యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
ప్రజా ఉద్యమంగా 'ఫిట్ ఇండియా' కార్యక్రమం అమలు: శ్రీ అనురాగ్ ఠాకూర్
Posted On:
29 JUL 2021 4:28PM by PIB Hyderabad
ప్రధాన ముఖ్య అంశాలు:
* ' ఫిట్ ఇండియా'(శరీర సౌస్ఠవం) కార్యక్రమం కింద సంబంధిత వర్గాలతో కలిసి వివిధ కార్యకలాపాలు మరియు ప్రచారాల ద్వారా శరీర సౌస్ఠవం (ఫిట్ నెస్ ) పై మంత్రిత్వ శాఖ అవగాహన కల్పిస్తున్నది.
* వివిధ వయసుల వారికి వారి వయస్సుకి తగిన ఫిట్‌నెస్ కార్యక్రమాలు ఫిట్ ఇండియా కింద ప్రవేశపెట్టబడ్డాయి.
' ఫిట్ ఇండియా'(శరీర సౌస్ఠవం) కార్యక్రమం కింద సంబంధిత వర్గాలతో కలిసి వివిధ కార్యకలాపాలు మరియు ప్రచారాల ద్వారా శరీర సౌస్ఠవం (ఫిట్ నెస్ ) పై మంత్రిత్వ శాఖ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఆన్‌లైన్ / ఆఫ్‌లైన్ విధానాల్లో మంత్రిత్వ శాఖ లాక్ డౌన్ సమయంలో ప్లగ్ రన్, స్కూల్ సర్టిఫికేషన్ సిస్టమ్, యూత్ క్లబ్ సర్టిఫికేషన్ సిస్టమ్, స్కూల్ వీక్ వేడుకలు, సైక్లోథాన్, యోగా డే వేడుక, ఫ్రీడమ్ రన్, యాక్టివ్ డే సిరీస్ లాంటి కార్యక్రమాలను ప్రారంభించింది. మంత్రిత్వ శాఖ ఛాంపియన్ టాక్స్, డైలాగ్ సిరీస్, ఇండిజీనస్ గేమ్స్ సిరీస్, ఫిట్ ఇండియా థిమాటిక్ క్యాంపెయిన్, మరియు ప్రభాత్ ఫెరిస్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నది. వివిధ వయసుల వారికి వారి వయస్సుకి తగిన ఫిట్‌నెస్ కార్యక్రమాలు ఫిట్ ఇండియా కింద ప్రవేశపెట్టబడ్డాయి.
భారతీయ సంస్కృతిలో ఎల్లప్పుడూ అంతర్భాగంగా ఉన్న సాధారణ శారీరక శ్రమల ప్రాధాన్యతను వివరిస్తూ ఫిట్ ఇండియా కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి అవగాహనా కార్యక్రమాలను మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్నది. ఫిట్ ఇండియా కార్యక్రమం కింద నిర్వహిస్తున్న అన్ని కార్యక్రమాలు / కార్యకలాపాల్లో పాల్గోవాలని కార్పొరేట్ సంస్థలను ఆహ్వానించడం జరుగుతున్నది. ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్, ఫిట్ ఇండియా సైక్లోథాన్ మొదలైన కార్యక్రమాల నిర్వహణలో కార్పొరేట్ సంస్థల నుంచి మంచి స్పందన లభించింది.
ఫిట్ ఇండియాను ప్రజల ఉద్యమంగా మార్చడంలో కేంద్ర ప్రభుత్వ పాత్ర స్ఫూర్తిని ఇవ్వడానికి మాత్రమే పరిమితం అయ్యింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక నిధులు కేటాయించబడలేదు.
ఈ సమాచారాన్ని యువజన వ్యవహారాలు మరియు క్రీడా శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ ఈ రోజు లోక్ సభలో లిఖితపూర్వక సమాధానంలో ఇచ్చారు.
***
(Release ID: 1740381)
Visitor Counter : 200