నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ

స్కిల్ ఇండియా మిషన్ కింద శిక్షణ

Posted On: 19 JUL 2021 4:37PM by PIB Hyderabad

స్కిల్ ఇండియా మిషన్లోభాగంగా పాన్ ఇండియా ప్రాతిపదికన వివిధ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడానికి భారత ప్రభుత్వం 20 కేంద్ర మంత్రిత్వశాఖలు, 40కిపైగా వివిధ విభాగాల్లో నైపుణ్యాభివృద్ధి పథకాలను, కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఈ శిక్షణ కార్యక్రమాల్లో ఇప్పటిదాకా 556.1 లక్షల మందికి శిక్షణ ఇచ్చారు.  స్కిల్ ఇండియా మిషన్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపక మంత్రిత్వశాఖ అమలు చేస్తున్న వివిధ రకాల పథకాల కింద శిక్షణ పొందిన వ్యక్తుల సంఖ్య క్రింది విధంగా ఉంది.పథకం..          అందుబాటులో ఉన్న డేటా ప్రకారం 2015-16 నుండి ఇప్పటి వరకు శిక్షణ పొందిన వ్యక్తులు[లక్షల్లో సంఖ్య)

ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన (పిఎంకెవివై)1.0 మరియు 2.0

126.82

నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎస్‌డిసి) ఫీజు ఆధారిత శిక్షణ

117.39

నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్ (నాప్స్)

10.73

జన్ శిక్షణ్ సంస్థ (జెఎస్ఎస్)

15.10

పారిశ్రామిక శిక్షణా సంస్థలు (ఐటిఐలు)రాష్ట్ర ప్రభుత్వం మరియు ప్రైవేట్ ఐటిఐల ద్వారా దీర్ఘకాలిక శిక్షణ]

64.01

మొత్తం

334.1

 
గత రెండేళ్లలో 10,49,621 మంది అభ్యర్థులకు పిఎంకెవివై, ఎన్‌ఎపిఎస్‌ల కింద ఉపాధి కల్పించగా, జెఎస్‌ఎస్ ఎటువంటి తప్పనిసరి ఉపాధి అందించలేదు. అదేవిధంగా.. ఐటిఐల నుండి ఉత్తీర్ణులయ్యే విద్యార్థుల ఉపాధిని మంత్రిత్వ శాఖ పర్యవేక్షించదు.

                   
దేశంలో ఉపాధి అవకాశాలను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. గణనీయమైన పెట్టుబడులతో కూడిన వివిధ ప్రాజెక్టులను ప్రోత్సహించడం, ప్రధానమంత్రి ఉపాధి కల్పనా కార్యక్రమం(పీఎంఈజీపీ), పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన(డీడీయూ–జీకేవై, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్ఆర్ఈజీఎస్),  దీన్దయాళ్ అంత్యోదయ యోజన–జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్(డీఏవై–ఎన్యూఎల్ఎమ్) వంటి పథకాలను అమలు  సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వశాఖ, గ్రామీణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖలు పథకాల అమలుపై చేస్తున్న వ్యవయాన్ని పెంచుతున్నాయి. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 2.0 కింద రోజ్గార్ మేళా, యువ సంపర్క్, ఆత్మ నిర్భర్ స్కిల్డ్ ఎంప్లాయిస్ ఎంప్లాయర్ మ్యాపింగ్(ఎఎస్ఇఇఎం) పోర్టల్ వంటివి కార్యక్రమాలను వివిధ పరిశ్రమల సహకారంతో నిర్వహిస్తూ శిక్షణ ఇవ్వడమే కాకుండా నియమకాలు జరిగేలా ప్రభుత్వం చొరవ తీసుకుంటోంది. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 3.0 కింద ఎస్టీటీ ధ్రువీకరించిన అభ్యర్థులకు వేతన ఉపాధి, స్వయం ఉపాధి, అప్రెంటిస్షిప్ సదుపాయం కల్పిస్తున్నారు.  స్వయం ఉపాధి కల్పనలో సహాయసహకారాలు అందించడానికి ప్రధానమంత్రి కౌశల్ కేంద్రాలు నోడల్ సెంటర్లుగా వ్యవహరిస్తున్నాయి. అభ్యర్థుల నియామకం కోసం డీఎస్సీ, ఎస్ఎస్డీఎంతో శిక్షణ భాగస్వామి సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా అదనంగా  టిపి / డిఎస్‌సి / ఎస్‌ఎస్‌డిఎంలు / ఎస్‌ఎస్‌సిలు  క్రమం తప్పకుండా జిల్లా, ప్రాంతీయ స్థాయిలో ఉద్యోగ మేళాలు నిర్వహించడం ద్వారా నియామకాలు, అప్రెంటిస్షిప్లు చేపడతాయి. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద ధ్రువీకరించబడిన అభ్యర్థులంతా అర్హతకు అనువైన ఉద్యోగ అవకాశాలు ఎక్కడున్నాయో తెలుసుకునేందుకు  ఉద్యోగ అవకాశాలను ఆత్మ నిర్భర్ స్కిల్డ్ ఎంప్లాయిస్ ఎంప్లాయర్ మ్యాపింగ్ (ఏఎస్ఈఈఎం) పోర్టల్తో అనుసంధానించబడతారు.


కేంద్ర నైపుణ్య అభివృద్ధి, వ్యవస్థాపక శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ లోక్‌సభకు సోమవారం లిఖితపూర్వకంగా ఈ సమాచారం ఇచ్చారు.  

 

***

 (Release ID: 1736987) Visitor Counter : 37