యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
క్రీడాకారులను ప్రోత్సహించి, క్రీడా రంగాన్నిచేయడానికి క్షేత్రస్థాయిలో 'ఖేలో ఇండియా' కేంద్రాల ఏర్పాటు : శ్రీ అనురాగ్ ఠాకూర్
Posted On:
19 JUL 2021 4:50PM by PIB Hyderabad
దేశంలో క్రీడారంగాన్ని ప్రోత్సహించి వర్ధమాన క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర యువజన వ్యవహారాల, క్రీడా మంత్రి శ్రీ అనురాగ్ ఠాకురిన్ తెలిపారు. క్రీడారంగ అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యలను ఈ రోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో వివరించారు. క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. వర్ధమాన క్రీడాకారులకు తక్కువ ఖర్చుతో, సమర్ధవంతమైన శిక్షణ ఇవ్వడానికి గతంలో ఛాంపియన్లుగా నిలిచిన క్రీడాకారులు కోచ్‌లుగా వర్ధమాన క్రీడాకారులకు శిక్షణ ఇస్తారు. దీనివల్ల గత ఛాంపియన్లకు జీవనోపాధి కల్పించడంతోపాటు వారి అనుభవాన్ని ఉపయోగించి క్షేత్ర స్థాయిలో క్రీడాకారులను తయారు చేయడానికి అవకాశం కలుగుతుంది. దీనికోసం దేశవ్యాపితంగా ఖేలో ఇండియా కేంద్రాలను ప్రారంభించడం జరుగుతుంది. కోచ్ గా వ్యవహరించే పూర్వ ఛాంపియన్లకు వేతనం, సహాయ సిబ్బంది, పరికరాల కొనుగోలు, పోటీలలో పాల్గోవడానికి అయ్యే ఖర్చును ఈ క్రాండానికి గ్రాంటుగా మంజూరు అవుతుంది. దేశంలోని 26 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 360 ఖేలో ఇండియా కేంద్రాలను ప్రారంభించడం జరుగుతుందని మంత్రి తెలిపారు.
ఈ కేంద్రాల్లో ఇంకా క్రీడాకారులను ఎంపిక చేయలేదు. ఒకో కేంద్రానికి సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి, పరికరాలను కొనుగోలు చేసి, మైదానాలను సిద్ధం చేయడానికి నాన్ -రికరింగ్ గ్రాంటుగా అయిదు లక్షల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసిందని తన సమాధానంలో క్రీడలశాఖ మంత్రి వివరించారు. క్రీడాపరికరాల కొనుగోలు, వేతనాలు, ఇతర ఖర్చుల కింద ప్రతి కేంద్రానికి ఏడాదికి అయిదు లక్షల రూపాయల చొప్పున నాలుగు సంవత్సరాల పాటు విడుదల చేస్తామని మంత్రి తెలిపారు.
(Release ID: 1736975)
Visitor Counter : 167