ప్రధాన మంత్రి కార్యాలయం
టోక్యో ఒలింపిక్స్ కు వెళ్తున్న భారతదేశ క్రీడాకారుల దళం తో ప్రధాన మంత్రి జరిపిన సంభాషణ
Posted On:
13 JUL 2021 11:30PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి: దీపిక గారు, నమస్తే.
దీపిక: నమస్తే సర్.
ప్రధాన మంత్రి: దీపిక గారు, నా మునుపటి ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) సంచిక లో మీ గురించి, ఇతర సహచరుల గురించి చర్చించాను. మీరు ఇటీవల పారిస్ లో బంగారు పతకాన్ని సాధించిన తరువాత దేశ వ్యాప్తం గా మీ గురించి మాట్లాడుకొంటున్నారు. ఇప్పుడు మీరు ప్రపంచం లో నంబర్ వన్ స్థానం లో ఉన్నారు. సాధన చేస్తున్నప్పుడు మీరు మీ బాల్యం లో మామిడి పండ్ల ను పడగొట్టడం కోసం గురి పెట్టే వారు అనే సంగతి ని నేను ఎరుగుదును. మామిడి పండ్ల తో మొదలైన మీ ప్రయాణం చాలా ప్రత్యేకమైంది. ఈ ప్రయాణాన్ని గురించి దేశం చాలా తెలుసుకోవాలని అనుకొంటోంది. మీరు ఏమైనా చెబితే బాగుంటుంది.
దీపిక: సర్, నా ప్రయాణం ఆరంభం నుంచే చాలా బాగుంది. మామిడి పళ్లు అంటే నాకు ఎంతో ఇష్టం, ఈ కారణం గానే కథ తయారైంది. అక్కడ సౌకర్యాలు సరిగ్గా లేనందున ప్రారంభం లో కొద్దిగా కష్టపడడం జరిగింది. కానీ ఒక సంవత్సరం తరువాత, నాకు చాలా మంచి సదుపాయాలు అందివచ్చాయి, చాలా మంచి కోచ్ లు కూడా దొరికారు.
ప్రధాన మంత్రి: దీపిక గారూ, మీరు ఇంతటి విజయ శిఖరాలకు చేరుకొన్నప్పుడు మీ పైన ప్రజలు పెట్టుకొన్న అంచనాలు కూడా పెరుగుతాయి. ఇక అతి పెద్దవైన క్రీడోత్సవాలు- ఒలింపిక్స్ - ముందు ఉంది. కాబట్టి మీరు అంచనాల ను, శ్రద్ధ ను ఎలా సంతులనం చేసుకోగలుగుతున్నారు?
దీపిక: సర్, అంచనాలు ఉన్నాయి కానీ అవి అత్యధికమైనటువంటి అంచనా లు. మరి మేం దానిపైన దృష్టి సారించాం. నేను నా అభ్యాసం పైన, నేను ఎలా ఆడాలి అనే విషయం మీద ఎక్కువ గా శ్రద్ధ తీసుకొంటున్నాను.
ప్రధాన మంత్రి: సరే, మీకు చాలా అభినందన లు. మీరు పోరాడడం వదలలేదు; అంతే కాదు, ఆ సవాళ్లను మీ బలం గా మార్చుకొన్నారు. తెర మీద నాకు మీ కుటుంబ సభ్యులు కూడా కనుపిస్తున్నారు. వారికి నా అభినందన లు. ఒలింపిక్స్ లో కూడా మీరు దేశాన్ని గర్వపడేలా చేస్తారు అని దేశాని కి పూర్తి నమ్మకం ఉంది. మీకు నా శుభాకాంక్షలు.
దీపిక: ధన్యవాదాలు, సర్.
ప్రధాన మంత్రి: ప్రవీణ్ కుమార్ జాదవ్ గారి తో ఇప్పుడు మాట్లాడుదాం. ప్రవీణ్ గారు, నమస్తే.
ప్రవీణ్: నమస్తే సర్.
ప్రధాన మంత్రి: ప్రవీణ్ గారు, మీరు ఇంతకు ముందు క్రీడాకారుడు కావడానికి శిక్షణ తీసుకొన్నారని నాకు చెప్పారు.
ప్రవీణ్: అవును సర్.
ప్రధాన మంత్రి: ఈ రోజు మీరు ఒలింపిక్స్ లో విలువిద్య కోసం దేశానికి ప్రాతినిధ్యం వహించబోతున్నారు. ఈ మార్పు ఎలా జరిగింది?
ప్రవీణ్: సర్, ఇంతకు ముందు నేను వ్యాయామ క్రీడల (ఎథ్ లెటిక్స్) అభ్యాసం చేసే వాడిని. దానితో ప్రభుత్వం తాలూకు అకాడమీ లో ఎథ్ లెటిక్స్ కు ఎంపిక అయ్యాను. అక్కడ కోచ్ లు నా శరీరం కొంచెం బలహీనం గా ఉంది కాబట్టి మీరు వేరే ఆట లో రాణించే అవకాశం ఉంది అని అనే వారు. ఆ తరువాత నాకు విలువిద్య ఆట ను సూచించడం జరిగింది. నేను అమరావతి లో విలువిద్య గేము ను కొనసాగించాను.
ప్రధాన మంత్రి: సరే, ఈ మార్పు చోటు చేసుకొన్నప్పటికీ కూడాను మీరు మీ ఆట లో ఆత్మవిశ్వాసాన్ని, పరిపూర్ణత ను ఎలా తీసుకు వచ్చారు?
ప్రవీణ్: సర్, నిజానికి మా ఇంటి ఆర్థిక స్థితి సరిగా లేదు.
ప్రధాన మంత్రి: నాకు మీ తల్లితండ్రులు కనుపిస్తున్నారు. నేను వారికి కూడా వందనం చేస్తున్నాను. ఆఁ, సోదరా ప్రవీణ్ చెప్పండి.
ప్రవీణ్: ఇంటి కి వెళ్లి నేను కూడా కాయకష్టం చేయవలసి ఉంటుంది అనే సంగతి నాకు తెలుసు. అంతకంటే మంచిది ఏమిటి అంటే ఇక్కడ కష్టపడి ముందు ముందు ఏదైనా మంచి పని ని చేయడం అనేదే. ఈ కారణం గా నేను దీనిలోనే కొనసాగాను.
ప్రధాన మంత్రి: చూడండి, మీ బాల్యం లో ఉన్న కష్టతరమైన పోరాటాల గురించి తెలుసుకొన్నాను మరి మీ తల్లితండ్రులు కూడాను ఏ విధం గా తండ్రి గారు దినసరి కూలీ దశ నుంచి ఇవాళ దేశాని కి ప్రాతినిధ్యం వహించే వరకు యాత్ర ను చేశారో అది చాలా ప్రేరణ ను ఇచ్చేటటువంటిది గా ఉంది. మీరు ఇలాంటి కఠినమైన జీవితాన్ని గడిపారు, కానీ లక్ష్యాన్ని మీ కళ్ళ ముందు నుండి ఎన్నడూ దూరం గా వెళ్ళిపోనివ్వలేదు. మీ జీవితం లోని తొలి అనుభవాలు చాంపియన్ కావడం లో మీకు ఎలాగ తోడ్పడ్డాయంటారు?
ప్రవీణ్: సర్, ఇది కొంచెం కష్టం అని నేను అనుకున్నాను, నేను ఇప్పటివరకు ఏమి చేసినా, నేను ఇక్కడ ఓటమి ని ఒప్పుకొన్నాను అంటే, అంతా ముగుస్తుంది అని అనుకున్నాను. అంతకన్నా మంచిదైన విషయం ఏమిటి అంటే మరింత గా ప్రయత్నించి దీనిని విజయవంతం చేస్తే సరి అనేదే.
ప్రధాన మంత్రి: ప్రవీణ్ జీ, మీరు ఒక చాంపియన్ గా ఉన్నారు, కానీ నా దృష్టి లో మీ తల్లితండ్రులు సైతం చాంపియన్ లే. మీ తల్లితండ్రుల తో కూడా కొంచెం మాట్లాడదాము అని నేను అనుకొంటున్నాను. నమస్కారమండి.
ప్రవీణ్ తండ్రి: నమస్తే.
ప్రధాన మంత్రి: మీరు కార్మికుడి గా పనిచేసేటప్పుడు మీ కొడుకు ను ముందుకు తీసుకు పోయారు; మరి ఈ రోజు న మీ కుమారుడు ఒలింపిక్స్ లో దేశం తరఫు న ఆడబోతున్నాడు. కష్టపడి పనిచేయడం యొక్క శక్తి, నిజాయితీ యొక్క శక్తి ఏమిటో మీరు చూపించారు. మీరు ఇప్పుడు ఏమి చెప్పాలనుకొంటున్నారు?
ప్రవీణ్ తండ్రి: ... (మౌనం)
ప్రధాన మంత్రి: చూడండి, ఏదైనా చేయాలనే కోరిక ఉంటే, కష్టాలు ఎవరినీ ఆపలేవు.. అని మీరు నిరూపించారు. అట్టడుగు స్థాయి లో సరైన ఎంపిక ఉంటే మన దేశ ప్రతిభ దేనిని సాధించకుండా ఉండలేదు అనే విషయాన్ని మీ సఫలతే స్పష్టం చేసింది. ప్రవీణ్, మీకు నా వైపు నుంచి అనేకానేక శుభాకాంక్షలు. మరో సారి మీ తల్లితండ్రుల కు కూడా నా ప్రణామాలు. జపాన్ లో చక్కగా ఆడండి.
ప్రవీణ్: మీకు నా ధన్యవాదాలు సర్.
ప్రధాన మంత్రి: సరే, ఇప్పుడు మనం నీరజ్ చోప్ డా గారి తో మాట్లాడుదాం.
నీరజ్: నమస్తే సర్.
ప్రధాన మంత్రి: నీరజ్ గారు, మీరు భారతదేశం సైన్యం లో ఉన్నారు, అలాంటి ఏ అనుభవం, ఏ శిక్షణ క్రీడ లో ఈ స్థితి కి చేరుకోవడానికి మీకు సహాయపడ్డాయంటారు?
నీరజ్: సర్, మొదటి నుంచి భారతీయ సేన అంటే నాకు ఇష్టం. మరి నేను 5-6 సంవత్సరాలు ఆడాను, ఆ తరువాత భారతదేశం సైన్యం నన్ను సైన్యం లో చేరవలసిందని అడిగింది. అప్పుడు నాకు ఎంతో సంతోషం కలిగింది. భారతీయ సేన లో చేరాను, ఆ తరువాతి నుంచి నేను నా ఆట పైన దృష్టి ని సారిస్తూ వస్తున్నాను. భారతీయ సేన నాకు ఎన్ని సదుపాయాల నో ఇచ్చింది. భారత ప్రభుత్వం కూడా నాకు ఏమి కావాలో అవన్నీ అందిస్తోంది మరి నేను నా పూర్తి మనస్సు ను లగ్నం చేసి శ్రమిస్తున్నాను.
ప్రధాన మంత్రి: నీరజ్ గారు, నేను మీతో పాటు మీ పూర్తి కుటుంబాన్ని కూడా చూస్తున్నాను. మీ కుటుంబాని కి కూడాను నేను ప్రణామం చేస్తున్నాను.
నీరజ్ గారు, మీకు గాయం అయింది అని కూడా నాతో చెప్పారు, అయినప్పటికీ మీరు ఈ సంవత్సరం మీ జాతీయ రికార్డు ను నెలకొల్పారు. మీరు మీ మనోబలాన్ని, మీ అభ్యాసాన్ని ఇవన్నింటిని ఎలాగ సంబాళించారు?
నీరజ్: ఈ గాయం ఏదయితే ఉందో అది క్రీడల లో ఒక భాగం అని నేను భావిస్తాను, 2019 లో నేను బాగా కష్టపడ్డాను. మరి ఆ సంవత్సరం మా వరల్డ్ చాంపియన్ శిప్ జరిగింది..
ప్రధాన మంత్రి: అలాగా, మీకు క్రీడల తాలూకు గాయం లోనూ క్రీడా స్ఫూర్తి కనపడుతుంది అంటారా.
నీరజ్: సర్, ఎందుకంటే ఇది మా ప్రయాణం. మాకు కొన్ని సంవత్సరాల వృత్తి జీవనం ఉంటుంది మరి మాకు గా మేం
ప్రేరేపణ కు లోను కావాలి. ఈ కారణం గా ఒక సంవత్సరం పాడయిపోయింది, ఎందుకంటే నేను వరల్డ్ చాంపియన్ శిప్ కోసం, ఏశియన్ చాంపియన్ శిప్ కోసం ఎంతో తయారు అయ్యాను, కానీ గాయం వల్ల అందులో సమస్య వచ్చిపడింది. ఆ తరువాత నేను ఒలింపిక్స్ మీద నా మొత్తం దృష్టి ని నిలిపాను, మళ్ళీ తిరిగి వచ్చాను. నేను ఒకటో పోటీ లో బాగా ఆడాను. అందులోనే ఒలింపిక్స్ అర్హత ను సాధించాను. ఆ తరువాత కరోనా కారణంగా ఒలింపిక్స్ మళ్లీ వాయిదా పడడం జరిగింది. కాబట్టి నా సన్నాహాల ను కొనసాగించాను. ఆ తరువాత మళ్లీ పోటీ లలో పాల్గొన్నాను. ఇంకొక సారి నా ఉత్తమ ప్రదర్శన ద్వారా జాతీయ రికార్డు సాధించాను, మరి ఇప్పుడు కూడా సర్ పూర్తి స్థాయి లో శ్రమిస్తున్నాను. ఎంత ప్రయాస పెడితే అంత మంచిది గా ఉంటుంది, ఆ విధం గా చాలా పాటుపడి ఒలింపిక్స్ కు చేరాం.
ప్రధాన మంత్రి: నీరజ్ గారు, మీతో మాట్లాడి చాలా బాగుందనిపించింది. నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను, మీరు అంచనా ల బరువుల ను మోసుకుపోవలసిన అవసరం ఏమీ లేదు. మీరు మీ వంద శాతాన్ని అందించండి చాలు. ఇదే మానసిక స్థితి. ఎలాంటి ఒత్తిడి కి తావు ఇవ్వకుండా మీ పూర్తి ప్రయత్నాన్ని చేయండి, మీకు చాలా శుభాకాంక్షలు మరి మీ తల్లితండ్రుల కు కూడా ప్రణామాలు.
ప్రధాన మంత్రి: రండి, దుతీ చంద్ గారితో మాట్లాడుదాం.
ప్రధాన మంత్రి: దుతీ గారు, నమస్తే.
దుతీ: గౌరవనీయులైన ప్రధాన మంత్రి గారు, నమస్తే.
ప్రధాన మంత్రి: దుతీ గారు, మీ పేరు కు అర్థమే ప్రకాశం కదూ, దుతీ అంటే వెలుగు అని కదా అర్థం. మరి మీరు ఆట ద్వారా మీ ప్రకాశాన్ని కూడా వ్యాప్తి చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఒలింపిక్స్ లో దుమ్ము దులిపివేయడం కోసం సిద్ధమయ్యారా? ఇంత పెద్ద పోటీ ని మీరు ఎలా చూస్తారు?
దుతీ: సర్, ముందు గా నేను ఒడిశా లో నేత కుటుంబాని కి చెందిన వ్యక్తి ని అని మీకు చెప్పనివ్వండి. నా కుటుంబం లో ముగ్గురు సోదరీమణులు, ఒక సోదరుడు, తల్లి, తండ్రి ఉన్నారు. మా ఇంట్లో అమ్మాయిలు ఒకరి తరువాత ఇంకొకరు గా పుడుతూ ఉంటే, పల్లె వాసులు మా తల్లి గారి ని ఎప్పుడూ విమర్శిస్తూ ఉండే వారు. మాది చాలా పేద కుటుంబం. మాకు తినడానికి కూడా తిండి ఏమీ లేదు, మరి మా నాన్న గారి ఆదాయం కూడా చాలా తక్కువ గానే ఉండేది.
ప్రధాన మంత్రి: మీ తల్లితండ్రులు నా ఎదుట ఉన్నారు.
దుతీ: మరేనండి, నేను బాగా ఆడితే దేశాని కి పేరు ప్రఖ్యాతి లభిస్తుంది. ప్రభుత్వ రంగం లో నాకు ఒ ఉద్యోగం దొరుకుతుంది. ఉద్యోగానికి వచ్చే వేతనం ద్వారా నా కుటుంబం స్థితి మారిపోగలదు అనే విషయాలే నా మనస్సు లో ఉన్నాయి. అందుకని ఇవాళ ఈ కోర్సు తరువాత నేను చాలా మార్పు ను తీసుకు వచ్చాను, నా కుటుంబం లో మార్పు ను తీసుకు వచ్చాను. ఇప్పుడు మీకు నేను ధన్యవాదాలు చెబుతాను మరి... ఎవరైతే నాకు ఎల్లప్పుడూ మద్దతు ఇచ్చారో వారికి కూడా. నా జీవితం లో నాకు ఎప్పుడూ వివాదం ఉంటూనే ఉంటుంది. మీ టీవీ మాధ్యమం ద్వారా నేను మరొక మాట ను కూడా చెబుతాను అది ఏమిటంటే నేను ఎంత సవాలు విసరి, ఎంతటి కష్టాలను భరించి ఈ రోజు న ఇక్కడ కు చేరుకున్నాను, నాతో కలసి ఒలింపిక్స్ కు వెళ్ళే వారు ఇప్పుడు రెండో సారి ఒలింపిక్స్ కు వెళుతున్నారు అనేదే నా మనస్సు లో ఉండిపోయింది. నేను పూర్తి ధైర్యం తో వెళ్తున్నాను, నేను భయపడను అని మాత్రం చెప్పాలి అని అనుకొంటున్నాను. భారతదేశం లోని ఏ మహిళ బలహీనం గా లేదు; మరి మహిళ లు ముందుకు పోయి దేశం పేరు ను వెలుగు లోకి తీసుకు వస్తారు, ఇదే ధైర్యం తో ఒలింపిక్స్ లో ఆడుతాను, దేశం కోసం పతకం తీసుకు రావడానికి ప్రయత్నిస్తాను.
ప్రధాన మంత్రి: దుతీ గారు, మీ సంవత్సరాల తరబడి శ్రమ తాలూకు తీర్పు కొన్ని సెకన్లలోనే వెలువడడం జరుగుతుంది. ఓటమి కి, గెలుపునకు మధ్య రెప్పపాటు ఆలస్యమే ఉంటుంది. దీనిని ఎదుర్కోవడం అంటే అది ఎంత కష్టం గా ఉంటుందో కదా?
దుతీ: ప్రాథమికం గా 100 మీటర్ల లో చూశారంటే, అది 10-11 సెకన్ల లో ముగిసిపోతుంది. కానీ దీనిని పునరావృత్తం చేయడం లో ఏడాదంతా పట్టేస్తుంది. ఎంతగానో కష్టపడవలసి ఉంటుంది. ఒక 100 మీటర్ల దూరాన్ని పరిగెత్తడం కోసం మాకు 10-12 పునరావృత్తాలు చేయవలసి వుంటుంది. జిమ్ లో బోలెడన్ని వ్యాయామాలు, చాలా సేపు ఈత కొలను లో వ్యాయామం చేయవలసి ఉంటుంది మరి ఎల్లప్పుడూ సవాలు లా స్వీకరించవలసి ఉంటుంది, కొద్దిగా పడిపోయినా మీకు అనర్హత ను అంటగట్టి తీసివేస్తారు. కాబట్టి ప్రతిదీ మనస్సు లో పెట్టుకొని మేం పరుగు తీయవలసి ఉంటుంది. మనస్సు లో అధైర్యం ఉంటుంది, భయమూ వేస్తుంది, కానీ నేను ధైర్యంతో పోరాడుతాను; ఎలాగయితే నా వ్యక్తిగత జీవనం లో ధైర్యం తో పోరాడుతున్నానో అలాగే. నేను పోరాడుతూ పరుగెడుతుంటాను, మరి దీనిలో మంచి సమయాన్ని కూడా నమోదు చేస్తాను ఇంకా దేశం కోసం పతకాన్ని కూడా తీసుకు వస్తాను.
ప్రధాన మంత్రి: దుతీ గారు, మీరు దేశం కోసం అనేక రికార్డులు సృష్టించారు. మీరు ఈసారి ఒలింపిక్ పోడియం పై తప్పక మీ స్థానాన్ని సంపాదించుకొంటారు అని దేశం భావిస్తోంది. మీరు నిర్భయం గా ఆటల లో పాల్గొనండి, యావత్తు భారతదేశం తన ఒలింపిక్ క్రీడాకారుల వెన్నంటి నిలచింది. మీకు నా తరఫు న ఇవే అనేక శుభాకాంక్షలు మరి మీ తల్లితండ్రుల కు ప్రత్యేక ప్రణామాలు.
ప్రధాన మంత్రి: రండి, ఇప్పుడు మనం ఆశీష్ కుమార్ గారితో మాట్లాడుదాం.
ప్రధాన మంత్రి: ఆశీష్ గారు, మీ తండ్రి జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారుడు గా ఉండే వారు మరి మీ కుటుంబం లో చాలా మంది ఆటగాళ్ళు ఉన్నారు. మీరు బాక్సింగ్ ను ఎందుకు ఎంచుకున్నట్టు?
ఆశీష్: సర్ బాక్సింగ్ అంటారా, నా చిన్నప్పుడు మా ఇంట్లో క్రీడల కు సంబంధించిన వాతావరణం ఉండింది, మా నాన్నగారు చాలా మంచి క్రీడాకారుడు. ఆయన కాలం లో, ఆయన కుమారుడు కూడా బాక్సింగ్ ఆడాలి అని కోరుకున్నారు. కాబట్టి ఆ సమయంలో కబడ్డీ ఆడాలని బలవంతపెట్టలేదు. అయితే నా కుటుంబం లో నా సోదరుడు కుస్తీ ఆడే వారు మరి బాక్సింగ్ కూడా ఆడే వారు కాబట్టి వారు చాలా మంచి స్థాయి వరకు ఆడారు. అందుకని నాకు కూడా వాటిలో ఏదో ఒకదానిలో చేరాలి అంటూ చెప్పడం జరిగింది, నేను చాలా సన్న గా ఉండే వాడిని. నా శరీరం బాగా బలిష్ఠం గా అయినా లేదు, ఆ కారణం గా నేను కుస్తీ చేయలేను అని అనుకున్నాను, బహుశా బాక్సింగే చేస్తే మంచిది అని. ఈ విధం గా సర్, బాక్సింగ్ వైపు మొగ్గు సాధ్యపడింది.
ప్రధాన మంత్రి: ఆశీష్ గారు, మీరు కోవిడ్ తోనూ పోరాటం సలిపారు గా. ఒక ఆటగాడి గా మీకు ఇది ఎంత కష్టం గా తోచింది? మీ ఆట, మీ ఫిట్ నెస్ ప్రభావితం కాకుండా చూసుకోవడానికి మీరు ఏమి చేశారు? ఈ కీలకమైన సమయం లో మీరు మీ తండ్రి గారి ని కోల్పోయారని కూడా నాకు తెలుసును, ఆ సమయం లో కూడా మీరు ఏ మిశన్ కోసమైతే బయలుదేరారో, దానిలో కాస్త అటు ఇటు అవనీయలేదు. మరి నేను మీ మనోభావాల ను గురించి తప్పక తెలుసుకోవాలనుకొంటున్నాను.
ఆశీష్: అవును, సర్, పోటీ కి 25 రోజుల ముందు మా నాన్న గారు కాలం చేశారు, దీని కారణం గా నేను చాలా షాక్ లో ఉన్నాను, నేను భావోద్వేగాల పరంగా చాలా బాధ కు లోనయ్యాను సర్, ఆ సమయం లో ఎన్నో సమస్యల ను నేను ఎదుర్కోవలసి వచ్చింది. ఆ సమయం లో నాకు చాలా అవసరపడింది కుటుంబం తాలూకు సమర్థన. నాకు నా కుటుంబం చాలా మద్దతు ను అందించింది.
నేను నా తండ్రి గారి కల ను నెరవేర్చాలి అంటూ నా సోదరుడు, నా సోదరి, నా కుటుంబ సభ్యులందరూ, స్నేహితులు కూడా, పదేపదే ప్రేరణ ను ఇచ్చారు. బాక్సింగ్ ఆరంభం లో ఆయన ఏదయితే కల ను నా గురించి కన్నారో, సర్, అన్ని పనులను విడచిపెట్టి మరీ మళ్లీ శిబిరం లో చేరు; ఏ తండ్రి కి అయితే నీ గురించిన కల ఉందో ఆ కల ను నెరవేర్చు అంటూ వారు నాతో చెప్పారు. సర్, నేను స్పెయిన్ లో ఉన్నప్పుడు- అప్పుడు నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది- ఆ సమయం లో నాలో రోగ లక్షణాలు ఉండేవి, సర్, కొన్ని రోజులు నేను అక్కడ ఉండిపోయాను. కానీ, సర్ నాకు అక్కడ సౌకర్యాల ను కొంచెం ప్రత్యేకం గా సమకూర్చడం జరిగింది. మా జట్టు వైద్యుడు డాక్టర్ కరణ్ ను క్రమం తప్పక నేను సంప్రదిస్తూ ఉండే వాడి ని. సిబ్బంది అందరి తో కూడాను. నాకు అందుబాటులో ఉన్న స్థలం ఉంది, సర్, నేను ప్రాక్టీస్ చేసే చోట, నేను కొంచెం ఫిట్ నెస్ చేసే వాడి ని, కానీ ఇప్పటికీ చాలా సమయం పట్టింది, సర్, నేను కోలుకోవడానికి కరోనా నుండి తిరిగి వచ్చినప్పుడు, నేను భారతదేశాని కి తిరిగి వచ్చినప్పుడు, అప్పుడు నేను శిబిరం లో తిరిగి వచ్చినప్పుడు, కోచ్ లు, సహాయక సిబ్బంది నాకు చాలా సహాయం చేశారు. ధర్మేంద్ర సింహ్ యాదవ్ గారు నా కోచ్, ఆయన కోలుకోవడానికి నాకు చాలా సహాయం చేశారు; మరి మళ్ళీ నా ఆట లో నన్ను తిరిగి లయ కు తీసుకు వచ్చారు.
ప్రధాన మంత్రి: ఆశీష్ గారు, నేను మీ కుటుంబ సభ్యుల కు కూడా వందనం చేస్తున్నాను మరి ఆశీష్ గారు, సచిన్ తెందుల్ కర్ గారు చాలా ముఖ్యమైన ఆట ఆడుతున్నారని, ఆయన తండ్రి గారు అదే సమయం లో మరణించారని మీరు గుర్తుంచుకుంటారు. కానీ సచిన్ ఆట కే ప్రాధాన్యాన్ని ఇచ్చారు, మరి ఆట ద్వారా తన తండ్రి గారి కి శ్రద్ధాంజలి ఘటించారు. మీరు కూడా అదే పని చేశారు. ఈ రోజు న మీరు మీ తండ్రి ని కోల్పోయినప్పటికీ, మీరు మీ మొత్తం మనస్సు ను లగ్నం చేశారు; దేశం కోసం, ఒక విధం గా ఆట కోసం వాగ్దానం చేశారు. మీరు నిజం గా మీ ఉదాహరణ లో స్ఫూర్తిదాయకం గా ఉన్నారు, ఆటగాడి గా ప్రతిసారీ మీరు విజేత గా నిరూపించబడ్డారు. ఒక వ్యక్తి గా, అదే సమయం లో మీరు శారీరికమైన సవాళ్లను, భావోద్వేగభరితమైన సవాళ్లను గెలుచుకున్నారు. మీ మీద యావత్తు దేశం అధికమైనటువంటి అంచనాల ను పెట్టుకొంది. ఒలింపిక్ వేదిక మీద మీరు బాగా రాణిస్తారని మాకు నమ్మకం ఉంది, మీకు నా శుభాకాంక్షలు. మీ టుంబ సభ్యుల కు కూడా నా అభినందనలు.
ప్రధాన మంత్రి: రండి, మనం అందరికీ తెలిసిన ముఖం గురించి,తెలిసిన వ్యక్తి ని గురించి మాట్లాడుకొందాం. ఆమెనే మేరీ కామ్.
ప్రధాన మంత్రి: మేరీ కామ్ గారు, నమస్తే.
మేరీ కామ్: నమస్తే సర్.
ప్రధాన మంత్రి: మీరు ఎటువంటి క్రీడాకారిణి అంటే మీ నుంచి యావత్తు దేశం ప్రేరణ ను అందుకొంటుంది. ఈ ఒలింపిక్ దళం లో చాలా మంది క్రీడాకారుల కు మీరు స్వయం గా ఒక ఆదర్శం గా నిలచారు. వారు కూడా మీకు ఫోన్ చేస్తూ ఉంటారనుకొంటా, ఒకవేళ ఫోన్ చేస్తే మిమ్మల్ని ఏమి అడుగుతారు?
మేరీ కామ్: సర్, ఇంట్లో ప్రతి ఒక్కరూ నా కోసం ప్రార్థిస్తున్నారు, ఆ వ్యక్తులు పిల్లలు నన్ను ఎక్కువ గా కోల్పోతున్నారు సర్,మరి నేను అనుకోవడం అమ్మ దేశం కోసం పోరాడటానికి వెళ్తున్నది, మీరేమో ఇంట్లో నాన్న గారు ఏమి చెబుతున్నారో దానిని అనుసరించండి అని మరి ఇంట్లో మీరు ప్రేమ గా జీవించాలి, బయట కు పోకూడదు కోవిడ్ కారణం గా సర్, వారు కూడా ఇంట్లో విసుగెత్తిపోతున్నారు, ఆన్ లైన్ తరగతులకు హాజరు అవుతున్నారు కానీ అంతగా తెరచుకోవడం లేదు. బాలలు క్రీడల ను బాగా ఇష్టపడతారు సర్, స్నేహితులు ఆడటం లో చాలా చక్క గా రాణిస్తారు, ఇది మంచిదే, అయితే ఈ సారి కోవిడ్ కారణం గా స్నేహితులందరూ కూడా దూరం అయిపోతున్నారు. ఈ సందర్భం లో నేను అన్నాను మనం పోరాడాలి, సురక్షితం గా ఉండాలి అని. నేను కూడా దేశం కోసం పోరాడబోతున్నాను మరి నేను కోరుకొంటున్నాను ఏమని అంటే మీరు సురక్షితం గా ఉండాలి అని, అలాగే నేను కూడా సురక్షితంగా ఉండాలి అని. ఇంకా దేశాని కి మంచి చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను, అదే జరుగుతుంది సర్.
ప్రధాన మంత్రి: వారు వింటున్నారు, అందరూ నా ఎదుట కనుపిస్తున్నారు. సరే, మీరు ప్రతి పంచ్ లోను చాంపియన్ అన్నమాట, అయితే అన్నింటి కంటే మీకు అభిమానపాత్రమైన పంచ్ ఏమిటది? ఉద్యోగం, హుక్, అపర్ కట్ లేదా మరేదైనానా? మరి ఇది కూడా తెలియజేయండి.. ఆ పంచ్ మీకు ఎందుకు అభిమానపాత్రమో? అనేది
మేరీ కామ్: సర్, నాకు ఇష్టమైన పంచ్ లు ఏవీ అంటే అవి నా సౌత్ పోల్, అది నాకు అన్నింటి కంటే ఫేవరేట్ సర్. అందుకని దీనిలో ఎవ్వరూ కోల్పోలేరు, పడాలి అంటే పడాల్సిందే అంతే.
ప్రధాన మంత్రి: మీ అభిమానపాత్ర క్రీడాకారులు ఎవరన్నది నేను నేను తెలుసుకోవాలనుకుంటున్నాను.
మేరీ కామ్: సర్, నా అభిమాన ఆటగాడు బాక్సింగ్ లో హీరో, ప్రేరణ అంటే ముహమ్మద్ అలీ యే సర్.
ప్రధాన మంత్రి: మేరీ కామ్ గారు, మీరు బాక్సింగ్ లో దాదాపు గా ప్రతి అంతర్జాతీయ పోటీ లోనూ గెలిచారు. ఒలింపిక్ స్వర్ణం మీ కల అని మీరే చెప్పారు. అది మీ ఒక్కరి కల మాత్రమే కాదు, యావత్తు దేశం యొక్క కల. మీరు మీ కల ను, దేశం కల ను నెరవేరుస్తారు అని దేశం భావిస్తోంది. మీకు నా చాలా శుభాకాంక్షలు, మరి మీ కుటుంబ సభ్యులకు నా ప్రణామాలూను.
మేరీ కోమ్: చాలా చాలా ధన్యవాదాలు సర్ మీకు!
ప్రధాన మంత్రి: రండి, ఇక పి.వి. సింధు తో మాట్లాడుదాం.
ప్రధాన మంత్రి: సింధు గారు, టోక్యో ఒలింపిక్స్ కు ముందు మీరు ఒలింపిక్ సైజ్ కోర్టు లో ప్రాక్టీస్ చేయాలి అని కోరుకుంటున్నారని నాకు చెప్పారు. ఇప్పుడు గచ్చిబౌలీ లో మీ అభ్యాసం ఎలా ఉంది?
పివి సింధు: గచ్చిబౌలీ లో ప్రాక్టీస్ చాలా బాగా జరుగుతోంది సర్. ఒలింపిక్ స్టేడియమ్ చాలా పెద్దది మరి అది ఎసి కూడాను.. అందుకని నేను దీనిని ఎంచుకున్నాను. ఇంకా.. భలే బాగుంది కాబట్టి నేను అనుకున్నాను. మంచిది, చక్కనైన స్టేడియం ఉంది అంటే ఒకవేళ అవకాశం ఉంది అనంటే ఎందుకు ఆడకూడదు అని చెప్పి ఫిబ్రవరి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. స్పష్టం గా సర్ నేను ప్రభుత్వం నుండి అనుమతి తీసుకున్నాను. ఈ మహమ్మారి కారణం గా వారు వెంటనే అనుమతి ఇవ్వాలని అడిగాను. ప్రోటోకాల్స్ అనుసరించండి అని వారు సూచించారు. వారికి నేను చాలా ధన్యవాదాలను తెలియజేస్తున్నాను ఎందుకంటే నేను అడిగిన వెంటనే వారు అనుమతి ని ఇచ్చేశారు సర్. కాబట్టి నేను ఇప్పుడు ప్రారంభిస్తే ఫర్వాలేదు అనుకున్నాను, ఒక పెద్ద స్టేడియం లో ఆడడం అంటే టోక్యో కు వెళ్ళిన తరువాత అది అంత కష్టం గా ఉండదు అని మరి నేను దీనికి చాలా త్వరగా అలవాటు పడిపోయాను సర్.
ప్రధాన మంత్రి: మీ కుటుంబ సభ్యులు కూడా నా ముందు ఉన్నారు, నేను వారికి ప్రణామం చేస్తున్నాను. రియో ఒలింపిక్స్ కు ముందు మీ ఫోన్ ను తీసేసుకున్నాను అని గోపీచంద్ గారు ఒక ఇంటర్ వ్యూ లో చెప్పడం నాకు జ్ఞాపకం ఉంది. మిమ్మల్ని ఐస్ క్రీమ్ కూడా తిననివ్వలేదట. మీరు ఐస్ క్రీమ్ తినొద్దు అనే నియమం ఇప్పటికీ అలాగే ఉందా లేక కొంత మినహాయింపు ఏమైనా దొరికిందా?
పివి సింధు: సర్ స్పష్టం గా నన్ను నేను కొంచెం అదుపు లో పెట్టుకొన్నాను. ఎందుకంటే ఒక ఎథ్ లీట్ కి నియతాహారం చాలా ముఖ్యం. ఇప్పుడు ఇది ఒలింపిక్స్ కాబట్టి, తయారు అవుతున్నాను కదా, అందుకని స్పష్టం గా కొంత డైట్ కంట్రోల్ అనేది పాటిస్తున్నాను, మరి ఐస్ క్రీమ్ అంతగా తినడం లేదు సర్, అప్పుడప్పుడు మాత్రమే.
ప్రధాన మంత్రి: చూడండి, సింధు గారు, మీ త ల్లిదండ్రులు ఇద్దరూ స్వయంగా క్రీడల లో ఉన్నారు, మరి అందుకే నేను వారితో ఇవాళ మాట్లాడాలి అని నిశ్చయం చేసుకున్నాను. మీకు నమస్కారమండి, ఒక పిల్లవాడు క్రీడల పట్ల ఆసక్తి చూపించినప్పుడు చాలా మంది తల్లితండ్రుల కు అది చాలా కష్టంగా తోస్తుంది. చాలా మంది కి బోలెడన్ని సందేహాలు ఉంటాయి. చెప్పండి, అటువంటి తల్లితండ్రులందరికీ మీరు ఏ విధమైన సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారు?
తండ్రి: సర్ తల్లితండ్రులు వారి పిల్లలు ఆరోగ్యం పరంగా బాగుంటే, అప్పుడు ప్రతిదీ గొప్ప గా ఉంటుంది అని తెలుసుకోవాలి అంతేనండి. ఎందుకంటే మీరు కొద్దిగా ఆడితే, మీ ఆరోగ్యం దానంతట అదే బాగవుతుంది మీ ఏకాగ్రత పెరుగుతుంది. ప్రతి అంశం లో మీరు ముందుకు సాగిపోతారు మరి మీరు తప్పక ఎదగవచ్చును.
ప్రధాన మంత్రి: మీరు ఒక విజయవంత మైన క్రీడాకారిణి కి తల్లితండ్రులు గా ఉన్నారు. తమ పిల్లలను క్రీడాకారులుగా దిద్దితీర్చాలి అంటే అందుకు తల్లితంద్రుల బాధ్యతలు ఎలా ఉండాలంటారు?
తండ్రి: సర్, పేరెంటింగ్ అంటే మొదట తల్లితండ్రులు అంకితభావాన్ని కలిగివుండాలి, సర్, ఎందుకంటే వారిని ప్రోత్సహించవలసి ఉంటుంది. మీరు వారిని ప్రేరేపించాలి మరి మీకు తెలిసిన సంగతే సర్, ప్రభుత్వం ప్రతి ఒక్క క్రీడాకారునికి, క్రీడాకారిణి కి ప్రతి ఒక్క సౌకర్యాన్ని అందిస్తోంది. కాబట్టి మన పిల్లల కు చూడు నాన్నా, చూడు తల్లీ, దేశం పేరు ను నిలపడానికి కష్టపడాలి, మంచి పేరు ను సంపాదించాలి, ఇలాగ మనం వారిని ప్రోత్సహిస్తూ పోవాలి. మొదట గౌరవం ఇవ్వాలని, గౌరవాన్ని ఇస్తూ వారి ఆశీర్వాదాలను పొందాలి అని పిల్ల లకు నేర్పించాలి.
ప్రధాన మంత్రి: సింధు గారు, మీ తల్లితండ్రులు మిమ్మల్ని ప్రపంచ ఛాంపియన్ గా చేయడానికి చాలా త్యాగం చేశారు. వారు వారి
పని ని చేశారు. ఇక ఇప్పుడు మీ వంతు వచ్చింది, మీరు ఎంతో కష్టపడి పనిచేయండి. మరి నాకు నమ్మకం ఉంది. ఈసారి కూడా మీరు తప్పక సఫలం అవుతారు అని. సఫలత తరువాత నాతో భేటీ కావడానికి రానే వస్తారు, మీతో కలసి నేను కూడా ఐస్ క్రీమ్ తింటాను.
ప్రధాన మంత్రి: రండి, ఎలా తో మాట్లాడుదాం, ఎలా.. నమస్తే తల్లీ.
ఎలావెనిల్: నమస్తే సర్.
ప్రధాన మంత్రి: (గుజరాతీ లో పిలుస్తూ) ఎలావెనిల్, మీరు మొదట వ్యాయామ క్రీడల లోకి వెళ్లాలి అని కోరుకొన్నారని నాకు తెలియజేయడం జరిగింది. మరి మీరు శూటింగ్ ను స్వీకరించేలా మిమ్మల్ని ప్రేరేపించింది ఏమిటంటారు?
ఎలావెనిల్: సర్ నేను నిజానికి చాలా స్పోర్ట్స్ ట్రై చేశాను. శూటింగ్ కన్నా ముందు నాకు చిన్నప్పటి నుంచి క్రీడలు అంటే చాలా మక్కువ గా ఉండింది. ఎథ్ లెటిక్, బాడ్ మింటన్, జూడో వగైరా ట్రై చేసాను, కానీ నేను శూటింగ్ ప్రారంభించినప్పుడు, ఈ ఆట లో నాకు చాలా ఉత్సాహం లభించింది ఎందుకంటే ఇందులో మేం చాలా నిలకడ గా ఉండాలి. చాలా ఎక్కువ గా ప్రశాంతంగా ఉండాలి. సర్, నాకు ఆ ప్రశాంతతే నేను కోరుకున్నాను. అది నా దగ్గర లేదు. అప్పుడు నేను అనుకున్నాను మంచిది దీనితో నాకు నేర్చుకోవడానికి చాలా దొరుకుతుంది. అప్పటి నుంచి ఈ ఆట అంటే నాకు చాలా ఎక్కువ అనుబంధం ఏర్పడిపోయింది.
ప్రధాన మంత్రి: కాసేపటి క్రితం నేను దూరదర్శన్ లో ఒక కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాను. అందులో నేను మీ తల్లితండ్రులు చెప్పేది వినసాగాను మరి మీరు దానిని సంస్కారధామ్ లో ప్రారంభించారు. దానిని గురించి పూర్తి గా వివరిస్తూ ఉన్నారు వారు. మరి అక్కడ కు వెళ్ళి వారు మీ గురించి తలచుకొన్న తీరు ను చూస్తే గర్వం గా ఉండింది. సరే, పాఠశాల నుంచి ఒలింపిక్స్ వరకు చాలా మంది యువత మీ ఈ ప్రయాణాన్ని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. చూడండి, నేను మణినగర్ శాసనసభ్యుని గా ఉండే వాడి ని. మరి మీరు మణినగర్ లో నివసిస్తున్నారు. నేను ఖోఖ్ రా లో.. నా అసెంబ్లీ సెగ్మెంట్ లో.. స్పోర్ట్స్ అకేడమీ ని మొట్టమొదట గా ప్రారంభించినప్పుడు మీరు ఆడటానికి అక్కడకు వచ్చే వారు. అప్పుడు మీరు ఒక పాప. కానీ ఈ రోజు న మిమ్మల్ని చూశాక చాలా గర్వం గా అనిపిస్తోంది. ఆఁ, ఇక చెప్పండి మీ సంగతులు.
ఎలావెనిల్: సర్ నా శూటింగ్ తాలూకు ప్రొఫెశనల్ యాత్ర సంస్కార్ ధామ్ నుంచే ఆరంభం అయింది. నేను 10వ తరగతి లో ఉన్నప్పుడు, స్పోర్ట్స్ ట్రై చేయాలని నీకు అంత గా ఆసక్తి ఉంటే అలాగే కానీ అని అమ్మ-నాన్న కాల్ చేశారు, అప్పుడు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ గుజరాత్, గన్ ఫర్ గ్లోరీ శూటింగ్ అకేడమీ లతో ఎంఒయు కుదిరింది. సర్, సంస్కార్ ధామ్ జిల్లా స్థాయి క్రీడల ను ప్రారంభించింది. కాబట్టి చదువు కూడా అక్కడే సాగేది. రోజంతా, మా శిక్షణ సైతం అక్కడే జరిగేది, సర్. ఆ ప్రయాణం చాలా బాగా సాగింది సర్. ఎందుకంటే అక్కడి నుంచే నేను మొదలుపెట్టాను మరి ఇప్పుడు నేను నా ఒకటో ఒలింపిక్స్ కోసం వెళ్తున్నాను. సర్, ఇది చాలా గర్వం గా ఉంది సర్, ఇంత మంది సాయం చేశారు, ఇంత మంది నా కోసం సమర్ధన ను ఇచ్చారు. ఎల్లవేళ లమార్గదర్శకత్వం వహించారు సర్, ఇలాగైనప్పుడు ఎంతో బాగుంది సర్.
ప్రధాన మంత్రి: ఎలావేనిల్, ఇప్పుడింకా మీరు గ్రేజుయేశన్ చేస్తున్నారు. శూటింగ్ కరియర్ , మరి విద్య.. వీటిని మీరు ఏ విధంగా సర్దుబాటు చేయగలుగుతానని అంటారు?
ఎలావెనిల్: సర్, నేను నా గుజరాత్ విశ్వవిద్యాలయానికి, మరి మా కళాశాల అయిన భవన్ రాజ్ కళాశాల కు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే సర్ తప్పనిసరి గా ఇక్కడకు వచ్చి మీరు ఈ పని ని చేయాలి అని వారు ఒక్క సారి కూడా అనలేదు. వారు నాకు చాలా మినహాయింపు లను ఇచ్చారు, నా కోసం వారు పరీక్షల ను కూడా ప్రత్యేకం గా ఏర్పాటు చేసే వారు. నా కోసం సెమినార్ లను కూడా విడి గా నిర్వహించే వారు. నా ప్రయాణం లో చాలా మద్దతు ను అందించారు, నా పాఠశాల కూడా ఎంతో మద్దతు ను ఇచ్చింది సర్.
ప్రధాన మంత్రి: ఎలావెనిల్ మీ తరం మహత్వాకాంక్షల ను కలిగివుండడం తో పాటు పరిణతి చెందిన తరం కూడాను. ఇంత చిన్న వయస్సు లో మీరు ప్రపంచ వ్యాప్తం గా సఫలత ను చేజిక్కించుకొన్నారు. క్రీడ ల అతిపెద్ద వేదిక మీద కూడా ఈ ప్రయాణాన్ని మీరు కొనసాగిస్తారని దేశం భావిస్తోంది. మీకు ఇవే నా శుభాకాంక్షలు, మీ తల్లితండ్రుల కు కూడా నా ప్రణామాలు, వణక్కమ్.
ప్రధాన మంత్రి: రండి మనం సౌరభ్ చౌధరీ తో మాట్లాడుదాం. సౌరభ్ గారు నమస్తే.
ప్రధాన మంత్రి: మీరు ఇంత లేత వయస్సులో ఒలింపిక్స్ కు అర్హత ను సాధించేశారు. మీ మిశన్ ఎలాగ, ఎప్పుడు మొదలైంది?
సౌరభ్: సర్, నేను 2015 లో శూటింగ్ ను మొదలుపెట్టాను. మా ఊరికి సమీపం లోనే ఒక శూటింగ్ అకాడమీ ఉంది. అక్కడే నేను ఓనమాలు దిద్దాను. నా కుటుంబం కూడా నాకు చాలా మద్దతు ఇచ్చింది. నీకు అంతగా నచ్చినప్పుడు ప్రయత్నించు అంటూ వారంతట వారే అన్నారు. అందుకని అక్కడ కు వెళ్ళి నేను ప్రయత్నించాను. అప్పుడు నేను అక్కడ మంచి అనుభూతి చెందడం ప్రారంభించాను, మెల్ల మెల్ల గా మొదలుపెట్టి మరి ఫలితం కూడా రాసాగింది. భారత ప్రభుత్వం మాకు సహాయపడుతూ వచ్చింది, కాబట్టి ఈ రోజు న మేం ఇక్కడ కు చేరుకొన్నాం సర్.
ప్రధాన మంత్రి: చూడండి, మీ కుటుంబ స భ్యులు కూడా ఈ రోజు నన్ను ఎంతో గర్వం గా చూస్తున్నారు. సౌరభ్ ఏమి చమత్కారం చస్తాడో అని. వారి కళ్ల లో పెద్ద పెద్ద కలలు కనుపిస్తున్నాయి. చూడు సౌరభ్, కష్టం తో పాటు శూటింగ్ లో మానసిక ఏకాగ్రత చాలా అవసరం. దీని కోసం మీరు యోగ వంటివి చేస్తారా లేక మరేదైనా విద్య మీదగ్గర ఉందా అది నేను కూడా తెలుసుకొంటే సంతోషం కలగవచ్చయ్యా. అది తెలుసుకొంటే దేశం లోని యువత కు సైతం సంతోషం లభిస్తుంది కదా ?
సౌరభ్: సర్, ధ్యానం చేస్తాం, యోగా చేస్తాం. సర్, ప్రశాంతం గా ఉండడం కోసమైతే మేం మీ నుంచి తెలుసుకోవాలి, ఏమిటి అంటే ఇంత పెద్ద భారతదేశాన్ని మీరు సంబాళిస్తున్నారు కదా. మరి అందుకోసం మీరు ఏమి చేస్తారు అనేది?
ప్రధాన మంత్రి: సరే సౌరభ్, మీరు చెప్పండి మీ స్నేహితులు, మీ దగ్గరకు వచ్చే సహచరులు మీతో సెల్ఫీ తీసుకోవాలనిపిస్తే, అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ముందు ఇలా చేసే వారు కాదేమో?
సౌరభ్: ఉహూ, నేను ఇంటికి వెళ్లినప్పుడు మా ఊళ్లోని ఇరుగుపొరుగు మిత్రులు.. వారు వస్తారు, సెల్ఫీ తీసుకొంటారు. నా పిస్తోలు తో సెల్ఫీ దిగుతారు. భలే బాగా అనిపిస్తుంది.
ప్రధాన మంత్రి: సౌరభ్, మీరు చెప్పేది వింటే అనిపిస్తోంది, మీరు చాలా శ్రద్ధ తీసుకొంటున్నారు అని. ఇది మీలాంటి యువకుడి కి చాలా మంచిది. శూటింగ్ లో కూడా అదే శ్రద్ధ, స్థిరత్వం అవసరపడుతాయి. మీరు ఇంకా సుదీర్ఘ ప్రయాణాన్ని చేయవలసి ఉంది, దేశం కోసం అనేక మజిలీలు సాధించాలి. ఒలింపిక్స్ లో మీరు చాలా చక్కని పనితీరు కనబరుస్తారని, భవిష్యత్తు లో కూడా ఎంతో ముందుకు సాగిపోతారని మాకు అందరికి విశ్వాసం ఉంది. మీకు, మీ కుటుంబ సభ్యుల కు నా ప్రణామాలు.
ప్రధాన మంత్రి: రండి, మనం శరత్ కమల్ గారి తో మాట్లాడుదాం, శరత్ గారు నమస్తే.
శరత్: నమస్తే సర్.
ప్రధాన మంత్రి: శరత్ గారు, మీరు 3 ఒలింపిక్స్ లో పాల్గొన్నారు. మీరయితే చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి క్రీడాకారుడు. ఒలింపిక్స్ లో మొదటి సారి గా దేశాని కి ప్రాతినిధ్యం వహిస్తున్న యువ క్రీడాకారులకు మీరు ఎటువంటి సూచనలు ఇస్తారు?
శరత్: ఈసారి ఒలింపిక్స్ చాలా కొత్త స్థితి లో జరుగుతోంది. అంతే కాదు అది కోవిడ్-19 లో జరుగుతోంది. గడచిన 3 ఒలింపిక్స్ లో ఇటువంటి అనుభవం ఏమీ లేదు. మేం మా ఏకాగ్రత ను అంతటిని క్రీడల కు బదులు మా సురక్ష విషయమై, పాటించవలసిన ప్రోటోకాల్స్ పై చూపెట్టవలసి ఉంటుందిక. ఈసారి క్రీడల కు తోడు మిగతా అంశాల పై దృష్టి పెట్టాలి. నేను ఒకటే చెప్తాను.. తొలి సారి ఒలింపిక్స్ కు వెళ్ళే వారు మొదట ప్రోటోకాల్స్ మరి ఇవన్నీ అనుసరించకపోతే అప్పుడు మేం ఆట నుంచే బయటకు వెళ్లిపోవలసి రావచ్చు. మనం ప్రోటోకాల్స్ ను పాటించాలి. ఒకసారి ఒలింపిక్స్ కు చేరుకొన్నాం అంటేనే మన మొత్తం దృష్టి మన క్రీడల పైన, అలాగే కోవిడ్ సంబంధి ప్రోటోకాల్స్ పైన కూడా ఉంచాలి. అయితే అక్కడికి వెళ్ళినప్పటి నుంచి ఇక క్రీడల పైనే పూర్తి గా దృష్టి ని సారించాలి అని నేను అంటాను.
ప్రధాన మంత్రి: సౌరభ్ గారు, మీరు ఆడటం ప్రారంభించినప్పటికి, ఇప్పటికి, టేబల్ టెనిస్ లో కొన్ని మార్పులు వచ్చాయి అని మీరు అనుకుంటున్నారా? క్రీడలకు సంబంధించిన ప్రభుత్వ విభాగాల విధానం లో కొన్ని మార్పులు జరిగాయని మీరు అనుకొంటున్నారా?
శరత్: చాలా చాలా తేడా లు ఉన్నాయి. 2006 లో నేను మొదటిసారి కామన్ వెల్థ్ లో బంగారు పతకాన్ని గెలుచుకున్నప్పుడు మరి 2018 లో ఎప్పుడయితే మేమంతా కలసి బంగారు పతకాన్ని గెలిచామో అప్పుడు. 2006 లోను, 2018 లోను భారీ వ్యత్యాసం ఉంది. ప్రధానమైన విషయం ఏమిటి అంటే క్రీడ లు వృత్తిపరమైన రంగం గా మారిపోయాయి. 2006 లో నేను గెలిచినప్పుడు క్రీడల లో అంత ప్రొఫెశనలిజం అంతగా లేదు. అంటే అప్పట్లో చదువు కు బాగా ప్రాముఖ్యం ఉండేది, క్రీడలు ఒక పక్క దారి గా ఉండేవి. ఇది ఇకపై కానీ ఇప్పుడు అలా కాదు, చాలా ప్రాముఖ్యాన్ని ఇవ్వడం జరుగుతోంది, మొత్తం ప్రభుత్వం చాలా ప్రాముఖ్యాన్ని ఇస్తోంది, ప్రైవేట్ సంస్థ లు కూడాను ఎక్కడలేని ప్రాధాన్యాన్ని ఇస్తున్నాయి మరి అదే సమయం లో ఒక ఉద్యోగ మార్గాన్ని పరచుకోవడం లో అవకాశాలు ఇప్పుడు ఏవయితే ఉన్నాయో క్రీడల లో ఓ వృత్తినిపుణుని గా మారడానికి సంబంధించిన అవకాశాలు ఇప్పుడు చాలానే ఉన్నాయి అలాగే చాలా మంది పిల్లలకు చాలా మంది తల్లితండ్రులకు కూడా ఒక విధమైనటువంటి హామీ లభిస్తోంది. హామీ కన్నా ఒక విశ్వాసం.. నా బిడ్డ క్రీడల రంగం లో ప్రవేశించినా, వాడు వాడి జీవితాన్ని సంబాళించుకోగలుగుతాడు అని. కాబట్టి ఈ మనస్తత్వం చాలా మంచి మార్పు అని నేను అనుకుంటున్నాను.
ప్రధాన మంత్రి: శరత్ గారు, మీకు ఒక్క టేబల్ టెనిస్ అనే కాక పెద్ద ఈవెంట్ ల తాలూకు విశాలమైనటువంటి అనుభవం ఉంది. ఈ అనుభవం మీకు మాత్రమే కాకుండా టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొంటున్న దేశం యొక్క పూర్తి జట్టు కు కూడా ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను. మీరు ఒక పెద్ద పాత్ర లో, ఈ మారు ఒక విధం గా పూర్తి జట్టు కు ఒక విశేషమైన భూమిక మీ ముందుకు వచ్చింది. మరి నాకు విశ్వాసం ఉంది ఏమని అంటే మీ సొంత ఆట తో పాటు మొత్తం జట్టు ను నిర్వహించడంలో మీరు చాలా పెద్ద తోడ్పాటు ను అందిస్తారు అని. మరి మీరు దానిని చాలా చక్కగా పోషిస్తారు అని నేను నమ్ముతున్నాను. మీకు, మీ జట్టు కు కూడాను నా వైపు నుంచి చాలా శుభాకాంక్షలు.
ప్రధాన మంత్రి: రండి, మనికా బాత్రా గారి తో మాట్లాడుదాం, మనికా గారు నమస్తే.
మనికా: నమస్తే సర్.
ప్రధాన మంత్రి: మనికా, మీరు టేబల్ టెనిస్ ఆడడం తో పాటు పేద పిల్లల కు ఈ ఆట ను నేర్పుతున్నారు కూడా అని నాకు చెప్పారు. వారికి మీరు సహాయం చేస్తారట కదా. మీరు స్వయం గా యవ్వనం లో ఉన్నారు, మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది?
మనికా: సర్, నేను ఆడటానికని మొదటి సారి గా ఇక్కడకు.. పుణే కు వచ్చినప్పుడు, ఆదరణ కు నోచుకోనటువంటి వారు, అనాథ లు చాలా బాగా ఆడుతుండడం , ఇక్కడి కేంద్రం లో వారికి బోధించే వారిని నేను చూశాను. ఇదంతా నాకు భిన్నం గా తోచింది. నాకనిపించింది. వారికి ఏవయితే సదుపాయాలు దొరకలేదో, లేక వారు ఇంతకు ముందు చేయలేకపోయారో, వారికి నేను సాయపడాలి అని. దాని వల్ల నన్ను అనుసరించి వారు మంచి ఆటగాళ్ళు గా మారవచ్చు కదా అని. వారు ఆడుతుండగా వారిని చూసి నాకు ప్రేరణ లభిస్తుంది. అంటే ఇంతకు ముందు వారు ఎవరి తోనూ లేరు కానీ ఇంత చిన్న వయస్సు లో ఇంత చక్కగా ఆడుతున్నారు, వారిని చూస్తే చాలా ప్రేరణ లభిస్తుంది.
ప్రధాన మంత్రి: మనికా, మీరు మీ మ్యాచ్ లో కొన్నిసార్లు మీ చేతి మీద త్రివర్ణ పతాకాన్ని చిత్రించుకోవడాన్ని నేను చూశాను. దాని వెనుక ఉన్న ఆలోచన, మీ ప్రేరణ లను గురించి చెప్పండి.
మనికా: ఒక అమ్మాయి గా నేను ఈ విషయాలన్నీ ఇష్టపడతాను కానీ భారతదేశం జెండా ను నా దగ్గర ఎక్కడైనా ఉంచుకోవడం అది కూడా ప్రత్యేకం గా ఎప్పడైతే నేను ఆటలో భాగం గా సర్వీస్ చేస్తుంటానో, అప్పుడు నా ఎడమ చేయి నాకు కనపడుతుంది ఆ సమయం లో అక్కడ ఉన్న భారతీయ జెండా కనిపిస్తుంది, అది నాకు స్ఫూర్తి ని ఇస్తుంది. ఈ కారణంగా నేను భారతదేశం కోసం ఆడటానికి వెళ్ళినప్పుడల్లా నాకు ప్రేరణ కలిగేందుకు నేను ఒక వస్తువు ను అట్టిపెట్టుకొంటాను అది జెండా గాని మరేదైనా భారతదేశానికి సంబంధించింది కానీ అది నా మనస్సు తో ముడిపడి ఉండేటట్టు గా.
ప్రధాన మంత్రి: మనికా, మీకు నాట్యం అన్నా కూడా చాలా ఇష్టం అని నాకు చెప్పారు. నాట్యం పట్ల మీ అభిరుచి మీకు ఒత్తిడి ని తగ్గించే పని ని చేసి పెడుతుందంటారా?
మనికా: అవును సర్, ఎందుకంటే ఎవరికి అయినా సంగీతం వినడమో, నృత్యం చేయడమో ఆ పని ని చేస్తుంది. నాకేమో టూర్నమెంట్ కు వెళ్ళినప్పుడల్లా లేదా కొంత ఖాళీ సమయం చిక్కినప్పుడల్లా నేను గదికి చేరుకొని నృత్యం చేసి గాని ఆట ను ఆడి గాని వెళ్తానా, అది నాకు మంచి అనుభూతి ని ఇస్తుంది మరి నాకు (ఆత్మ) విశ్వాసం కూడా అందుతుంది.
ప్రధాన మంత్రి: నేను ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నాను, మీ కుటుంబ సభ్యులు, మీ స్నేహితులు అందరూ నవ్వుతూ ఉన్నారు.
ప్రధాన మంత్రి: మనికా, మీరు అంతర్జాతీయ స్థాయి చాంపియన్. మీరు మీ ఆట తో పిల్లలను కూడా జోడిస్తున్నారు. మీ సఫలత కేవలం ఆ బాలల కోసమే కాదు కానీ దేశం లో టేబల్ టెనిస్ ను ఆడే యువ క్రీడాకారులందరికీ ప్రేరణ ను ఇవ్వగలదు. ఈ రోజు న ఈ కార్యక్రమం లో మీరందరూ ఎంతో ఉత్సాహం తో పాలుపంచుకొంటున్నందుకు మీకు నా తరఫున చాలా చాలా శుభాకాంక్షలు. మీ కుటుంబ సభ్యులు అందరూ చూస్తున్నారు. మీకు నా పక్షాన చాలా చాలా శుభాకాంక్షలు, చాలా చాలా ధన్యవాదాలూను.
ప్రధాన మంత్రి: రండి మనం ఇప్పుడు వినేశ్ ఫోగాట్ గారి తో భేటీ అవుదాం, వినేశ్ నమస్తే.
వినేశ్: సర్ నమస్తే.
ప్రధాన మంత్రి: వినేశ్, మీరు ఫోగాట్ కుటుంబానికి చెందిన వారు. మీ కుటుంబం మొత్తం క్రీడల కోసం దేశాని కి చాలా ఇచ్చింది. ఈ గుర్తింపు కారణం గా కొంత అదనపు ఒత్తిడి, కాస్తంత ఎక్కువ బాధ్యత మీ మీద పడడం లేదు కదా?
వినేశ్: సర్, బాధ్యత అనేది ఖచ్చితం గా ఉంటుంది ఎందుకంటే కుటుంబం పని ని ప్రారంభించింది దానిని పూర్తి చేయవలసి ఉంది. ఒలింపిక్స్ తో ప్రారంభించిన కల బహుశా పతకం వచ్చిన తరువాత మాత్రమే ముగుస్తుంది. కాబట్టి ఆశ అయితే ఉంది, యావత్తు దేశం ఆశ పెట్టుకొంటుంది, కుటుంబానికి కూడా అంచనాలు ఉంటాయి. అంచనా లు మాకు అవసరం అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అంచనా లు కనిపించినప్పుడే మేం ఒక స్థాయి కి వెళ్ళిన తరువాత కొంచెం అదనం గా నెట్టుకువస్తాం. కాబట్టి సర్ ఒత్తిడి ఏమీ లేదు అని అనిపించడం బాగానే తోస్తుంది, చక్కగా ఆడుదాం, దేశానికి గర్వపడే అవకాశాన్ని తప్పక ఇద్దాం అని.
ప్రధాన మంత్రి: చూడండి, కిందటి సారి మీరు రియో ఒలింపిక్స్ లో గాయం కారణం గా వైదొలగవలసి వచ్చింది, నిరుడు కూడాను మీరు అనారోగ్యానికి లోనయ్యారు. మీరు ఈ బాధలన్నింటినీ అధిగమించి అద్భుతం గా ఆడారు. ఇంతటి ఒత్తిడి ని విజయం గా మార్చడం అనేది దానంతట అది చాలా పెద్ద విషయం, మీరు దీనిని ఎలాగ సాధించారు?
వినేశ్: సర్ కష్టమే కానీ వ్యాయామ క్రీడాకారులు గా మేం ఉన్నత స్థాయి లో ప్రదర్శన చేయాలి అంటే గనక మేం మానసికం గా బలం గా ఉండవలసివస్తుంది. మరి ఎథ్ లీట్ గా నేను అనుకుంటున్నాను ఏమని అంటే మమ్మల్ని ఆ స్థాయి కి సుకెళ్లడం కోసం ఇది అవసరం అని, ఈ కారణం గా కుటుంబానికి ఒక ప్రధాన భూమిక ఉంటుంది మాకు అండదండల ను అందించడం లో. అదే మా ఫెడరేశన్ ఉంది చూశారూ. అంతా పూర్తి నిజాయతీ తో సమర్ధిస్తూ ఉంటారు కాబట్టి వారి ని నిరాశ పరచకూడదు అని ఒక తలంపు ఉంటుంది, ఎవరైతే మా కోసం ఇంత చేస్తున్నారు, అలాంటప్పుడు ఎక్కడా ఆగకూడదు అనేది. ఎందుకంటే వారు ఆగకూడదనే మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. అప్పుడు మాకు ఆ సమయం లో చాలా విషయాలు గుర్తు కు వస్తాయి. కాబట్టి మేము ఆ పని మీదే ఉంటాం. అది గాయం అయినా. ఏది వచ్చినా సరే.
ప్రధాన మంత్రి: టోక్యో లో మీరు చాలా చక్కగా ఆడుతారని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇక ముందు మీ గురించి కూడా ఒక చిత్రం వస్తుంది అని మేం ఆశించవచ్చా?
వినేశ్: సర్, ఇది మీ అందరి ప్రార్థన. మరి మా వ్యాయామ క్రీడాకారులుందరం ఎవరమైతే వెళ్తున్నామో మన దేశాని కి కొద్ది గా అవకాశాన్ని ఇవ్వాలని అనుకుంటున్నాం. పతకాలు వస్తున్నాయి. మరి యావత్తు దేశ ప్రజలు ఏదయితే అంచనాల ను పెట్టుకొన్నారో వారి ని మేం నిరాశపరచకూడదు.
ప్రధాన మంత్రి: మీ తల్లితండ్రులు కూడా జతయ్యారు. మీ తల్లితండ్రులు కూడా ఒక విధంగా గురువులు. నేను తండ్రిగారి తో మాట్లాడాలి అని అనుకొంటున్నాను. వినేశ్ తల్లితండ్రులు కూడా ఉన్నారిక్కడ. నమస్తే. మీకు నేను వేసే ప్రశ్న కొంచెం భిన్నం గా ఉంది. ఎవరైనా ఆరోగ్యం గాను, ఫిట్ గాను ఉన్నారనుకోండి, అప్పుడు మన దేశం లో అంటారు- ఏ తిరగలి తిప్పి తయారు చేసిన పిండి ని తింటారు? అని. మరి ఫోగాట్ కుటుంబం వారి కుమార్తెల కు ఏ తిరగలి లో తయారు చేసిన పిండి ని తినిపిస్తుందో? చెప్పాలి; అలాగే, వినేశ్ కు ఏ మంత్రాన్ని ఇచ్చి టోక్యో కు పంపుతున్నారో కూడా చెప్పండి?
తండ్రి: చూడండి, తిరగలి పిండి ప్రసక్తి అంటారా, మేం మా ఊరి తిరగలి లో తయారు అయిన పిండి ని తింటాం. ఇంకా, ఆవుల ను మరియు గేదెల ను పెంచుతాం. ఆ ఆవు లు, గేదె లు ఇచ్చే పాలు తాగుతాం, ఆ ఆవు లు, గేదె లు ఇచ్చిన పాలతో తయారు చేసే పెరుగు ను, నెయ్యి ని, వెన్న ను ఆరగిస్తాం. వినేశ్ కు 2016 లో దెబ్బ తగిలినప్పుడు, నేను యావత్తు దేశాని కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రస్తుతం మా అమ్మాయి పైన పెట్టుకొన్న ఆశలు, అంచనా లు ఏవయితే ఉన్నాయో. మరి నేను ఆమె కు ఒకే వాగ్దానం చేశాను. ఒలింపిక్స్ లో బంగారు పతకాన్ని గనక తీసుకువచ్చావా అంటే నేను నిన్ను తీసుకు రావడం కోసం విమానాశ్రయాని కి వస్తాను అని. అది తీసుకు రాలేదూ అంటే, మరి నేను రాను అని. ఇవాళ్టికీ ఇదే మాట నాది. కిందటి సారి అయితే, మా అమ్మాయి ఒక్కతే మిగిలిపోయింది. కానీ ఈ సారి ఒలింపిక్స్ గురించి నేను పూర్తి బరోసా తో చెప్పగలను. మీరు ఈమె పాత టూర్నామెంట్ చూడండి. ఈ సారి మా అమ్మాయి మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈసారి కూడా ఆమె బంగారు పతకం తో వస్తుంది. నా కల ను నెరవేర్చుతుంది.
ప్రధాన మంత్రి: మీ తల్లితండ్రులు చెబుతున్న మాటల తో నాకు బరోసా ఏర్పడిపోయింది.. వినేశ్.. మీరు తప్పక గెలుస్తారు అని. మీరు పోరాడుతారు, పడిపోతారు, మళ్లీ పోరాడుతారు, కానీ ఓటమి ని ఒప్పుకోరు. మీరు మీ కుటుంబం నుంచి ఏదయితే నేర్చుకొన్నారో, తప్పక అది ఈ ఒలింపిక్స్ లో దేశాని కి ఉపయోగపడుతుంది. మీకు చాలా చాలా శుభాకాంక్షలు.
ప్రధాన మంత్రి: రండి, సాజన్ ప్రకాశ్ గారి తో మాట్లాడుదాం. సాజన్ గారు నమస్తే. సాజన్ గారు, మీ అమ్మగారు కూడా ఎథ్ లెటిక్స్ లో దేశాని కి కీర్తి ని పెంచారు అని నాకు చెప్పారు. మీ తల్లిగారి వద్ద నుంచి మీరు ఏమి నేర్చుకున్నారు?
సాజన్ ప్రకాశ్: సర్, నా తల్లే నాకు సర్వస్వం మరి ఆమె మునుపటి రోజులలో క్రీడాకారిణి గా ఉన్నారు. కార్యసాధన ల కోసం అన్ని సంఘర్షణల ను, అడ్డంకుల ను అధిగమించడం లో ఆమె నాకు సాయాన్ని అందించారు సర్.
ప్రధాన మంత్రి: మీకు పెద్ద గాయం కూడా అయింది అని నాకు చెప్పారు. దీని నుంచి మీరు ఎలా బయటకు రాగలిగారు?
సాజన్ ప్రకాశ్: మొదట, ఒక కొలను మూతపడిన తరువాత 18 నెలల కు మేం చాలా ఇబ్బందులు పడ్డాం; గాయం కారణం గా మేం చాలా కాలం పాటు కొలను లోకి ప్రవేశించలేకపోయాం. అది చాలా ఆశాభంగానికి లోను చేసింది, కుంగదీసింది కానీ ప్రజలందరి మరియు నా కోచ్ లు, గౌరీ ఆంటీ ఇంకా కేరళ పోలీస్, స్విమింగ్ ఫెడరేశన్ ఆఫ్ ఇండియా.. ప్రతి ఒక్కరూ సుఖదు:ఖాల్లో నాకు మద్దతు ను ఇచ్చారు, మరి నేను మానసికం గా బలం సంపాదించుకొని బయటకు రావడానికి, ఈ నొప్పి నుంచి గాయం బారి నుంచి తప్పించుకోవడానికి ఆ కాలమే సహాయపడింది అని నేను అనుకొంటున్నాను సర్.
ప్రధాన మంత్రి: సాజన్ మీరు ఒలింపిక్స్ కు వెళ్లక ముందే భారతదేశం క్రీడల స్వర్ణ చరిత్ర లో స్థానాన్ని సంపాదించుకొన్నారు. మీరు ఈ విజయాన్ని మీ యొక్క ప్రదర్శన తో మరింత పసిడి వన్నె లోకి మారుస్తారు అని నేను ఆశిస్తున్నాను.
ప్రధాన మంత్రి: మన్ ప్రీత్, కరోనా ఒకటో వేవ్ కాలం లో, మీరందరూ బెంగళూరు లో మకాం పెట్టారని, మరి అంతా కలసి కరోనా కు వ్యతిరేకం గా పోరాడారని నాకు చెప్పారు. ఇది జట్టు స్ఫూర్తి ని ఎలా ప్రభావితం చేసిందంటారు?
మన్ ప్రీత్: సర్, ఆ వేళ ప్రభుత్వం వైపు నుంచి చాలా సమర్థన అందింది అని నేను చెప్పదలచుకొన్నాను. మేం బెంగళూరు లో ఉన్నప్పుడు మా జట్టు ను ఎలా బలం గా మార్చుకోగలుగుతాము అన్నదే మా ముందున్న అంశం. మేం దాని మీదే శ్రద్ధ తీసుకొన్నాం. మేం కలసి పనిచేశాం. ఆటగాళ్ళ నేపథ్యాన్ని గురించి, వారి కుటుంబాలు వారి సంతానం కోసం ఏ విధమైన త్యాగాలు చేసిందీ కూడా మేం తెలుసుకొన్నాం. మా బృందం బంధం ఎంత గట్టిగా పెనవేసుకుపోతున్నదీ కూడా మేం తెలుసుకొన్నాం. మేము ఆలోచించాం, మాకు మరొక సంవత్సరం మిగిలివుంది కాబట్టి మేం ఎలాగ మరింత మెరుగ్గా తయారు కాగలం అని. మేం ఇతర జట్ల ను గురించి కూడా అధ్యయనం చేశాం, వారి బలాలు, వారి బలహీనతలు గురించి, వారిని మేం ఎక్కడ బాధించగలం అనేది. అది మాకు చాలా సహాయకారి అవుతుంది.
ప్రధాన మంత్రి: ఒలింపిక్స్ లో హాకీ లో మన దేశానికి గొప్ప చరిత్ర ఉంది. సహజంగానే, ఆ ఖ్యాతి ని కాపాడడానికి మీ ఆటగాళ్లంతా ఒత్తిడి కి లోనవ్వాల్సి వస్తుంది అనేది స్వాభావికం. మరి ఈ కారణం గా, ఆట ఆడేటప్పుడు మీకు ఏదైనా అదనపు ఉద్రిక్త వాతావరణం అనేది ఏర్పడుతుందా?
మన్ ప్రీత్: లేదు సర్, ఎంతమాత్రం లేదు. ఇంతవరకు, మనం 8 బంగారు పతకాలను గెలుచుకొన్నాం. అది ఏదైనా ఒక ఈవెంట్ లో చాలా ఎక్కువ. ఈ కారణం గా, మేం అదే ఆట ను ఆడుతున్నాం అని గర్వం గా భావించుకొంటున్నాం. మేం ఒలింపిక్స్ కు వెళ్ళినప్పుడల్లా, మేం మా ఉత్తమమైన ఆట ను ఆడడానికి, భారతదేశానికి పతకాలను గెలవడానికే ప్రయత్నిస్తాం.
ప్రధాన మంత్రి: నేను మీ కుటుంబ సభ్యుల ను కూడా చూడగలుగుతున్నాను. వారికి ఇవే నా శుభాకాంక్ష లు. వారి ఆశీర్వాదాలు మీతో ఉంటాయి. మరి అలాగే దేశప్రజల శుభాకాంక్షలు కూడా మీతో ఉన్నాయి.
ప్రధాన మంత్రి: మన్ ప్రీత్, మీతో మాట్లాడేటప్పుడు, మేజర్ ధ్యాన్ చంద్, కె. డి. సింహ్ బాబు, మొహమ్మద్ శాహిద్ ల వంటి గొప్ప హాకీ క్రీడాకారులు నాకు గుర్తుకొస్తున్నారు. మీరు హాకీ యొక్క ఘనమైన చరిత్ర ను మరింత వైభవోపేతం చేస్తారనేదే నా నమ్మకమూ, యావత్తు దేశం నమ్మకమూను.
ప్రధాన మంత్రి: సానియా గారు, మీరు అనేక గ్రాండ్ స్లామ్ లను గెలుచుకున్నారు, అగ్రగామి క్రీడాకారుల తో కలసి ఆడారు. టెనిస్ లో చాంపియన్ గా అవ్వాలి అంటే ఏయే లక్షణాలు ఉండాలని మీరు అనుకొంటున్నారు? ఎందుకంటే ఈ కాలం లో రెండో అంచె, మూడో అంచె నగరాలలో సైతం మీకు అభిమానగణం ఉన్నారనేది నేను గమనించాను, అంతే కాకుండా ఆ ప్రాంతాల లోని యువత కూడా టెనిస్ ను నేర్చుకోవాలి అని కోరుకొంటున్నారు మరి.
సానియా: సర్, టెనిస్ కు ప్రపంచ వ్యాప్తంగా సమర్థన ఉంది అని నేను అనుకొంటున్నాను. 25 సంవత్సరాల క్రితం నేను ఈ ఆట ను ఆడడం మొదలుపెట్టినప్పుడు, చాలా మంది టెనిస్ ను ఆడలేదు. కానీ ప్రస్తుతం, మీరు చెబుతున్నట్లుగా, టెనిస్ రాకెట్ ను పట్టుకొని వృత్తినైపుణ్యం కల క్రీడాకారులు గా తయారు కావాలనుకొనేటటువంటి, టెనిస్ లో అగ్రగామి ఆటగాళ్లు గా మారగలమని నమ్మేటటువంటి పిల్లలు చాలా మంది ఉన్నారు. అందుకోసం మీకు మద్దతు, సమర్పణ భావం, మరీ ముఖ్యం గా విధి అవసరం అనేది స్పష్టం. ఎందుకంటే విధి కూడా ఒక పాత్ర ను పోషిస్తుంది, అయితే కష్టపడనిదే, ప్రతిభ లేనిదే ఏదీ జరుగదు.. అది టెనిస్ అయినా లేదా మరే క్రీడ అయినా సరే. మరి ఇప్పుడు చాలా మెరుగైనటువంటి సదుపాయాలు ఉన్నాయి. 25 సంవత్సరాల క్రితం తో పోలిస్తే అనేక మంచి స్టేడియమ్ లు ఉన్నాయి. హార్డ్ కోర్టు లు ఉన్నాయి. అందుకని భారతదేశం లో చాలా మంది టెనిస్ క్రీడాకారులు ఎదుగుతారు అని నేను ఆశపడుతున్నాను.
ప్రధాన మంత్రి: ఒలింపిక్స్ లో మీ భాగస్తురాలు అంకిత రైనా తో మీ భాగస్వామ్యం ఎలా ఉంది? మీరు ఇద్దరూ ఎలాగ సంసిద్ధం అవుతున్నారు?
సానియా: అంకిత యువ క్రీడాకారిణి. ఆమె చాలా బాగా ఆడుతోంది. ఆమె తో ఆడటం నాకు చాలా ఉత్సాహం గా ఉంటుంది. మేం గత సంవత్సరం ఫిబ్రవరి లో ఫెడ్ కప్ ఆటల లో ఆడాం. మేం అక్కడ చాలా బాగా ఆడాం. ఇక మేం ఒలింపిక్స్ కు వెళ్ళడం కోసం వేచి ఉన్నాం. ఒలింపిక్స్ లో పాలుపంచుకోవడం నాకు ఇది నాలుగో సారి. ఇది ఆమె కు ఒకటో ఒలింపిక్స్. ఈ వయస్సు లో, నాకు యువ భాగస్వామి అవసరం. దానికి ఆమె సరిపోతుంది.
ప్రధాన మంత్రి: సానియా, గతం లో క్రీడల విషయం లో ప్రభుత్వ విభాగాల పనితీరు ను మీరు గమనించి ఉన్నారు. గత 5-6 సంవత్సరాలు గా మీకు తోచినటువంటి మార్పు ఎలాంటిది?
సానియా: మనం కామన్ వెల్థ్ గేమ్స్ ను నిర్వహించినప్పటి నుంచి, క్రికెట్ కాక ఇతర రంగాల లో సైతం ఎంతో మంది క్రీడాకారులు, క్రీడాకారిణులు ఉన్నారు. వారు రాణిస్తున్నారు. దేశానికి పేరు ప్రఖ్యాతుల ను సంపాదించిపెడుతున్నారు. ఈ నమ్మకం గత అయిదారు సంవత్సరాల లో పెరిగింది. అప్పట్లో, మాకు ప్రభుత్వం సమర్థన ఎల్లవేళ లా ఉండేది. నేను మీతో భేటీ అయినప్పుడల్లా, మీరు మీ సమర్థన ను పునరుద్ఘాటిస్తూ ఉండే వారు. కాబట్టి 5-6 సంవత్సరాల లో చాలా విషయాలు చోటు చేసుకొన్నాయి. మరి గత ఒలింపిక్స్ తో పోల్చి చూస్తే చాలా చాలా మార్పు లు జరిగాయి.
ప్రధాన మంత్రి: సానియా, మీరు చాంపియనే కాక ఫైటర్ కూడాను. ఈ ఒలింపిక్స్ లో మీరు అత్యంత సఫలమైనటువంటి క్రీడాకారిణి గా నిలుస్తారు అని నేను ఆశిస్తున్నాను. మీకు ఇవే నా శుభాకాంక్షలు.
అస్వీకరణ: ఇది ప్రధాన మంత్రి ప్రసంగానికి రమారమి అనువాదం. సిసలు ఉపన్యాసం హిందీ భాష లో సాగింది.
(Release ID: 1740116)
Visitor Counter : 243
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada