అంతరిక్ష విభాగం

అంతరిక్ష కార్యక్రమాల బిల్లును ప్రభుత్వం చురుకుగా పరిశీలిస్తోంది- డాక్టర్ జితేంద్ర సింగ్


అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థల నియంత్రణ, ప్రోత్సాహం లక్ష్యంగా ఈ బిల్లు

అంతరిక్ష సాంకేతిక అభివృద్ధి, సర్వీసులు, పరికరాల స్వదేశీ ఉత్పత్తిలో మరింత ప్రైవేటు భాగస్వామ్యం ప్రోత్సహించడానికి పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

Posted On: 29 JUL 2021 12:19PM by PIB Hyderabad

అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థల నియంత్రణ, ప్రోత్సాహం లక్ష్యంగా అంతరిక్ష కార్యక్రమాల బిల్లును ప్రభుత్వం చురుకుగా పరిశీలిస్తోందని కేంద్ర సైన్స్, టెక్నాలజీ సహాయమంత్రి (ఇండిపెండెంట్ ఛార్జ్) ; ఎర్త్ సైన్సెస్; ఎంఓఎస్‌ పిఎంఓ, సిబ్బంది, ప్రజాసమస్యలు, పెన్షన్స్, అణుశక్తి, అంతరిక్షం శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇస్తూ అంతరిక్ష సాంకేతిక అభివృద్ధి, సర్వీసులు, పరికరాల స్వదేశీ ఉత్పత్తిలో మరింత ప్రైవేటు భాగస్వామ్యం ప్రోత్సహించడానికి పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి, ఓ విధానాన్ని ప్రభుత్వం రూపకల్పన చేస్తోందని కేంద్ర మంత్రి వెల్లడించారు. 

కేంద్ర ప్రభుత్వం 2020 జూన్ లో అంతరిక్ష రంగంలో సంస్కరణలను ప్రకటించింది. భారతదేశంలో ప్రైవేట్ అంతరిక్ష కార్యకలాపాలు ప్రోత్సహించడం, హ్యాండ్‌హోల్డింగ్, లైసెన్సింగ్, అధికారం మరియు పర్యవేక్షణ ఆదేశాలతో అంతరిక్ష శాఖ క్రింద భారత జాతీయ అంతరిక్ష ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఇన్-స్పేస్) ఒక స్వతంత్ర నోడల్ ఏజెన్సీగా ఏర్పాటు చేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ (డాస్) సదుపాయాలు మరియు నైపుణ్యం వారి అంతరిక్ష కార్యకలాపాలకు మద్దతుగా ప్రైవేట్ సంస్థలకు విస్తరించారు. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం కొత్త డొమైన్లలో సవాళ్లను ముందుంచి అందుకు తగ్గ అవకాశాలను ప్రకటించారు. అంతరిక్ష రంగంలో అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని భారతీయ పరిశ్రమలకు బదిలీ చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. దీనితో పాటు, కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాలు మరియు మార్గదర్శకాలను తీసుకువస్తోంది, ఇప్పటికే ఉన్న విధానాలను సవరిస్తోంది.

ప్రైవేట్ సంస్థలకు ప్రాప్యతను అనుమతించేటప్పుడు ఇస్రో సంస్థాపనల భద్రతను నిర్ధారించడానికి రూపుదిద్దుకుంటున్న ఇన్-స్పేస్, సేఫ్టీ-సెక్యూరిటీ డైరెక్టరేట్ కలిగి ఉంటుంది. ప్రజా సంప్రదింపులు జరిగాయి, సంబంధిత విభాగాలు, మంత్రిత్వ శాఖలను సంప్రదించారు.

పారిశ్రామికవేత్త / అకాడెమియా / స్టార్ట్-అప్ లతో పాటు సాధారణ ప్రజల భాగస్వామ్యంతో నాలుగు అంతరిక్ష కార్యక్రమాలను కవర్ చేసే నాలుగు సెషన్లతో కూడిన ‘అన్లాకింగ్ ఇండియా అంతరిక్ష రంగంలో’ ప్రత్యేక వెబ్‌నార్ నిర్వహించారు. అన్ని సూచనలు పరిగణనలోకి తీసుకుని తగు విధంగా తదుపరి చర్యలు చేపట్టడానికి నిర్ణయించారు. 

<><><><><>



(Release ID: 1740264) Visitor Counter : 192