ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

మానవులపై మొట్టమొదటి సారిగా నమోదైన బర్డ్ ఫ్లూ కేసుపై అంటు వ్యాధులకు సంబంధించిన పరిశోధన ప్రారంభించిన - హర్యానాలోని ఐ.డి.ఎస్.పి. రాష్ట్ర నిఘా విభాగం (ఎస్.ఎస్.యు)


రోగి సమీపంలో తిరిగిన వ్యక్తులపై ఏవైనా లక్షణాల కోసం - నిఘా
ఈ ప్రాంతంలో బర్డ్ ఫ్లూ అనుమానంతో ఏ కేసు నమోదు కాలేదు

ఏదైనా ఇతర రోగ లక్షణాలతో కేసులు ఉంటే, తెలియజేయడానికి వీలుగా అవగాహన కల్పించే కార్యకలాపాలు కొనసాగుతున్నాయి

Posted On: 21 JUL 2021 8:10PM by PIB Hyderabad

హర్యానాలోని గురుగ్రామ్ లో 11 సంవత్సరాల చిన్నారికి  హెచ్.5.ఎన్.ఎక్స్ సోకిన మొదటి మానవ కేసు గా నమోదయ్యింది. 

2021 జూన్ లో ఒక మగ పిల్లవానికి ఏ.ఎం.ఎల్. సోకినట్లు, ఢిల్లీ లోని ఎయిమ్స్, చిన్న పిల్లల వైద్య విభాగంలో నిర్ధారణ అయింది. ఏ.ఎం.ఎల్. కోసం ఇండక్షన్ థెరపీ తర్వాత, ఆ పిల్లవానికి, జ్వరం, దగ్గు, కొరిజా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు వృద్ధి చెందాయి.  అతనికి న్యుమోనియా మరియు షాక్‌ తో జ్వరసంబంధమైన న్యూట్రోపెనియాతో ఏ.ఎం.ఎల్.గా నిర్ధారించారు.  ఇది ఏ.ఆర్.డి.ఎస్. గా పురోగమిస్తుంది. 2021 జూలై,  2వ తేదీన అతడ్ని, న్యూ ఢిల్లీ లోని ఎయిమ్స్‌లో చేర్చారు.  నేక అవయవాలు పనిచేయకపోవడంతో ఆ బాలుడు చాలా బాధపడి, 2021 జూలై, లో  2021 న మరణించాడు. 

ఎయిమ్స్ కు చెందిన మైక్రోబయాలజీ విభాగం  2021 జూలై 7 మరియు 11 తేదీల్లో శ్వాసకోశ నాళం పరీక్ష కోసం బ్రోంకోఅల్వియోలార్ లావేజ్ (బి.ఎ.ఎల్) ను అందుకుంది. ఈ నమూనాను పరీక్షిస్తే,  ఇన్-ఫ్లూయెంజా-ఎ మరియు  ఇన్-ఫ్లూయెంజా-బి రెండింటికీ పాజిటివ్‌ గా తేలింది.  ఇది సార్స్-కోవ్-2 తో పాటు ఇతర శ్వాసకోశ వైరస్ లకు కూడా నెగిటివ్ గా తేలింది.   హెచ్.1.ఎన్.1 మరియు హెచ్.3.ఎన్.2. లకు అందుబాటులో ఉన్న కారకాలతో ఎయిమ్స్ వద్ద పరీక్షిస్తే, ఇన్-ఫ్లూయెంజా-ఎ  అనిశ్చితంగా ఉంది. అందువల్ల, ఈ నమూనాలను,  2021 జూలై 13వ తేదీన ఎన్.ఐ.వి. కి పంపారు. 

ఈ రెండు నమూనాలు, ఎన్.ఐ.వి. వద్ద, ఇన్-ఫ్లూయెంజా-ఎ మరియు  ఇన్-ఫ్లూయెంజా-బి లతో పాటు  ఇన్-ఫ్లూయెంజా-ఎ సీజనల్ (హెచ్.1.ఎన్.1, హెచ్.1.ఎన్.1. పి.డి.ఎం.09 మరియు హెచ్.3.ఎన్.2), సీజనల్ కాని ఏవియన్ సబ్-టైప్స్ (హెచ్.5, హెచ్.7, హెచ్.9, హెచ్.10) రియల్ టైమ్ పి.సి.ఆర్. చేత పరీక్షించబడ్డాయి. ఫలితం ఏ/హెచ్.5 మరియు టైప్-బి. విక్టోరియా లైనేజ్ కి, ఈ నమూనా సానుకూలంగా ఉన్నట్టు తేలింది.  మొత్తం జీనోమ్ సీక్వెన్సింగ్ మరియు వైరస్ ఐసోలేషన్ ప్రక్రియలో ఉన్నాయి.

పూణే లోని ఎన్.ఐ.వి. ప్రయోగశాల నివేదిక తో పాటు వచ్చిన సమాచారాన్ని,  ఢిల్లీ లోని ఎన్‌.సి.డి.సి. కి 2021 జూలై 16వ తేదీ శుక్రవారం రోజున, ఢిల్లీ లోని ఎయిమ్స్ నుండి  అందుకుంది.  ఈ కేసుపై అంటువ్యాధులకు సంబంధించిన దర్యాప్తును ప్రారంభించడం కోసం, ఈ సమాచారాన్ని, హర్యానాలోని ఐ.డి.ఎస్.పి. రాష్ట్ర నిఘా కేంద్రం (ఏ.ఎస్.యు) కు తెలియజేయడం  జరిగింది.  ఈ విషయాన్ని పశుసంవర్ధక శాఖకు కూడా నివేదించారు.  ఎన్‌.సి.డి.సి. కి చెందిన సాంక్రమిక వ్యాధి నిపుణులు, సూక్ష్మజీవుల శాస్త్ర నిపుణులతో కూడిన ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు.  అంటువ్యాధులపై అంచనా నివేదిక రూపొందించడానికి ఈ  బృందం వెంటనే న్యూఢిల్లీ, గురుగ్రామ్ లలోని ఎయిమ్స్ సంస్థలను సందర్శించింది.  ఈ దర్యాప్తులో రాష్ట్ర ఆరోగ్య శాఖ, పశుసంవర్ధక శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు. 

రోగికి చికిత్స చేస్తున్న వైద్యులు మరియు నర్సుల బృందాన్ని కూడా 2021 జులై, 16వ తేదీ నుండీ పర్యవేక్షిస్తున్నారు. అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, వారికి ఇంతవరకు, ఎటువంటి శ్వాసకోశ సంబంధమైన వ్యాధి వంటి అనారోగ్య లక్షణాలు కనబడలేదు.  కాంటాక్ట్ ట్రేసింగ్ చేపట్టారు.  కుటుంబ సభ్యులు, సన్నిహిత పరిచయస్తులు, ఆరోగ్య సంరక్షణ కార్మికులపై నిఘా కొనసాగుతోంది.   వీరిలో ఎవరికీ వ్యాధి లక్షణాలు లేవు.  ఏదైనా రోగ లక్షణాలు కనుక్కోడానికి చేసే, కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రక్రియను, వ్యాధి సోకిన వారు నివసించిన ప్రాంతంలోనూ, చికిత్స పొందిన ఆసుపత్రి లోనూ, చురుకుగా నిర్వహిస్తున్నారు.    ఏదైనా రోగ లక్షణాలు ఉన్న కేసు వివరాలను వెంటనే, ఆరోగ్యశాఖ అధికారులకు నివేదించ వలసిందిగా కోరుతూ, సాధారణ ప్రజల కోసం ఐ.ఈ.సి. కార్యకలాపాలు నిర్వహించడం  జరిగింది.   ప్రస్తుతం, ఈ ప్రాంతంలో, రోగ లక్షణాలు కలిగిన వ్యక్తులు ఎవరూ లేరు.

ఈ ప్రాంతంలో బర్డ్ ఫ్లూ అనుమానంతో ఏ కేసు నమోదు కాలేదని పశుసంవర్ధక శాఖ నిర్ధారించింది. కాగా, ముందుజాగ్రత్త చర్యగా 10 కిలోమీటర్ల పరిధిలో నిఘా పెంచింది.  దీనితో పాటు, పశుసంవర్ధక శాఖ, రాష్ట్ర ప్రభుత్వ నిఘా విభాగాలను కలుపుకుని, ఎన్‌.సి.డి.సి. అంటు వ్యాధులపై దర్యాప్తు జరుగుతోంది మరియు తగిన ప్రజారోగ్య చర్యలను ప్రారంభించింది. 

 

 

*****



(Release ID: 1737620) Visitor Counter : 266