మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
లాక్ డౌన్ సమయంలో ఆన్‌లైన్ తరగతులు
Posted On:
29 JUL 2021 3:07PM by PIB Hyderabad
విద్యార్థులందరికీ ఆన్‌లైన్ లో చదువుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకుని రావడానికి ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్‌లో భాగంగా 2020 మే 17 న పిఎం ఈ విద్య కార్యక్రమం ప్రారంభించబడింది. దీనిద్వారా విద్యను డిజిటల్ / ఆన్‌లైన్ / ఆన్-ఎయిర్ విద్య సౌకర్యాలను ఒకేచోట అందించడం జరుగుతుంది. చేస్తుంది. దీని ద్వారా అమలు జరుగుతున్న కార్యక్రమాలు :
* రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల్లో పాఠశాల విద్య కోసం నాణ్యమైన ఇ-కంటెంట్‌ను అందించడానికి దేశ డిజిటల్ మౌలిక సదుపాయాల వేదికగా డిక్షా (ఒక దేశం, ఒక డిజిటల్ ప్లాట్‌ఫాం) ప్రారంభం అయ్యింది. దీనిద్వారా అన్ని తరగతులకు సంబంధించిన పాఠ్యపుస్తకాలను క్యూఆర్ కోడ్ తో అందుబాటులో ఉంచడం జరిగింది.
* 1 నుంచి 12 తరగతి వరకు ప్రత్యేకంగా ఒక స్వయం ప్రభ టీవీ ఛానెల్ (ఒక తరగతి, ఒక ఛానల్).
* రేడియో, సామాజిక రేడియో మరియు సీబీఎస్ఈ పోడ్కాస్ట్- శిక్షావాణి ల విస్తృతమైన ఉపయోగం.
* దృశ్యపరంగా మరియు వినికిడి లోపం ఉన్నవారికి సంకేత భాషలో ప్రత్యేక ఇ-కంటెంట్ డిజిటల్ సమాచార వ్యవస్థ (DAISY) మరియు NIOS వెబ్‌సైట్ / యూట్యూబ్‌లో అభివృద్ధి చేయబడింది.
ఈ పథకాలు / కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరికీ అందుబాటులో ఉన్నాయి.
ఆన్‌లైన్ విద్యను ప్రోత్సహించడానికి యుజిసి అవసరమైన నియంత్రణను విడుదల చేసింది. దీనితో విశ్వవిద్యాలయాలకు పూర్తి స్థాయి ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌ను అందించడానికి వీలు కలుగుతుంది. కోవిడ్ -19 సమయంలో జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇంతవరకు యూజీసీ స్వయం మరియు ఓడిఎల్ రెగ్యులేషన్స్ నిబంధనల 20% వరకు ఉన్న ఆన్‌లైన్ కోర్సులను 40%కి పెంచడం జరిగింది. . ఇ-వనరుల సమర్ధ వినియోగానికి కూడా ఇది దోహదపడుతుంది.
విద్యా మంత్రిత్వ శాఖ వివిధ డిజిటల్ కార్యక్రమాలను కూడా అమలు చేస్తున్నది.విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకుని రావడానికి స్వయం , స్వయం ప్రభ, నేషనల్ డిజిటల్ లైబ్రరీ (ఎన్ డి ఎల్), వర్చువల్ ల్యాబ్, ఈ-యంత్ర, నీట్ (టెక్నాలజీ కోసం నేషనల్ ఎడ్యుకేషన్ అలయన్స్), ఫోసీ (ఉచిత ఓపెన్-సోర్స్ సాఫ్ట్‌వేర్ విద్య) మొదలైన కార్యక్రమాలు దీనిలో ఉన్నాయి.
ఈ సమాచారాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఈ రోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో ఇచ్చారు.
***
(Release ID: 1740357)