రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

రహదారుల నిర్మాణంలో ప్లాస్టిక్‌ వ్యర్థాల వినియోగం

Posted On: 29 JUL 2021 2:17PM by PIB Hyderabad

ఇప్పటివరకు 703 పొడవైన జాతీయ రహదారుల నిర్మాణంలో, పైపొర మిశ్రమంలో ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఉపయోగించారు. జాతీయ రహదారుల పేవ్‌మెంట్ల కాలానుగుణ మరమ్మతులలో ప్లాస్టిక్‌ వ్యర్థాలను తప్పనిసరిగా ఉపయోగించాలని, 5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న పట్టణ ప్రాంతాలకు 50 కిలోమీటర్ల పరిధిలో నిర్మించే సర్వీస్‌ రోడ్లలోనూ ఉపయోగించాలని మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. రహదారుల నిర్మాణంలో ప్లాస్టిక్‌ వ్యర్థాల వినియోగం వల్ల, పర్యావరణానికి పాస్టిక్‌ ముప్పు తప్పుతుంది. 

    కేంద్ర రహదారి రవాణా, హైవేల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఈ సమాచారాన్ని లిఖితపూర్వక సమాధానంగా ఇవాళ లోక్‌సభకు సమర్పించారు.

 

***
 


(Release ID: 1740292) Visitor Counter : 236


Read this release in: English , Urdu , Marathi , Bengali