నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ

పవన శక్తి ద్వారా జరిగే విద్యుత్ ఉత్పత్తిలో వినియోగించే వస్తు సామగ్రిలో 70 శాతానికి పైగా భారత్ లోనే తయారీ


పవన విద్యుత్ ప్రాజెక్టులకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు (జీబీఐ)

పవన శక్తి విద్యుత్ జెనెరేటర్ల విడి భాగాలకు కస్టమ్ డ్యూటీపై రాయితీ

Posted On: 29 JUL 2021 2:54PM by PIB Hyderabad

అనుమతి ఉన్న మోడళ్ళు, తయారీదారుల జాబితాను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ జాబితాలో ఉన్న తయారీదారులే పవన శక్తి విద్యుత్ ప్రోజెక్టుల స్థాపించడానికి అనుమతి ఉంటుంది. 70 శాతానికి పైగా పరికరాలు భారత్ లోనే తయారవుతున్నాయి. దేశంలో పవన శక్తితో సహా పునరుత్పాదక ఇంధన శక్తిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. 

  • ఆటోమేటిక్ రూట్ కింద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డిఐ) 100 శాతం వరకు అనుమతిస్తోంది, 
  • 2025 జూన్ 30 లోగా ప్రారంభించాల్సిన ప్రాజెక్టుల కోసం సౌర, పవన విద్యుత్తును అంతర్-రాష్ట్ర అమ్మకం కోసం ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ (ఐఎస్టిఎస్) చార్జీల రద్దు, 
  • 2022 సంవత్సరం వరకు పునరుత్పాదక కొనుగోలు బాధ్యత (ఆర్పీఓ) కోసం ట్రాజెక్టరీ ప్రకటన, 
  • ప్లగ్ అండ్ ప్లే ప్రాతిపదికన ఆర్ఈ డెవలపర్‌లకు భూమి, ట్రాన్స్మిషన్ అందించడానికి అల్ట్రా మెగా రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్‌లను ఏర్పాటు చేయడం, 
  • కొత్త ప్రసార మార్గాలను వేయడం, పునరుత్పాదక శక్తిని పూర్తి స్థాయిలో వినియోగించడానికి కొత్త సబ్ -స్టేషన్ సామర్థ్యాన్ని అందుబాటులోకి తేవడం,
  • పెట్టుబడులను ఆకర్షించడానికి మరియు సులభతరం చేయడానికి ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ సెల్ ఏర్పాటు,
  • గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ పివి మరియు విండ్ ప్రాజెక్టుల నుండి విద్యుత్ సేకరణ కోసం టారిఫ్ ఆధారిత పోటీ బిడ్డింగ్ ప్రక్రియ కోసం ప్రామాణిక బిడ్డింగ్ మార్గదర్శకాలు.
  • ఆర్ఈ జనరేటర్లకు పంపిణీ లైసెన్సుల ద్వారా సకాలంలో చెల్లింపును నిర్ధారించడానికి లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్సీ) లేదా ముందస్తు చెల్లింపుల మేరకు విద్యుత్ విడుదల చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 
  • ఆర్ఈ ప్రాజెక్టుల అమలు, ఆపరేషన్ మరియు నిర్వహణ కోసం నైపుణ్యం కలిగిన సిబ్బందిని అందుబాటులోకి తేవడానికి  నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడం.
  •  పై వాటితో పాటు, పవన శక్తిని ప్రోత్సహించడానికి ఈ క్రింది చర్యలు ప్రత్యేకంగా తీసుకుంటున్నారు:
  • పవన విద్యుత్ జనరేటర్ల తయారీకి అవసరమైన కొన్ని భాగాలపై రాయితీలో కస్టమ్ డ్యూటీ మినహాయింపు.
  • 31 మార్చి 2017 న లేదా అంతకు ముందు ప్రారంభించిన పవన ప్రాజెక్టులకు జనరేషన్ ఆధారిత ప్రోత్సాహకం (జిబిఐ) అందిస్తారు.
  • చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ ద్వారా పవనశక్తి వనరుల అంచనా, సంభావ్య సైట్ల గుర్తింపుతో సహా సాంకేతిక మద్దతు.

 

పవన వనరు అత్యంత ప్రత్యేకమైనది, దాని వాణిజ్యపరంగా వెలికి తీసే సామర్థ్యం ఏడు రాష్ట్రాల్లో మాత్రమే అందుబాటులో ఉంది, అవి: ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక. ప్రాజెక్ట్ సాంకేతిక-ఆర్థిక సాధ్యత ఆధారంగా ప్రైవేట్ డెవలపర్లు పవన విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తారు.

20,000 మెగావాట్ల సంచిత సామర్థ్యం కలిగిన పవన విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి టెండర్లను దేశంలోని వివిధ కేంద్ర, రాష్ట్ర సంస్థలు ఆహ్వానించాయి, వీటిలో 14,332 మెగావాట్ల ప్రాజెక్టులకు అనుమతి లభించింది. 30.06.2021 నాటికి దేశంలో 39,486 మెగావాట్ల సామర్థ్యం గల పవన విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేశారు
 

ఈ సమాచారాన్ని కేంద్ర విద్యుత్, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి శ్రీ ఆర్.కె.సింగ్ ఈ రోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో వివరించారు. 

***



(Release ID: 1740336) Visitor Counter : 192