అణుశక్తి విభాగం
విద్యుత్ ఉత్పాదనను పెంచడం కోసం మరిన్ని అణు విద్యుత్ ప్లాంట్లను కమిషన్ చేయనున్న ప్రభుత్వం - డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
28 JUL 2021 3:20PM by PIB Hyderabad
విద్యుత్ ఉత్పాదన కోసం మరిన్ని అణు విద్యుత్ కేంద్రాలను ప్రారంభించడానికి ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసిందని , కేంద్ర శాస్త్ర &సాంకేతిక శాఖ (ఇండిపెండెంట్ చార్జి), ఎర్త్ సైన్సెస్ శాఖ (ఇండిపెండెంట్ చార్జి), ప్రధాన మంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా సమస్యలు, పింఛన్లు, అణు ఇంధనం, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. బుధవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వకంగా సమాధానం ఇస్తూ, మొత్తం 6780 మెగావాట్ల ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన 22 రియాక్టర్లు పని చేస్తున్నాయని, కెఎపిపి -3 (700 మెగావాట్ల) అన్న రియాక్టర్‌ను 10 జనవరి 2021న గ్రిడ్ తో అనుసంధానం చేయడం జరిగిందని మంత్రి వివరించారు. ఇందుకు అదనంగా, మొత్తం 8000 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన 10 రియాక్టర్ల (భావిని అమలు చేస్తున్న 500 మెగావాట్ల పిఎఫ్‌బిఆర్ సహా) నిర్మాణం వివిధ దశల్లో ఉందని ఆయన తెలిపారు.
10 దేశీయ 700 మెగావాట్ల ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ల (పిహెచ్‌డబ్ల్యుఆర్‌ల)లను వేగంగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం పాలనాపరమైన ఆమోదాన్ని, ఆర్థిక మంజూరు చేసిందని తెలిపారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు వేగంగా పూర్తి అయిన తర్వాత, అనుమతి పొంది పని చేయడం ప్రారంభమైన తర్వాత దేశ అణు సామర్ధ్యం 2031 నాటికి 22480 మెగావాట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని అణు విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
అణు విద్యుత్‌కు సంబంధించి, నమూనా, ప్రదేశం, నిర్మాణం, ప్రారంభం, కార్యకలాపాల వంటి అన్ని అంశాలకూ అత్యధిక ప్రాతినిధ్యాన్ని, ప్రాముఖ్యతను ఇవ్వడం జరిగింది. విస్తీర్ణత (రిడండెన్సీ) , వైవిధ్యం భద్రతా సూత్రాలను అనుసరించి, లోతైన భద్రతా విధానాన్ని అనుసరించి ఫెయిల్- సేఫ్ లక్షణాలను అణు విద్యుత్ ప్లాంట్ల నమూనాలను రూపొందించారు. దీనికారణంగా రేడియా ధార్మికత మూలానికి, పర్యావరణానికి మధ్య బహుళ ఆటంకాలు ఉంటాయని చెప్పారు.
ఈ కార్యకలాపాలను నిర్దేశిత విధానాల ఆధారంగా ఉన్నత విద్యార్హత, శిక్షణ కలిగిన, లైసెన్స్ పొందిన సిబ్బంది నిర్వహిస్తారు. అణు విద్యుత్ ప్లాంట్లలో పని చేస్తున్న సిబ్బందికి తగిన వ్యక్తిగత భద్రతా పరికరాలు, పర్యవేక్షణ మద్దతును కల్పిస్తున్నారు.
***
(Release ID: 1740030)
Visitor Counter : 205