సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారాలో దివ్యాంగుల కోసం "సామాజిక్ అధికారిత శివిర్"
Posted On:
30 JUL 2021 11:47AM by PIB Hyderabad
కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖకు చెందిన ఏడీఐపీ పథకం కింద, దివ్యాంగులకు సాయం, సహాయక పరికరాలను అందజేసేందుకు మధ్యప్రదేశ్‌లోని ఇమ్లికేడా ఛింద్వారాలో ఉన్న ఎఫ్‌డీడీఐ వద్ద "సామాజిక్ అధికారిత శివిర్" నిర్వహించనున్నారు. 'అలిమ్‌కో', చిద్వారా జిల్లా యంత్రాంగం సహకారంతో 'దివ్యాంగుల సాధికారత విభాగం' (డీఈపీడబ్ల్యూడీ) 31.07.2021న ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది.
రూ.4.32 కోట్ల విలువైన 8291 సహాయక పరికరాలను 4146 మంది దివ్యాంగులకు ఉచితంగా పంచనున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ, బ్లాక్/పంచాయతీ స్థాయుల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది.
31.07.2021న ఉదయం 11 గంటలకు కార్యక్రమం పారంభమవుతుంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివ్‌రాజ్‌సింగ్ చౌహాన్ ముఖ్య అతిథిగా వర్చువల్ పద్ధతిలో ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ మంత్రి శ్రీ వీరేంద్ర కుమార్ అధ్యక్షత వహిస్తారు. మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి సుశ్రీ ప్రతిమ భౌమిక్, రాజ్యసభ సభ్యుడు శ్రీ వికాస్ మహాత్మే, చింద్వారా ఎంపీ శ్రీ నకుల్‌నాథ్ నేరుగాగానీ, పర్చువల్ పద్ధతిలోగానీ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
డీఈపీడబ్ల్యూడీ కార్యదర్శి శ్రీమతి అంజలి భావ్రా, ఇతర సీనియర్ అధికారులు, అలిమ్‌కో, జిల్లాకు చెందిన అధికారులు కూడా వర్చువల్‌గాగానీ, నేరుగాగానీ హాజరవుతారు.
ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం లింక్ https://youtu.be/o2qvsRbJnm8
***
(Release ID: 1740664)
Visitor Counter : 206