యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
భారత్ కు చేరుకున్న మీరాబాయి చాను కి ఘన స్వాగతం
ప్రారంభం రోజునే పతాకాన్ని సాధించిన చాను దేశం మొత్తానికి ఒక స్ఫూర్తినిచ్చింది : శ్రీ అనురాగ్ ఠాకూర్
ఒలింపిక్ క్రీడా వేదికపై మెరిసిన తార మీరాబాయిని ఒక ప్రత్యేక వేడుక సందర్బంగా ఘనంగా సత్కరించిన క్రీడల శాఖ మంత్రి
Posted On:
26 JUL 2021 9:49PM by PIB Hyderabad
చాను విజయం ద్వారా 'టాప్స్' కార్యక్రమం దేశంలో క్రీడల అభివృద్ధికి, మన క్రీడాకారులు పతకాలు సాధించడానికి ఎటువంటి కీలకమైన పాత్ర పోషించిందో స్పష్టం అయింది: క్రీడల శాఖ మంత్రి .
నాకు ప్రభుత్వం అందించిన సహకారానికి కృతజ్ఞురాలును, ఈ విధంగా సహకారం లేనట్టయితే ఒలింపిక్ పతకం దిశగా నా పయనం సాధ్యం అయ్యేది కాదు: మీరాబాయి చాను.
టోక్యో ఒలింపిక్స్‌లో భారతదేశం మొదటి పతక విజేత సైఖోమ్ మీరాబాయి చాను, ఆమె కోచ్ విజయ్ శర్మ నిన్న సాయంత్రం దేశానికి తిరిగి వచ్చారు. వీరోచితంగా విజయం సాధించి వచ్చిన వారిద్దరికి ఘాన స్వాగతం లభించింది. కేంద్ర క్రీడా మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ తన నివాసంలో మీరాబాయి చాను ను సత్కరించారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి శ్రీ కిరెన్ రిజిజు, ఈశాన్య ప్రాంత పర్యాటక, సంస్కృతి, అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి, కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాలు, ఆయుష్ మంత్రి శ్రీ షర్బానంద సోనోవాల్, క్రీడలు, యువజన వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ నిసిత్ ప్రమాణిక్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మహిళల 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్‌లో రజత పతకం సాధించిన చాను ప్రఖ్యాత స్ట్రెంగ్త్, కండిషనింగ్ కోచ్ డాక్టర్ ఆరోన్ హార్స్‌చిగ్‌తో ప్రత్యేక శిక్షణ కు మే 1 న అమెరికాకు బయలుదేరిన తరువాత తిరిగి భారత్ కి ఇదే. కోవిడ్ -19 కేసుల పెరుగుదల కారణంగా భారతదేశం నుండి వచ్చే వారికి అమెరికాలో ఆంక్షలు ఉన్నప్పటికీ, చాను అతి తక్కువ సమయంలోనే వెళ్లడానికి ప్రభుత్వం వేగంగా ఏర్పాట్లు చేసింది.
“ఇది నాకు ఒక కల. నిజమైంది. నేను ఈ క్షణం కోసం కొన్నేళ్లుగా శిక్షణ పొందుతున్నాను. ఒలింపిక్ లో అంతా సవ్యంగా సాగంది, నేను ఎంతో సంతోషిస్తున్నాను” అని పట్టరాని ఆనందంతో చెప్పింది చాను. ప్రభుత్వం సకాలంలో అండగా నిలిచి సహకారాన్ని అందించినందుకు, ముఖ్యంగా రెండు సార్లు అమెరికా వెళ్ళడానికి తగు ఏర్పాట్లు చేసినందుకు కృతజ్ఞతలు అని చాను తెలిపారు. "నా భుజానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి గత సంవత్సరం అమెరికా పర్యటన ఈ పతకం సాధించే నా ప్రయాణంలో కీలకమైనది. ప్రభుత్వం అందించిన అన్ని సహకారాలకు నేను కృతజ్ఞురాలను. ఆ సహకారం లేకుండా ఒలింపిక్ పతకం కోసం ఈ ప్రయాణం సాధ్యం కాదు. టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్) నా కెరీర్, పతకాల అవకాశాలను పెంచిందని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను" అని మీరాబాయి చాను వివరించారు.
టోక్యోలో జరిగిన పతక బహుకరణ కార్యక్రమంలో భారత జెండా రెపరెపలాడినపుడు, జాతీయగీతం ఆలపించినపుడు మిరాబాయి చాను విజయం గర్వంతో నిండిన 130 కోట్ల మంది భారతీయుల విజయం అని శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ అభినందించారు. ప్రారంభ రోజున భారతీయురాలు పతకం సాధించడం ఒలింపిక్ చరిత్రలో ఇదే మొదటిసారి. మన అథ్లెట్ల అభివృద్ధికి, భారతదేశం పతక ఆశలను పెంచడంలో టాప్స్ కార్యక్రమం ఎలా కీలక పాత్ర పోషించిందో కూడా ఆమె విజయం చూపిస్తుంది. మోడీ ప్రభుత్వం క్రీడా ప్రతిభను పెంపొందించుకుంటూ, అత్యున్నత స్థాయిలో రాణించడానికి ప్రతి సదుపాయాన్ని కల్పిస్తుంది. ఆమె ఒలింపిక్ లో ప్రదర్శించిన క్రీడా స్ఫూర్తి మొత్తం దేశం ఆశయాలకు నిలిచింది. ఆమె ఈశాన్యం నుండి అథ్లెట్లకు స్ఫూర్తినిస్తుంది” అని శ్రీ అనురాగ్ ఠాకూర్ ప్రశంసించారు.
కేంద్ర న్యాయ, న్యాయశాఖ మంత్రి శ్రీ కిరెన్ రిజిజు మాట్లాడుతూ, టోక్యోకు బయలుదేరే ముందు, ఆమె దేశానికి పతకం తెస్తామని మేము మాట్లాడుకున్న సందర్బంగా ఆమె హామీ ఇచ్చింది. దానిని నిజం చేసింది. ఆమె భారతదేశానికి తెచ్చిన కీర్తి, గౌరవం వెనుక ఎన్నో సంవత్సరాల పట్టుదల, అంకితభావం, అవిరామమైన కృషి ఉంది.. అని కేంద్ర మంత్రి రిజిజు అన్నారు.
కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి మాట్లాడుతూ “ మన దేశ బిడ్డలు తల్లి భారతి గర్వించేలా ప్రదర్శించిన తీరుకు నేనెంతో గర్వపడుతున్నాను. మెడలో వెండి పతకం ధరించి విజయ వేదిక పై నిలబడి మీరాబాయి ప్రతి భారతీయుడి హృదయాలను గెలుచుకుంది. ఆమె కేవలం క్రీడా ప్రపంచానికే కాదు, కలలు, లక్ష్యాలతో ఉన్న ప్రతి యువకుడికి ప్రేరణగా నిలుస్తుంది. ఈశాన్య రాష్ట్రాల్లో క్రీడలు, ఫిట్‌నెస్ కార్యకలాపాల పట్ల ఉత్సాహాన్ని పెంపొందించుకోడానికి ఈ అవకాశాన్ని వినియోగించాలని నేను కోరుకుంటున్నాను. ఈ చురుకైన క్రీడా సంస్కృతి భారతదేశానికి కీర్తిప్రతిష్టలు తీసుకువస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను” అని అన్నారు.
అపూర్వమైన విజయం సాధించిన మీరాబాయి ని కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ అభినందించారు. దేశానికి మీరాబాయి స్ఫూర్తినిచ్చారని, ఇందుకు తామంతా గర్విస్తున్నామని అన్నారు.
ఛాంపియన్ వెయిట్ లిఫ్టర్ పై శ్రీ ప్రమాణిక్ ప్రశంసల జల్లు కురిపించారు. “చాలా సంవత్సరాల కృషి కారణంగా ఈ పతకం సాధించింది మీరాబాయి. వెయిట్ లిఫ్ట్ చేస్తూ చాను ప్రదర్శించిన క్రీడా స్ఫూర్తి 135 కోట్ల మంది భారతీయులలో ఎంతో గర్వాన్నినింపింది. కానీ ఈ ప్రయాణం ఇక్కడితో ఆగదని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. దేశ ప్రజల ఆశీస్సులతో రాబోయే సంవత్సరాల్లో మీరాబాయి ఇంకా పతకాలు సాధిస్తుంది ” అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
*******
(Release ID: 1739431)
Visitor Counter : 204