ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
భవిష్యత్ కోవిడ్ వేవ్‌లు పిల్లలపై మరింత ప్రభావం చూపుతాయని, వాటి తీవ్రత ఎక్కువగా ఉండవచ్చని వస్తున్న సమాచారం ఊహాగానమే: డాక్టర్ ప్రవీణ్ కుమార్, డైరక్టర్, డిపార్టమెంట్ ఆఫ్ పీడియాట్రిక్స్, లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజి, న్యూఢిల్లీ గర్భిణులకు , పాలిచ్చే తల్లులకు కోవిడ్ వాక్సిన్ రక్షణగా నిలుస్తుంది.ఇది గర్భంలో పెరుగుతున్న బిడ్డను, అప్పుడే పుట్టిన పిల్లలను ఈ మహమ్మిరినుంచి కాపాడేందుకు ఉపకరిస్తుంది.
ఇప్పటివరకు పెద్దలతో పోలిస్తే పిల్లలలో కోవిడ్ మరణాల రేటు తక్కువగాఉంది. పిల్లల మరణాలకు సంబంధించిన వాటిలో ఇతర అనారోగ్యాలు కూడా ఉంటున్నాయి.
Posted On:
21 JUL 2021 2:53PM by PIB Hyderabad
పిల్లలపై కోవిడ్ -19 ప్రభావం, వారిని రక్షించుకోవలసిన అంశం, గర్భిణులకు , పాలిచ్చే తల్లులకు వాక్సిన్ వేయించడం వంటి అంశాలపై న్యూఢిల్లీలోని లేడి హార్డింగ్ మెడికల్ కాలేజీ డిపార్టమెంట్ ఆఫ్ పీడియాట్రిక్స్ కు చెందిన డాక్టర్ ప్రవీణ్‌కుమార్ పలువిషయాలను వెల్లడించారు.
కోవిడ్ మహమ్మారి పిల్లల మానసిక,శారీరక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? దీని దీర్ఘ కాలిక ప్రభావాన్ని తగ్గించడానికి ఏం చేయాలి?
కోవిడ్ మహమ్మారి పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సంవత్సరకాలానికి పైగా వారు ఇంటికే పరిమితమై ఉంటున్నారు.అలాగే, కుటంబంలో అనారోగ్యం, తల్లిదండ్రులు ఉపాధి కోల్పోవడం వంటివి వారిపై ఒత్తిడి పెరగడానికి కారణమౌతున్నాయి. పిల్లలు మానసిక ఒత్తిడిని వివిధ రూపాలలో ఒక్కొక్కరు ఒక్కోరకంగా వ్యక్తం చేయవచ్చు. కొందరు మౌనంగా ఉండడం ద్వారా తమ బాధను వ్యక్తం చేస్తే, మరికొందరు కొపం ద్వారా, మితిమీరిన చురుకుదనంతో వ్యవహరించవచ్చు.
చిన్నపిల్లల విషయంలో వారి సంరక్షకులు ఓపికతో వ్యవహరించాలి. వారి మానసిక స్థితిని సరిగా అర్థం చేసుకోవాలి. పిల్లలలో ఒత్తిడి లక్షణాలను కనిపెట్టాలి. విపరీతమైన ఆందోళన, విషాదం, అనారోగ్యకర తిండి,లేదా నిద్రఅలవాట్లు సరిగా దేనిపైనా దృష్టిపెట్టలేకపోవడం వంటివి గుర్తించి వారిలొ ధైర్యం నింపాలి. పిల్లలొ ఆందోళనను, భయాన్ని తొలగించేందుకు పెద్దలు , కుటుంబ సభ్యులు తమ తోడ్పాలును అందించాలి.
కోవిడ్ -19 సెకండ్‌వేవ్ ఏరకంగా పిల్లలపై ప్రభావం చూపింది?
కోవిడ్ సెకండ్ వేవ్ పిల్లలపై సమాన ప్రభావాన్ని చూపింది. కోవిడ్ -19 అనేది కొత్త రకం వైరస్. ఇది అన్ని వయసులవారిపై ప్రభావం చూపుతుంది. వైరస్‌కు వ్యతిరేకంగా సహజశిద్దమైన రోగనిరోధక శక్తి వివధ వర్గాలలో లేదు. ఎన్‌సిడిని, ఐడిఎస్‌పి డాష్ బోర్డు అందించిన వివరాల ప్రకారం, కోవిడ్ మహమ్మారికి గురైన వారిలో సుమారు 12 శాతంమంది పేషెంట్లు 20 సంవత్సరాల లోపు వారని తెలిసింది.
ఇటీవల నిర్వహించిన సర్వేలు పిల్లలు, పెద్దలలో ఒకేరకమైన సీరో పాజిటివిటీ ని చూపాయియ. సెకండ్‌వేవ్‌లో ఎక్కువమంది కోవిడ్ బారిన పడడం వల్ల , మొదటి వేవ్ లో కంటే రెండో వేవ్‌లో ఎక్కువమంది పిల్లలు కోవిడ్ బారిన పడ్డారు. ఇప్నటివరకు పిల్లలో మరణాలు పెద్దలతో పోలిస్తే తక్కువగానే ఉన్నాయి. పిల్లల మరణం విషయంలో ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఉన్నారు.
చిన్నపిల్లలకు చికిత్స చేయడంలో మీరు ఎదుర్కొన్న సవాళ్లు ఏమిటి, ప్రత్యేకించి ఎవరికి ఆస్పత్రి లో చేరాల్సిన అవసరం ఏర్పడుతుంది?
కోవిడ్ బారినపడిన పిల్లలకు మెరుగైన చికిత్స అందించడానికి బెడ్ల సంఖ్యను పెంచడం వల్ల చాలావరకు పరిస్థితిని జాగ్రత్తగా ఎదుర్కోగలిగాం. అయితే సెకండ్‌వేవ్ తీవ్రస్తాయిలో ఉన్నప్పుడు మేం సీనియర్ డాక్టర్లు, రెసిడెంట్ డాక్టర్లు, స్టాఫ్ నర్సులు చాలామంది కోవిడ్ పాజిటివ్‌గా తేలడంతో ఇబ్బందులు పడ్డాం. సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్నప్పుడు రెఫరల్ ఆస్పత్రికి రెకమండ్ అయినవారికి సేవలు అందించడంలో సవాలు ఎదుర్కోన్నాం.
ఎంఐఎస్-సి అంటే ఏమిటి? దీనిస్థితి, ఎంఐఎస్-సి కేస్‌కు చికిత్స అందించేటపుడు ఎదుర్కొనే సవాళ్లు ఏమిటి? తల్లిదండ్రులకు దీనిగురించి అవగాహన ఉండాలంటారా, దీనికి చికిత్స ఏమిటి?
చిన్నపిల్లలు, కౌమారదశలో ఉన్నవారు (0నుంచి19 సంవత్సరాల లోపు) . కోవిడ్ -19 ఇన్‌ఫెక్షన్ బారిన పడిన వారిలో రెండు నుంచి ఆరువారాలలోపు ఇది బయటపడుతోంది.
ఇందుకు సంబంధించి మూడు రకాల క్లినికల్ కోర్సులు ఉన్నాయి. జ్వరం కొనసాగుతుండడం, ఇనఫ్లమేటరీ లక్షణాల కొనసాగడం కవసాకి వ్యాధి వంటి లక్షణాలు, షాక్,ఎల్ వి సరిగా పనిచేయకపోవడం వంటివి ఇందులో ఉన్నాయి. ఎంఐఎస్-సి ని నిర్ధారించడానికి ఆధునిక నిర్ధారణ పరీక్షలు అవసరం. అనుమానిత కేసులను రెఫరల్ , టెర్షియలీ కేర్ ఆస్పత్రులకు హెచ్‌డియు, ఐసియు సదుపాయం కలిగిన వాటికి రెఫర్‌చేయాలి. తొలిదశలో నిర్ధారించినపుడు ఈ కేసులకి సత్వర చికిత్సకు అందించడానికి వీలు కలుగుతుంది.
***
(Release ID: 1737626)
Visitor Counter : 304