మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

ఆక్సిజన్ సరఫరా నియంత్రణ పరికరం 'ఆమ్లెక్స్' కు రూపకల్పన చేసిన ఐఐటీ రోపర్

Posted On: 20 JUL 2021 11:48AM by PIB Hyderabad

 సరఫరాను నియంత్రించి ఆక్సిజన్ ను ఆదా చేసే పరికరాన్ని తొలిసారిగా ఐఐటీ రోపర్ రూపొందించింది.  'ఆమ్లెక్స్పేరిట ఐఐటీ రోపర్ అభివృద్ధి చేసిన ఈ పరికరం రోగికి అవసరం అయినప్పుడు మాత్రమే ఆక్సిజన్ అందిస్తుంది. దీనితో ఒక ఆక్సిజన్ సిలిండర్ జీవిత కాలం మూడు రెట్లు పెరుగుతుంది. రోగి ఊపిరి పీల్చినప్పుడు మాత్రమే ఆక్సిజన్ సరఫరా అయ్యే విధంగా   'ఆమ్లెక్స్ను అభివృద్ధి చేశారు. రోగి ఊపిరి వదిలినప్పుడు ఆక్సిజన్ సరఫరాను 'ఆమ్లెక్స్ నిలిపివేస్తుంది. దీనితో ఆక్సిజన్ ఆదా అవుతుంది. 

ఇంతవరకుఊపిరిని వదులుతున్న సమయంలో రోగి సిలిండర్ / పైపులోని ఆక్సిజన్‌ను సీఓ2 తోపాటు బయటకి నెట్టివేయడం జరుగుతూ వస్తోంది. దీనివల్ల దీర్ఘకాలంలో ఆక్సిజన్ అనవసరంగా వృధా అవుతుంది. ఇంతేకాకుండా ఊపిరి పీల్చడంఊపిరి వదలడం మధ్య ఉండే వ్యవధిలో మాస్క్ ద్వారా కొంత ఆక్సిజన్ బయటకు వచ్చి గాలిలో కలిసి పోతుంది. అంతరాయం లేకుండా రోగికి ఆక్సిజన్ ను అందించడానికి చేసే ప్రయత్నాల వల్ల ఇది చోటుచేసుకుంటున్నది.  అయితేఐఐటీ రోపర్ రూపకల్పన చేసిన  ఈ పరికరం వృధాను అరికట్టడానికి సహకరిస్తుంది. 

తాము అభివృద్ధి చేసిన పరికరం పోర్టబుల్ విద్యుత్ సరఫరా (బ్యాటరీ) తో పాటు లైన్ సరఫరా (220 వి -50 హెర్ట్జ్) రెండింటిలోనూ పని చేస్తుందని ఐఐటీ రోపర్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాజీవ్ అహుజా చెప్పారు.

 ఐఐటీ రోపర్ బయోమెడికల్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆశిష్ సహాని మార్గదర్శకత్వంలో పిహెచ్‌డి విద్యార్థులు - మోహిత్ కుమార్రవీందర్ కుమార్ మరియు అమన్‌ప్రీత్ చందర్ అభివృద్ధి చేశారు.

ఆక్సిజన్ సిలిండర్ల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన 'ఆమ్లెక్స్'  ను ఆక్సిజన్ సరఫరా లైన్ మరియు రోగి ధరించే మాస్క్ మధ్య సులభంగా అమర్చడానికి వీలుంటుంది. దీనికి అమర్చిన సెన్సార్‌ అన్ని వేళల్లో రోగి ఎప్పుడు ఊపిరి పీలుస్తున్నాడు ఎప్పుడు ఊపిరి వదులుతున్నాడు అన్న అంశాన్ని నిర్ధారించి తెలియజేస్తుందని డాక్టర్ సహాని అన్నారు.  గాలి పోవడానికి ఉపకరించే అన్ని మాస్కులకు తాము అభివృద్ధి చేసిన పరికరాన్ని తగిలించి ఉపయోగించవచ్చునని ఆయన వివరించారు.  

 

ఆవిష్కరణ ను అభినందించిన లూధియానాలోని దయానంద్ మెడికల్ కాలేజీలో పరిశోధన మరియు అభివృద్ధి డైరెక్టర్ డాక్టర్ జిఎస్ వాండర్ ప్రస్తుత సమయంలో ఆక్సిజన్ ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ గుర్తించి దానిని సమర్ధవంతంగా ఉపయోగించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు.   అనేక ఆసుపత్రులు తమ ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతుంది ప్పటికీ,  చిన్న గ్రామీణ మరియు సెమీ అర్బన్ ఆరోగ్య కేంద్రాల్లో  ఆక్సిజన్ వాడకాన్ని నియంత్రించడానికి ఇటువంటి  పరికరం సహాయపడుతుందని ఆయన అన్నారు.

కోవిడ్ -19 ను ఎదుర్కోవడానికి దేశానికి ఇప్పుడు వేగవంతమైన సురక్షితమైన పరిష్కారాలు అవసరం అని ప్రొఫెసర్ రాజీవ్ అరోరా మాట్లాడుతూ అన్నారు. వైరస్ తొలుత  ఊపిరితిత్తులను ఆ  తరువాత రోగి  శ్వాస వ్యవస్థను ప్రభావితం చేస్తుందని అన్నారు. అయితే, ఈ పరికరానికి పేటెంట్ తీసుకోవాలన్న ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు.  దేశ ప్రయోజనాల కోసం దీనిని భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడానికి ముందుకు వచ్చే సంస్థలకు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉచితంగా అందించడానికి ఐఐటీ సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. 

 

***


(Release ID: 1737215) Visitor Counter : 236