రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
ప్లాస్టిక్ వ్యర్థాలతో రహదారుల నిర్మాణం
Posted On:
19 JUL 2021 4:00PM by PIB Hyderabad
జాతీయ రహదారుల పేవ్‌మెంట్ల కాలానుగుణ మరమ్మతులలో ప్లాస్టిక్ వ్యర్థాలను తప్పనిసరిగా ఉపయోగించాలని, 5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న పట్టణ ప్రాంతాలకు 50 కిలోమీటర్ల పరిధిలో నిర్మించే సర్వీస్ రోడ్లలోనూ ఉపయోగించాలని మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. వేడి తారు మిశ్రమాల్లో ప్లాస్టిక్ వ్యర్థాల వినియోగంపై ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ (ఐఆర్‌సీ) మార్గదర్శకాలు రూపొందించింది. ఇప్పటివరకు, దేశంలో 703 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారుల నిర్మాణంలో ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించారు. నిర్మాణ ముడి పదార్థాలు, యంత్రాలు, సిబ్బంది వంటి అన్ని వనరులను పరిగణనలోకి తీసుకుని ప్రాజెక్టుల వ్యయాన్ని అంచనా వేస్తారు.
కేంద్ర రహదారి రవాణా, హైవేల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఈ సమాచారాన్ని లిఖితపూర్వక సమాధానంగా ఇవాళ రాజ్యసభకు సమర్పించారు.
***
(Release ID: 1736981)
Visitor Counter : 151