ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో సమావేశమైన యూఎస్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ఏంటనీ బ్లింకెన్

Posted On: 28 JUL 2021 8:17PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో యూఎస్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ఏంటనీ బ్లింకెన్ ఈ రోజు న సమావేశమయ్యారు.


అధ్యక్షుడు శ్రీ బైడెన్, ఉపాధ్యక్షురాలు హ్యారిస్ గారు ల పక్షాన ప్రధాన మంత్రి కి శ్రీ బ్లింకెన్ శుభాకాంక్షలు తెలిపారు. అంతక్రితం ఇఎఎమ్ తో, ఎన్ఎస్ఎ తో తాను జరిపిన భేటీ లు ఫలప్రదం అయిన సంగతి ని శ్రీ బ్లింకెన్ ప్రధాన మంత్రి దృష్టి కి తీసుకుపోయారు. దీనితో పాటే రక్షణ, సముద్ర సంబంధిత భద్రత, వ్యాపారం- పెట్టుబడి, జలవాయు పరివర్తన, విజ్ఞాన శాస్త్రం- సాంకేతిక విజ్ఞానం సహా వివిధ రంగాల లో భారతదేశం, యుఎస్ వ్యూహాత్మక సంబంధాల ను మరింత గా బలపరచుకోవడానికి గట్టి నిబద్ధత తో ఉన్నట్లు శ్రీ బ్లింకెన్ వెల్లడించారు.


అధ్యక్షుడు శ్రీ బైడెన్ కు, ఉపాధ్యక్షురాలు హ్యారిస్ గారి కి ప్రధాన మంత్రి తన తరఫు న ఆత్మీయ అభినందనలను వ్యక్తం చేశారు. క్వాడ్, కోవిడ్ -19, ఇంకా జలవాయు పరివర్తనల కు సంబంధించిన కార్యక్రమాలు సహా అధ్యక్షుడు శ్రీ బైడెన్ తీసుకొన్న వివిధ కార్య క్రమాల పట్ల శ్రీ నరేంద్ర మోదీ తన ప్రశంసల ను వ్యక్తం చేశారు.

భారతదేశానికి, యుఎస్ కు మధ్య అనేక ద్వైపాక్షిక అంశాల పై, బహుళ పాక్షిక అంశాల పై సామరస్యం పెంపొందడం, మరి ఈ పొందిక పటిష్టమైనటువంటి, ఆచరణ పూర్వకమైనటువంటి సహకారం గా మార్పు చెందేలా ఉభయ వ్యూహాత్మక భాగస్వాములు అవలంబిస్తున్న వచనబద్ధత ను యూఎస్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ఏంటనీ బ్లింకెన్ కొనియాడారు.


యుఎస్, భారతదేశం సమాజాలు ప్రజాస్వామ్యం, స్వేచ్ఛా,స్వాతంత్య్రాల పట్ల ఒక ప్రగాఢమైన నిబద్ధత ను కలిగి ఉన్నాయని, యూఎస్ లో ఉంటున్న భారతీయ సముదాయం ద్వైపాక్షిక సంబంధాల ను పెంచడం కోసం ఎంతగానో తోడ్పడిందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

కోవిడ్ 19 రువ్విన సవాళ్లు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకొనే క్రమం లో ఉండడం, జలవాయు పరివర్తన ల సందర్భం లో రాబోయే కాలం లో భారతదేశం- యుఎస్ వ్యూహాత్మక భాగస్వామ్యాని కి ప్రపంచం దృష్టి లో విస్తృత ప్రాముఖ్యం ఏర్పడుతుంది అని ప్రధాన మంత్రి అన్నారు.

 

 

***



(Release ID: 1740205) Visitor Counter : 224