. 

***


(Release ID: 1740697)