సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రులు శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్, శ్రీమతి మీనాక్షి లేఖీ లతో కలిసి ఎన్.జి.ఎం.ఏ. ను సందర్శించిన - కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి
Posted On:
21 JUL 2021 6:16PM by PIB Hyderabad
కీలక ముఖ్య ముఖ్యాంశాలు:
- తాత్కాలిక ఎగ్జిబిషన్ హాల్ మరియు కొత్తగా పునరుద్ధరించిన జైపూర్ హౌస్ ను మంత్రులు సందర్శించారు, నంద్ లాల్ బోస్ వేసిన చిత్రాలు అమర్చిన తీరును వారు ప్రశంసించారు
- వర్చువల్ మ్యూజియం, ఆడియో-విజువల్ యాప్ తో సహా ఎన్.జి.ఎం.ఏ. నిర్వహిస్తున్న యొక్క వివిధ కార్యక్రమాలను సమీక్షించారు
- "ఆజాదీ-కా-అమృత్-మహోత్సవ్" లో భాగంగా దేశంలోని ఉత్తమ ఆధునిక ఆర్ట్ గ్యాలరీ ని దేశానికి పునరంకితం కానుంది.
కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రులు శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్, శ్రీమతి మీనాక్షి లేఖీ లతో కలిసి, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి, ఈ రోజు న్యూఢిల్లీ లోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ (ఎన్.జి.ఎం.ఎ) ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో - కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి, శ్రీ రాఘవేంద్ర సింగ్; ఎన్.జి.ఎం.ఎ. డైరెక్టర్ జనరల్ శ్రీ అద్వైత గడనాయక్; డైరెక్టర్, శ్రీమతి తెమ్సునారో జమీర్ తో పాటు, ఎన్.జి.ఎం.ఎ. కు చెందిన ఇతర అధికారులు పాల్గొన్నారు.
అమృతా షెర్గిల్, రవీంద్రనాథ్ ఠాగూర్, రాజా రవివర్మ, నికోలస్ రోరిచ్, జమిని రాయ్, రామ్ కింకర్ బైజ్ వంటి సుప్రసిద్ధ కళాకారుల కళాఖండాల ప్రదర్శన కోసం పునర్నిర్మించిన జైపూర్ హౌస్ ను మంత్రులు సందర్శించారు. వారు తాత్కాలిక ఎగ్జిబిషన్ హాల్ మరియు ఎగ్జిబిషన్ హౌస్ (నూతన విభాగం) ను కూడా సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన పెయింటింగ్స్ మరియు ఇతర కళాకృతులను పరిశీలించారు. గ్యాలరీలో కళాత్మకంగా అమర్చిన నంద్ లాల్ బోస్ యొక్క పెయింటింగ్స్ మరియు హరిపురా ప్యానెల్స్ ప్రదర్శనపై మంత్రులు ప్రత్యేక ఆసక్తి చూపించారు.
వర్చువల్ మ్యూజియం, ఆడియో-విజువల్ యాప్ తో సహా ఎన్.జి.ఎం.ఏ. నిర్వహిస్తున్న యొక్క వివిధ కార్యక్రమాలను, సహాయ మంత్రులతో కలిసి, శ్రీ కిషన్ రెడ్డి, ఈ సందర్భంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా, శ్రీ కిషన్ రెడ్డి, విలేకరులతో మాట్లాడుతూ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆశయాలకు అనుగుణంగా, "ఆజాదీ-కా-అమృత్-మహోత్సవ్" నేపథ్యంలో, ఈ జాతీయ ఆధునిక ఆర్ట్ గ్యాలరీ పునరుద్ధరించబడుతోందని, తెలియజేశారు. పునర్నిర్మాణం, పునర్వ్యవస్థీకరణ పనులు పూర్తయిన తరువాత, నూతనంగా రూపుదిద్దుకున్న ఎన్.జి.ఎం.ఏ. ప్రజల సందర్శన కోసం, దేశానికి పునరంకితం కానుందని, కేంద్ర మంత్రి వివరించారు. గ్యాలరీలో ప్రదర్శించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో పెయింటింగ్ లు మరియు కళాకృతులను సేకరించడం జరుగుతోంది. ఈ సేకరణ దేశ భవిష్యత్ తరాలకు అందుబాటులో ఉంటుంది. అతి త్వరలో దేశంలో ఉత్తమ ఆధునిక ఆర్ట్ గ్యాలరీ ప్రత్యేక సేకరణల తో దేశ రాజధానిలో సిద్ధంగా ఉంటుందని మంత్రి తెలిపారు. ఈ పనులన్నీ పూర్తయిన తరువాత, ప్రజల సందర్శన కోసం ప్రారంభించనున్నట్లు, ఆయన వెల్లడించారు.
ఆధునిక మరియు సమకాలీన భారతీయ కళాకృతులను కలిగి ఉన్న నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ (ఎన్.జి.ఎం.ఏ), ప్రపంచంలోనే ఆధునిక కళాకృతులు కలిగిన అతిపెద్ద మ్యూజియం లలో ఒకటి.
దేశంలో ఆధునిక కళను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఎన్.జి.ఎం.ఏ. స్థాపించబడింది. ఇది 1850 సంవత్సరం నుండి కళాకృతులను సేకరించి, సంరక్షించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఎన్.జి.ఎం.ఏ. చేపట్టిన కళాకృతుల సేకరణ చాలా విస్తారమైనది, పరిశీలనాత్మక మైనది. ఎన్.జి.ఎం.ఏ. సేకరించిన కళ్ళకృతులు సూక్ష్మ చిత్రాల నుండి ఆధునిక చిత్రాలు, సమకాలీన కళా ఖండాల వరకు విస్తరించి ఉన్నాయి.
కొనుగోళ్ళు, బహుమతులు వంటి వివిధ వనరుల ద్వారా, ఎన్.జి.ఎం.ఏ. అనేక యూరప్, సుదూర తూర్పు దేశాలకు చెందిన కళాకారులు రూపొందించిన కళాఖండాలను కూడా సేకరించింది. 18వ, 19వ శతాబ్దాలలో భారతదేశాన్ని సందర్శించిన యూరప్ కళాకారుల చిత్రాలు, కళాఖండాలతో పాటు, అపురూపమైన భారతీయ దృశ్యాల వంటివి అనేకం ఈ సేకరణలో ఉన్నాయి.
*****
(Release ID: 1737591)
Visitor Counter : 247