ఆయుష్

ఆయుష్ వ్యవస్థ ద్వారా వివిధ వ్యాధి చికిత్సల‌కు ప్రాచుర్యం అందించేలా చొరవ

Posted On: 27 JUL 2021 3:38PM by PIB Hyderabad

కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆయుష్ వ్యవస్థ ద్వారా వివిధ వ్యాధుల చికిత్సకు ప్రాచుర్యం అందించేలా చొర‌వ‌చూపుతోంది. తన సెంట్రల్ సెక్టార్ స్కీమ్ కింద అంతర్జాతీయ స‌హ‌కారంతో పాటు అంత‌ర్జాతీయ ప్రచారం, ఆయుష్ వైద్య విధానాలకు ప్ర‌పంచ వ్యాప్తంగా త‌గిన‌ ఆమోదం ల‌భింప‌జేసేందుకు వివిధ ర‌కాల కార్యక్రమాలను చేపడుతోంది. ఆయుష్ విభాగాల‌కు వాణిజ్య సదుపాయాల క‌ల్ప‌నకు వివిధ దేశాలతో ద్వైపాక్షిక, బహుపాక్షిక చర్చలు జ‌ర‌ప‌డం.. ఆయుష్ వ్యవస్థల‌కు గుర్తింపు తేవ‌డంతో పాటు ఆయుష్ ఉత్పత్తులు/ మందులు/ సేవల ఎగుమతుల‌ను  ప్రోత్సహించడానికి అంకితమైన ఆయుష్ ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్‌ను (ఏఈపీసీ) ఏర్పాటు చేయడంతో పాటుగా అంతర్జాతీయంగా జ‌రిగే ప్రదర్శనలలో పాల్గొనడానికి పరిశ్రమలు మరియు ఆసుపత్రులకు త‌గిన మద్దతు అందించేలా వివిధ చ‌ర్య‌ల‌ను చేప‌డుతోంది. డబ్ల్యూహెచ్‌ఓ, ఐఎస్‌ఓ వంటి వివిధ అంతర్జాతీయ ఏజెన్సీలతో సహకరించడం, అవుట్‌బౌండ్ పెట్టుబడులను ప్రోత్సహించడం, అంతర్జాతీయ ఆయుష్ ఇన్‌స్టిట్యూట్‌ల‌ను స్థాపించడం, భారతదేశంలో ఆయుష్ కోర్సులు అభ్యసించేందుకు గాను విదేశీ పౌరులకు స్కాలర్‌షిప్ ఇవ్వడం ద్వారా నాణ్యతా ప్రమాణాలను నెలకొల్పేలా వివిధ దేశాలకు నిపుణులను నియమిస్తోంది. ఆయుష్ రంగంలో వైద్య పర్యాటక రంగం పెంపొందించడానికి మరియు ప్రపంచ స్థాయి అత్యాధునిక ఆయుష్ ఆసుపత్రులను స్థాపించడానికి.. సహాయాన్ని అందించేలా ప్రభుత్వం మెడికల్ వాల్యూ ట్రావెల్ కోసం ఛాంపియన్ సర్వీసెస్ సెక్టార్ స్కీమ్‌ను అభివృద్ధి చేసింది. ప్రభుత్వం మెడికల్, వెల్నెస్, యోగా మరియు ఆయుర్వేద పర్యాటక రంగం పెంపొందించ‌డానికి నేషనల్ మెడికల్ & వెల్నెస్ టూరిజం బోర్డును ఏర్పాటు చేసింది. ఆయుష్ వ్యవస్థ ద్వారా భారతదేశాన్ని ఆరోగ్య మరియు ఆరోగ్య సంరక్షణ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాల‌ని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మ‌న భారత సాంప్రదాయ వ్యవస్థను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం నేషనల్ ఆయుష్ మిషన్ (నామ్) ప్రారంభించడం వంటి వివిధ ర‌కాల‌ విధాన కార్యక్రమాల‌ను చేపట్టింది. ఆయుష్ ఆస్పత్రులు, డిస్పెన్సరీల సంఖ్య పెంచి ఆయుష్‌ను జాతీయ కార్యక్రమంలో చేర్చడం ద్వారా ఆయుష్ సేవలకు మెరుగైన ప్రాప్యత లభించేలా చేయ‌డ‌మైంది. ఆయుష్ ఆస్పత్రులు మరియు డిస్పెన్సరీల సంఖ్య పెంచ‌డంతో క్యాన్సర్, డయాబెటిస్, కార్డియో -వాస్కులర్ వ్యాధులు మరియు స్ట్రోక్ (ఎన్‌పీసీడీసీఎస్) నివారణ మరియు నియంత్రణ వెసులుబాటు క‌ల్పిస్తూ జాతీయ కార్యక్రమంలో ఆయుష్‌ను చేర్చడ‌మైంది. ఆయుష్ సేవ‌ల‌ను అందించేందుకు దాదాపు 12500 ఆయుష్ హెల్త్‌ మరియు వెల్‌నెస్ సెంట‌ర్ల‌ను అందుబాటులోకి తేవ‌డం జ‌రిగింది. ఆయుష్మాన్ భారత్ ఆధ్వర్యంలోని వివిధ కేంద్రాల‌లోని ఆయుష్ చికిత్సల కోసం త‌గిన బీమా కవరేజీని ప్రవేశపెట్టడంతో పాటుగా ప్రింట్/ ఎలక్ట్రానిక్/ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల ద్వారా ఆయుష్ వ్యవస్థల ప్ర‌యోజ‌నాల‌ను వ్యాప్తి చేయడ‌మైంది. సమాజ ఆరోగ్య సంరక్షణను ప్రోత్సహించడానికి ప్రామాణికమైన ఆయుష్ చికిత్స విధానాల‌ను తీసుకురావ‌డానికి ప్రఖ్యాతమైన‌ ఆయుష్ మరియు అల్లోపతి సంస్థలలో ఆయుష్ వైద్య ఆరోగ్య విభాగాన్ని స్థాపించడానికి.. మ‌రియు త‌గిన‌ట్టుగా సహాయాన్ని అందించేందుకు ఆయుర్‌స్వ‌స్త్య‌ యోజ‌న‌ అనే కొత్త ఆరోగ్య సంర‌క్ష‌ణ పథకం అభివృద్ధి చేయబడింది. ఈ సమాచారాన్ని కేంధ్ర ఆయుష్ శాఖ స‌హాయ మంత్రి శ్రీ మహేంద్రభాయ్ ముంజపారా ఈ రోజు రాజ్యసభకు ఇచ్చిన ఒక‌ లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
                               

*****

 



(Release ID: 1739563) Visitor Counter : 227