సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

ఎంఎస్‌ఎంఈల సామర్థ్యం విస్తరణ, వృద్ధి

Posted On: 19 JUL 2021 4:32PM by PIB Hyderabad

అభివృద్ధికి అవకాశం ఉండి, పెద్ద యూనిట్లుగా మారే సామర్థ్యం ఉన్న ఉన్న ఎంఎస్‌ఎంఈలలో, వాటాల కొనుగోలు రూపంలో రూ.50 వేల కోట్లను పెట్టుబడులుగా పెట్టడానికి "భారత స్వావలంబన నిధి" (ఎస్‌ఆర్‌ఐ) పేరిట కేంద్ర ప్రభుత్వం ఒక నిధిని ప్రకటించింది. ఈ పథకం కింద ప్రకటించిన మొత్తం రూ.50 వేల కోట్లలో కేంద్ర ప్రభుత్వం రూ.10 వేల కోట్లను సమకూరుస్తుంది. మిగిలిన రూ.40 వేల కోట్లు ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ ఫండ్లు తీసుకొస్తాయి. ఈ ఆర్థిక మొత్తంపై మార్గదర్శకాలు కూడా జారీ అయ్యాయి. ఎంఎస్‌ఎంఈ రంగంలో అర్హతగల యూనిట్లకు అభివృద్ధి మూలధనాన్ని అందించడమే ఈ చర్య లక్ష్యం.

    కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ నారాయణ్‌ రాణే ఈ సమాచారాన్ని లిఖితపూర్వక సమాధానంగా ఇవాళ రాజ్యసభకు సమర్పించారు.
 

*****



(Release ID: 1736974) Visitor Counter : 167