అంతరిక్ష విభాగం
జియో ఇమేజింగ్ ఉపగ్రహం ఇఒఎస్ -03 ప్రయోగం 2021 మూడవ త్రైమాసికంలో ప్రయోగానికి సిద్ధం - డాక్టర్ జితేంద్ర సింగ్
వరదలు, తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలను దాదాపు వాస్తవకాలంలో గుర్తించేందుకు తోడ్పడనున్న జియో ఇమేజింగ్ ఉపగ్రహం
అటవీ విస్తీర్ణాలలో వస్తున్న మార్పులు, చెట్లు చేమల స్థితి, పంటలు, నీటి వనరులను తదితరాలను పర్యవేక్షించేందుకు తోడ్పడనున్న ఇఒఎస్ -03
Posted On:
29 JUL 2021 12:18PM by PIB Hyderabad
వరదలు, తుపాన్ల వంటి ప్రకృతి వైపరీత్యాలను నిజయ సమయంలో పర్యవేక్షించే జియో-ఇమేజింగ్ ఉపగ్రహం ఇఒఎస్-03ను 2021 త్రైమాసికంలో ప్రయోగించనున్నట్టు కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ (ఇండిపెండెంట్ చార్జి), ఎర్త్ సైన్సెస్ (ఇండిపెండెంట్ ఛార్జి), ప్రధాన మంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా సమస్యలు, పింఛన్లు, అణు శక్తి, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. గురువారం రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇస్తూ, రోజుకు 4-5 సార్లు చిత్రాలను తీయగల సామర్ధ్యం ఇఒఎస్ -03కు ఉందని ఇస్రో గుర్తించిందని ఆయన అన్నారు. ప్రకృతి వైపరీత్యాలను గుర్తించడానికి అదనంగా ఇఒఎస్-03 నీటి వనరులు, పంటలు, చెట్టు చేమల పరిస్థితి, అటవీ విస్తరణలో వస్తున్న మార్పులను కూడా పర్యవేక్షించగలదు.
ఇక స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ లేదా ఎస్ఎస్ఎల్‌వి తొలి ఫ్లైట్ ను సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం, శ్రీహరికోట నుంచి 2021 నాలుగవ త్రైమాసికంలో ప్రయోగించనున్నారు. ఘన చోదన, నిరూపిత నమూనా పద్ధతుల వారసత్వంలో ఇస్రో విస్తారమైన అనుభవం తక్కువ ఖర్చుతో కూడిన, మూడు దశల, 500 కిలోల నుంచి 500 కిమీల ప్లానర్ కక్ష్య లేదా సన్ సింక్రోనస్ ధ్రువ కక్ష్యకు 300 కెజిల బరువుగల సంపూర్ణ ఘన ప్రయోగ వాహనంగా ఎస్ఎస్ఎల్ విని తీర్చిదిద్దగలిగింది. చిన్న ఉపగ్రహాల ప్రయోగానికి ఉన్న డిమాండ్‌ను శీఘ్రంగా తీర్చడానికి ఎస్ఎస్ఎల్‌వి అనువైనది. ఎస్ఎస్ఎల్‌విని సాధించడంలో భాగంగా అభివృద్ధి చేసిన సాంకేతికతలు ఎలక్ట్రో మెకానికల్ ప్రేరణలు కలిగిన సరళమైన నాజిల్ నియంత్రణ, సూక్ష్మీకరించిన ఏవియానిక్స్, కచ్చితంగా ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టేందుకు ఎగువ దశలో వేగాన్ని తగ్గించే మాడ్యూల్ లు ఉన్నాయి.
***
(Release ID: 1740332)
Visitor Counter : 293