ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 అప్‌డేట్‌

Posted On: 21 JUL 2021 9:25AM by PIB Hyderabad

దేశ‌వ్యాప్త వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఇప్ప‌టివ‌ర‌కు 41.54 కోట్ల వాక్సిన్ డోస్‌లు వేయ‌డం జ‌రిగింది.
ఇప్ప‌టివ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా కోవిడ్ -19 నుంచి 3,03,90,687 మంది కోలుకున్నారు.
కోవిడ్ నుంచి రిక‌వ‌రీ రేటు ప్ర‌స్తుతం 97.36 శాతం
గ‌త 24 గంట‌ల‌లో 36,977 మంది పేషెంట్లు కోవిడ్‌నుంచి కోలుకున్నారు.
గ‌త 24 గంట‌ల‌లో ఇండియాలో 42,105 కొత్త కోవిడ్ కేసులు న‌మోద‌య్యాయి.
ఇండియాలో క్రియాశీల కేస్‌లోడ్ 4,07,170 గా ఉంది.
క్రియాశీల కేసులు మొత్తం కేసుల‌లో 1.30 శాతంగా ఉన్నాయి.

వార‌పు పాజిటివిటి రేటు 5 శాతం కంటే త‌క్కువ‌. ప్ర‌స్తుతం ఇది 2.09 శాతంగాఉంది.
రోజ‌వారి పాజిటివిటి రేటు 2.27 శాతం. వ‌రుస‌గా 30 వ రోజు 3 శాతం కంటే త‌క్కువ‌గా ఉంది.
దేశంలో కోవిడ్ ప‌రీక్ష‌ల‌ను గ‌ణ‌నీయంగా పెంచ‌డం జ‌రిగింది. ఇప్ప‌టివ‌ర‌కు నిర్వ‌హించిన కోవిడ్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు 44.91 కోట్ల‌కు చేరుకున్నాయి.

***



(Release ID: 1737489) Visitor Counter : 131