వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

భారత్ అధ్యక్షతన 2021 జూలై 12-14 తేదీల్లో సమావేశమైన బ్రిక్స్ దేశాల ఆర్థిక,వాణిజ్య వ్యవహారాల గ్రూప్ (సిజిఇటిఐ)

Posted On: 20 JUL 2021 10:49AM by PIB Hyderabad

బ్రిక్స్ (బ్రెజిల్రష్యాఇండియాచైనా ,దక్షిణాఫ్రికా)  2021 సంవత్సరంలో  భారతదేశం అధ్యక్షత పనిచేస్తున్నది. బ్రిక్స్ లో వివిధ అంశాలపై వివిధ గ్రూపులు పనిచేస్తున్నాయి. వీటిలో ఆర్థిక, వాణిజ్య  అంశాలకు సంబందించిన వ్యవహారాలను కాంటాక్ట్ గ్రూప్ ఆన్ ఎకనామిక్  అండ్ ట్రేడ్ ఇష్యూస్(సిజిఇటిఐ) పర్యవేక్షిస్తోంది. బ్రిక్స్ సిజిఇటిఐ కి వాణిజ్య శాఖ జాతీయ సమన్వయకర్తగా  వ్యవహరిస్తున్నది. 

2021 జూలై 12 నుంచి 14 వరకు  సిజిఇటిఐ సమావేశాలు జరిగాయి. బ్రిక్స్ దేశాల మధ్య సహకారం, వాణిజ్య అంశాలకు సంబంధించి భారతదేశం ప్రతిపాదించిన ఈ క్రింది అంశాలను సభ్య దేశాలు చర్చించాయి.  

*  బహుపాక్షిక వాణిజ్య వ్యవస్థపై బ్రిక్స్ సహకారం

* ఈ -కామర్స్ వ్య్వవస్థలో వినియోగదారుల ప్రయోజనాలను రక్షించడానికి బ్రిక్స్ ప్రణాళిక 

 ఎస్పీఎస్  / టీబీటీ అంశాల పరిష్కారానికి ఎన్ టీఎమ్  వ్యవస్థకు రూపకల్పన 

* శానిటరీ మరియు ఫైటోసానిటరీ (ఎస్పీఎస్) వ్యవస్థ ఏర్పాటు 

* జన్యు వనరులుసాంప్రదాయ విజ్ఞానం మరియు సాంప్రదాయ సాంస్కృతిక అంశాల పరిరక్షణకు బ్రిక్స్ దేశాల మధ్య సహకారం 

* నైపుణ్య సేవలపై సహకారానికి వ్యవస్థకు రూపకల్పన 

 ప్రతిపాదనలను పరిశీలించిన బ్రిక్స్ దేశాలువీటికి 2021 సెప్టెంబర్ మూడవ తేదీన జరగనున్న బ్రిక్స్ వాణిజ్య మంత్రుల సమావేశాల్లోగా తుది రూపం ఇవ్వాలని నిర్ణయించాయి. ఈ సమావేశానికి కేంద్ర వాణిజ్య,పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్ అధ్యక్షత వహిస్తారు. 

బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్య ఆర్థిక సంబంధాలను మరింత పటిష్టం చేయడానికి ఈ కింది కార్యక్రమాలను నిర్వహించాలన్న భారతదేశ ప్రతిపాదనను సభ్య దేశాలు ఆమోదించాయి. 

ఎ ) కొనుగోలుదారులు  మరియు అమ్మకందారుల మధ్య వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో 2021 ఆగస్టు 20 నుంచి18 వరకు  బ్రిక్స్ ట్రేడ్ ఫెయిర్  

బి )   సూక్ష్మచిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో  2021 జూలై 22 న బ్రిక్స్  సూక్ష్మచిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల రౌండ్ టేబుల్ సమావేశం 

సి ) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో  సర్వీస్ ట్రేడ్ స్టాటిస్టిక్స్ పై 16 జూలై 2021 మరియు 13 ఆగస్టు 2021 న రెండు వర్క్‌షాప్‌ల నిర్వహణ

 

***



(Release ID: 1737123) Visitor Counter : 258