శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

విద్యార్థినులు హైయర్‌ సెకండరీ స్థాయిలో సైన్స్ స్ట్రీమ్‌లో ప్రాచుర్యం పొందటానికి అనేక చర్యలు తీసుకుంటున్నాము-డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 27 JUL 2021 12:55PM by PIB Hyderabad

కేంద్ర సైన్స్ & టెక్నాలజీ సహాయమంత్రి (ఇండిపెండెంట్ ఛార్జ్) ; ఎర్త్ సైన్సెస్; ఎంఓఎస్‌ పిఎంఓ, పర్సనల్, పబ్లిక్ గ్రీవియెన్స్, పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ అండ్ స్పేస్ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్..విద్యార్థినులు హైయర్‌ సెకండరీ స్థాయిలో  సైన్స్ స్ట్రీమ్‌లో ప్రాచుర్యం పొందటానికి అనేక చర్యలు తీసుకుంటున్నామని ఈ రోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. 9-12 తరగతుల్లోనిప్రతిభావంతులైన బాలిక విద్యార్థులను ప్రోత్సహించడానికి సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం (డిఎస్టి) 2019-20 సంవత్సరంలో 'విజ్ఞానజ్యోతి' అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ముఖ్యంగా మహిళలు తక్కువ ప్రాతినిధ్యం ఉన్న ప్రాంతాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీలో విద్య మరియు వృత్తిని కొనసాగించడాని చర్యలు చేపట్టింది.

ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని దేశంలోని 100 జిల్లాల్లో అమలు చేస్తున్నారు. సైన్స్ క్యాంప్‌లు, ప్రత్యేక ఉపన్యాసాలు / తరగతులు, విద్యార్థులు-తల్లిదండ్రుల కౌన్సెలింగ్ మరియు ఆదర్శవంతమైన ప్రముఖులతో పరస్పర చర్చలు వంటి వివిధ కార్యక్రమాలు ఈ కార్యక్రమంలో నిర్వహించబడతాయి. ఎంపికైన బాలికలు సమీపంలోని శాస్త్రీయ సంస్థలు మరియు పరిశ్రమలను సందర్శించే అవకాశం కూడా పొందుతున్నారు. అటల్ టింకరింగ్ ల్యాబ్స్ (ఎటిఎల్) కు ప్రొత్సాహం, అందుబాటులో ఉన్న చోట టింకరింగ్ కార్యకలాపాల కోసం ఎంపిక చేసిన విద్యార్థులకు కూడా అందించబడుతుంది.

సైన్స్ అండ్ టెక్నాలజీ (ఎస్ & టి) రంగంలో మహిళా పరిశోధకులను ప్రోత్సహించడానికి మరియు ప్రోత్సహిం అందించడానికి సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి చెందిన విమెన్ ఇన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్-కిరాన్ (వైజ్-కిరన్) పథకం వివిధ కార్యక్రమాలను కలిగి ఉంది. వైజ్-కిరన్ కింద 'ఉమెన్ సైంటిస్ట్ స్కీమ్' మహిళా శాస్త్రవేత్తలు మరియు సాంకేతిక నిపుణులకు, ప్రత్యేకించి దాని మూడు భాగాల క్రింద కెరీర్‌లో విరామం పొందిన వారికి, అంటే i) బేసిక్ & అప్లైడ్‌లో పరిశోధనలు నిర్వహించడానికి మహిళా శాస్త్రవేత్తల పథకం- ఏ (డబ్లుఓఎస్-ఏ) సైన్సెస్, ii) సామాజిక ప్రయోజనం కోసం ఎస్ & టి జోక్యం చేసుకునే పరిశోధన కోసం మహిళా శాస్త్రవేత్తల పథకం-బి (డబ్లుఓఎస్-బి), మరియు మేధో సంపత్తి హక్కులలో (ఐపిఆర్) ఇంటర్న్‌షిప్ కోసం మహిళా శాస్త్రవేత్తల పథకం-సి (డబ్లుఓఎస్-సి) కార్యక్రమాలు ఉన్నాయి. మొబిలిటీ ప్రోగ్రామ్ మహిళా పరిశోధకులకు పునఃస్థాపన సమస్యను పరిష్కరిస్తుంది. వీటితో పాటు 'ఇండో-యుఎస్ ఫెలోషిప్ ఫర్ విమెన్ ఇన్ స్టెమ్' (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ & మెడిసిన్) కార్యక్రమం మహిళా శాస్త్రవేత్తలు మరియు సాంకేతిక నిపుణులకు యూఎస్‌ఏలోని ప్రధాన సంస్థల్లో 3-6 నెలలు  అంతర్జాతీయ సహకార పరిశోధనలను చేపట్టడానికి అవకాశాలను అందిస్తుంది.

ఎస్ & టిలో పరిశోధన మరియు అభివృద్ధి కార్యకలాపాలలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి మహిళా విశ్వవిద్యాలయాలలో పరిశోధన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం 'యూనివర్శిటీ రీసెర్చ్ కన్సాలిడేషన్ త్రూ ఇన్నోవేషన్ అండ్ ఎక్సలెన్స్ ఇన్ ఉమెన్ యూనివర్సిటీస్ (క్యూరీ)' కార్యక్రమం ద్వారా సంస్థాగత సహకారం అందించబడుతుంది. స్టెమ్‌(సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అండ్ మెడిసిన్)లో లింగ నిష్పత్తిని మెరుగుపర్చడానికి అంతిమ లక్ష్యంతో సంస్థలను మరింత లింగ సున్నితమైన విధానం మరియు సమగ్రంగా మార్చడం లక్ష్యంగా పెట్టుకున్న ‘జెండర్ అడ్వాన్స్‌మెంట్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇన్స్టిట్యూషన్స్ (జిఏటిఐ)' అనే కొత్త కార్యక్రమాన్ని డిఎస్టీ ప్రారంభించింది.

2020-21 మధ్యకాలంలో, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్ (ఎస్‌ఈఆర్‌బి) సెర్బ్‌-పవర్‌(అన్వేషణాత్మక పరిశోధనలో మహిళలకు అవకాశాలను ప్రోత్సహించడం) పథకాన్ని ప్రారంభించింది. సైన్స్ మరియు ఇంజనీరింగ్ పరిశోధనా కార్యకలాపాలలో మహిళా శాస్త్రవేత్తల భాగస్వామ్యాన్ని మెరుగుపర్చడం మరియు లింగ అసమానతను తగ్గించడం ఈ కార్యక్రమ లక్ష్యం. వీటితో పాటు  సైన్స్‌లో రాణించిన 40 ఏళ్లలోపు యువ మహిళా శాస్త్రవేత్తలకు బహుమతులు ఇవ్వడానికి సెర్బ్‌ 'ఉమెన్ ఎక్సలెన్స్ అవార్డు'ను ఏర్పాటు చేసింది.


 

<><><>



(Release ID: 1739566) Visitor Counter : 157