సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

“మన్ కి బాత్” ద్వారా ప్ర‌ధాని ఇచ్చిన పిలుపుతో అనేక రెట్లు పెరిగిన ఖాదీ అమ్మకాలు

Posted On: 25 JUL 2021 4:25PM by PIB Hyderabad

దేశ వ్యాప్తంగా 2014 నుండి ఖాదీ ఉత్పత్తుల అమ్మకాలు బాగా పెరిగాయి. దేశంలో ఖాదీ ఉత్ప‌త్తుల ప్రోత్సాహానికి గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ పదేపదే చేసిన విజ్ఞప్తుల మేర‌కు ఖాదీ అమ్మ‌కాలు పెరిగాయి. ప్ర‌ధాని చేసిన విజ్ఞ‌ప్తుల‌కు కృతజ్ఞతలు. అక్టోబర్ 2016 నుండి, న్యూ ఢిల్లీలోని క‌న్నెట్ ప్లేస్‌లోని ఖాదీ ఇండియా ఫ్లాగ్‌షిప్ అవుట్‌లెట్‌లో ఒక్క‌ రోజు అమ్మకాలు 11 వేర్వేరు సందర్భాలలో రూ.1 కోట్ల మార్కును దాటాయి. ఖాదీ యొక్క ఈ రికార్డ్ పనితీరు జూలై 25, ఆదివారం ప్రసారమైన ప్రధానమంత్రి రేడియో కార్యక్రమం “మన్ కిబాట్” యొక్క తాజా ఎపిసోడ్‌లో ప్రత్యేక ప్రస్తావించ‌డ‌మైంది. ఈ పనితీరుకు సంబంధించి మరింత ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఆర్థిక ఇబ్బందులు మరియు కరోనా మహమ్మారి చుట్టుముట్టి ఉంద‌న్న‌ భయం నెల‌కొని ఉన్న‌ప్పటికీ ఖాదీ యొక్క ఒక్క రోజు అమ్మకాలు  అక్టోబర్ - నవంబర్ 2020 లో నాలుగు సార్లు రూ.1 కోటి మార్క్‌ను దాటింది. అంతకుముందు 2018 లో కూడా, ఖాదీ యొక్క సీపీ అవుట్‌లెట్‌లో ఒక్క‌ రోజు అమ్మకాలు నాలుగు సార్లు రూ.కోటిల భారీ మార్కును దాటాయి. 2 అక్టోబర్ 2019న, ఖాదీ మరియు గ్రామ పరిశ్రమల కమిషన్ (కేవీఐసీ) సీపీ అవుట్‌లెట్‌లో అత్యధికంగా ఒకే రోజు అమ్మకం రూ.1.27 కోట్లుగా నమోద‌యింది, ఇది ఇప్పటి వరకు రికార్డుగా కొనసాగుతోంది. సీపీలోని ఖాదీ ఇండియా అవుట్‌లెట్‌లో 2016 అక్టోబర్ 22న ఒక్క‌ రోజు అమ్మకం రూ.1.16 కోట్లకు చేరుకోవడం తొలిసారి. అంతకుముందు, ఖాదీ అత్యధిక సింగిల్ డే అమ్మకం రూ.66.81 లక్షలుగా నిలిచింది. ఇది అక్టోబర్ 4, 2014న నమోదైంది. “మన్ కిబాట్” ద్వారా ప్రధాని మొదటి ప్రసంగం తర్వాత రోజే కావ‌డం గ‌మ‌నార్హం. తన రేడియో కార్యక్రమం యొక్క మొదటి ఎపిసోడ్‌లో ప్ర‌సంగిస్తూ దేశ ప్రజలు దీపావ‌ళి సంద‌ర్భంగా క‌నీసంగా ఒక ఖాదీ ఉత్పత్తిని కొనాలని కోరారు. దీని ద్వారా పేద కళాకారుల దీపావళి రోజున‌ దీపాలను వెలిగించటానికికు సహాయపడాల‌ని విజ్ఞప్తి చేశారు.
ప్ర‌ధాన మంత్రి నిరంత‌ర మ‌ద్ద‌తు..
దేశంలో ఖాదీ అమ్మకాల వృద్ధికి ఖాదీని ప్రోత్సహించడానికి ప్రధాని నిరంతరం మద్దతు ఇస్తున్నట్లుగా కేవీఐసీ ఛైర్మన్ శ్రీ విన‌య్‌ కుమార్ సక్సేనా అభిప్రాయ‌ప‌డ్డారు. గౌరవ ప్రధాని విజ్ఞప్తి కారణంగానే ఎక్కువ మంది ప్రజలు ముఖ్యంగా యువకులు ఖాదీ ఉత్ప‌త్తుల‌ను కొనడానికి బాగా మొగ్గు చూపుతున్న‌ట్టు ఆయన విశ్లేషించారు.
దోహ‌దం చేస్తున్న "స్వదేశీ" నినాదం..
కోవిడ్ -19 మహమ్మారి యొక్క సవాలు సమయాల్లో కూడా లక్షలాది గ్రామ పరిశ్రమలు అభివృద్ధి చెందడానికి "స్వదేశీ" అనే నినాదం ఎంత‌గానో దోహ‌దప‌డింది. కోవిడ్ మహమ్మారి యొక్క తీవ్రమైన ప్రభావం ఉన్నప్పటికీ 2020-21లో కేవీఐసీ రూ.95,741.74 కోట్ల అత్య‌ధిక‌
వార్షిక ట‌ర్నోవ‌ర్‌ను న‌మోదు చేసింది. 2019-20లో న‌మోదైన రూ.88,887 కోట్ల టర్నోవర్‌తో పోలిస్తే అత్యధిక వార్షిక టర్నోవర్ 7.71 శాతం అధికం.

 

ఒక్క‌రోజు ఖ‌దీ యొక్క అమ్మ‌కాల వివ‌రాలు..

· అక్టోబ‌రు 4, 2014 – రూ.66.81 ల‌క్ష‌లు

· అక్టోబ‌రు 2, 2015 – రూ.91.42 ల‌క్ష‌లు

· అక్టోబ‌రు 22, 2016 – రూ.116.13 ల‌క్ష‌లు

· అక్టోబ‌రు 17, 2017 – రూ.117.08 ల‌క్ష‌లు

· అక్టోబ‌రు 2, 2018 – రూ.105.94 ల‌క్ష‌లు

· అక్టోబ‌రు 13, 2018 – రూ.125.25 ల‌క్ష‌లు

· అక్టోబ‌రు 17, 2018 – రూ.102.72 ల‌క్ష‌లు

· అక్టోబ‌రు  20, 2018 – రూ.102.14 ల‌క్ష‌లు

· అక్టోబ‌రు  2, 2019 – రూ.127.57 ల‌క్ష‌లు

· అక్టోబ‌రు  2, 2020 – రూ.102.24 ల‌క్ష‌లు

· అక్టోబ‌రు  24, 2020 – రూ.105.62 ల‌క్ష‌లు

· న‌వంబ‌రు 7, 2020 – రూ.106.18 ల‌క్ష‌లు

· న‌వంబ‌రు 13, 2020 – రూ.111.40 ల‌క్ష‌లు

 

***



(Release ID: 1738984) Visitor Counter : 168