ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

డిజిటల్ టెక్నాలజీకి (కోవిన్) ప్రాప్యత లేని వ్యక్తులకూ నమోదు మ‌రియు కోవిడ్ టీకాలు

Posted On: 20 JUL 2021 3:54PM by PIB Hyderabad

భారతదేశంలో టీకాలు పొందిన లబ్ధిదారులందరూ కోవిన్ పోర్టల్‌లో నమోదు చేయబడ్డారు.
టీకా స్థితిని తెలుసుకోవ‌డానికి కోవిన్‌ పోర్టలే ఏకైక మూలం. 16 జూలై 2021, నాటికి గుర్తింపు కార్డులు లేని వారికి మొత్తం 3.48 లక్షల మోతాదుల (మొత్తం మోతాదులలో 0.09%) మేర టీకాలు ఇవ్వబడ్డాయి. దీనికి సంబంధించి రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల వివరాలు అనుబంధంలో ఇవ్వ‌డ‌మైంది. 

 

త‌గిన డిజిటల్ టెక్నాలజీకి ప్రాప్యత లేని వ్యక్తుల నమోదు మరియు టీకాలు వేయడానికి వివిధ మార్గాలను అవ‌లంభించ‌వ‌చ్చు:
- కోవిడ్‌-19 టీకా కేంద్రానికి (సీవీసీ) వ్య‌క్తిగ‌తంగా వెళ్ల‌డం లేదా సమూహంగా వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవ‌డం.
- అక్క‌డి సాధార‌ణ సేవా కేంద్రంలో పేరును న‌మోదు చేసుకోవ‌చ్చు.
- మొబైల్ ఫోన్లు లేని వ్యక్తుల నమోదుల‌ను సులభతరం చేయడానికి ఒకే మొబైల్ నంబర్‌ను ఉపయోగించి న‌లుగురు పేర్లను నమోదు చేసుకోనే వీలు క‌ల్పించారు.
గుర్తించబడిన ప్రభుత్వ సీవీసీల వద్ద ప్ర‌ధాన‌ ఫెసిలిటేటర్ల ద్వారా.. త‌గిన‌ ఫోటో గుర్తింపు పత్రాలు లేకుండా వ‌చ్చే ప్రజలకు టీకాలు వేయడానికి సంబంధించి వివరణాత్మక ఎస్ఓపీ జారీ చేయబడింది.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ ఈ రోజు న్యూఢిల్లీలో రాజ్యసభకు ఇచ్చిన ఒక లిఖితపూర్వక సమాధానంలో ఈ విష‌యం తెలియ‌జేశారు.
                                                                 

****



(Release ID: 1737341) Visitor Counter : 155