గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

స్మార్ట్ సిటీస్ మిషన్ కింద జూన్ 2021 నాటికి 2,734 ప్రాజెక్టులు పూర్తి

Posted On: 28 JUL 2021 3:01PM by PIB Hyderabad

జనవరి 2016 నుండి జూన్ 2018 వరకు 4 రౌండ్ల పోటీ ద్వారా ఎంపిక చేసిన 100 నగరాల్లో స్మార్ట్ సిటీస్ మిషన్ (ఎస్‌సీఎం) అమలు చేయబడుతోంది. 30 జూన్, 2021 నాటికి, ఈ నగరాలు రూ.1,79,413 కోట్ల మేర విలువైన 5,956 ప్రాజెక్టులు టెండ‌ర్ చేయ‌బ‌డినాయి; ఇందులో రూ.1,48,029 కోట్ల విలువైన దాదాపు 5,314 ప్రాజెక్టులకు సంబంధించిన‌ వర్క్ ఆర్డర్లు జారీ చేయబడ్డాయి; వీటిలో రూ.7 46,769 కోట్ల విలువైన 2,734 ప్రాజెక్టులు పూర్తి చేయ‌బ‌డినాయి. 2021 జూన్ నాటికి కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీల కోసం రాష్ట్రాలకు / కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ.23,925 కోట్ల మేర నిధుల‌ను విడుదల చేసింది. జనవరి, 2016లో రౌండ్-1లో ఎంపిక చేసిన మొత్తం 20 స్మార్ట్ సిటీలలోని ఆయా ప్రాజెక్టుల స్థితిగతులు కిందన‌ ఇవ్వబడ్డాయి.

(మొత్తం రూ.కోట్ల‌లో)

స్మార్ట్‌సిటీ

టెండ‌ర్ ద‌శ‌

వ‌ర్క్ ఆర్డ‌ర్ ద‌శ‌

ముగిసిన ప‌నులు

మొత్తం ప్రాజెక్టులు

మొత్తం నిధులు

ప్రాజెక్టుల సంఖ్య

నిధులు

ప్రాజెక్టుల సంఖ్య

నిధులు

ప్రాజెక్టుల సంఖ్య

నిధులు

మొద‌టి రౌండ్ న‌గ‌రాలు

(20 న‌గ‌రాలు)

127

11,750

548

26,966

1,119

18,408

1,794

57,124

(ఎస్‌సీఎం జియో-స్పేషియల్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, 30 జూన్, 2021)

రౌండ్-1 లో ఎంపిక చేసిన స్మార్ట్ సిటీలకు చెందిన‌ స్మార్ట్ సిటీల‌ ప్లాన్‌ల‌లో భాగమైన రూ. 57,124 కోట్ల విలువైన 1,794 ప్రాజెక్టులలో.. రూ.45,374కోట్ల (79%) విలువైన 1,667 ప్రాజెక్టులు (93%) పూర్తయ్యాయి లేదా అమలు ద‌శ‌లో ఉన్నాయి. ఈ నగరాల‌లో చేపట్టిన ఆయా ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడానికి అన్ని ర‌కాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సమాచారాన్ని గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స‌హాయ మంత్రి శ్రీ కౌషల్ కిషోర్ ఈ రోజు రాజ్యసభకు ఇచ్చిన ఒక‌ లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. 

                                                                                                                                   

*****



(Release ID: 1740035) Visitor Counter : 190