ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

దేశవ్యాప్తంగా 40.64 కోట్లు దాటిన టీకా డోసుల పంపిణీ


కోలుకున్నవారి శాతం 97.32% కు పెరుగుదల

గత 24 గంటల్లో 38,164 కొత్త కోవిడ్ కేసులు

ప్రస్తుతం చికిత్సలో ఉన్న కేసులు 4,21,665, మొత్తం కేసుల్లో 1.35%
రోజువారీ పాజిటివిటీ 2.61%; 28 రోజులుగా 3% లోపే

Posted On: 19 JUL 2021 10:13AM by PIB Hyderabad

భారతదేశమంతటా ఇప్పటిదాకా ఇచ్చిన కోవిడ్ టీకా డోసుల సంఖ్య 40.64 కోట్లు దాటింది.  50,69,232 శిబిరాల ద్వారా మొత్తం  40,64,81,493 టీకా డోసుల పంపిణీ పూర్తయినట్టు ఈ ఉదయం 7 గంటలకు అందిన సమాచారం సూచిస్తోంది. గత 24 గంటలలో  13,63,123 టీకాలిచ్చారు.  ఆ వివరాలు ఇలా ఉన్నాయి: 

 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

1,02,69,922

రెండో డోస్

75,52,270

కోవిడ్ యోధులు

మొదటి డోస్

1,77,95,125

రెండో డోస్

1,03,66,268

18-44 వయోవర్గం

మొదటి డోస్

12,50,80,488

రెండో డోస్

49,07,782

45-59 వయోవర్గం

మొదటి డోస్

9,76,43,768

రెండో డోస్

2,93,47,090

60 ఏళ్ళు పైబడ్డవారు

మొదటి డోస్

7,21,55,133

రెండో డోస్

3,13,63,647

మొత్తం

40,64,81,493

 

సార్వత్రిక టీకాల కార్యక్రమం కొత్తదశ జూన్ 21న ప్రారంభమైంది. టీకాల పరిధిని విస్తరించి దేశవ్యాప్తంగా  వేగంగా అమలు   చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతోంది.

కరోనా సంక్షోభం మొదలైనప్పటినుంచి ఇప్పటిదాకా 3,03,08,456 మంది కోలుకున్నారు. గత 24 గంటలలో 38,660 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకూ కోలుకున్నవారి శాతం  97.32% అయింది.

 

గత 24 గంటలలో దేశవ్యాప్తంగా  38,164 కొత్త కేసులు నమోదయ్యాయి. 22 రోజులుగా కొత్త కేసులు 50 వేల లోపే ఉంటున్నాయి. కేంద్ర, రాష్ట ప్రభుత్వాల ఉమ్మడి కృషి ఫలితంగానే ఈ ధోరణి నమోదవుతోంది.

చికిత్సలో ఉన్న కేసుల తగ్గుదల కూడా కనబడుతోంది. ప్రస్తుత దేశవ్యాప్తంగా చికిత్సలో ఉన్నవారు 4,21,665 మంది.

చికిత్సలో ఉన్న కేసులు మొత్తం పాజిటివ్ కేసులలో 1.35% మాత్రమే.

 

కోవిడ్ నిర్థారణ పరీక్షల సామర్థ్యం దేశవ్యాప్తంగా పెంచటంతో గత 24 గంటల్లో 14,63,593 పరీక్షలు జరపగా ఇప్పటిదాకా చేసిన మొత్తం పరీక్షలు 44.54 కోట్లకు పైగా (44,54,22,256) అయ్యాయి.

 

ఒక వైపు పరీక్షలు పెరుగుతూ ఉండగా మరోవైపు పాజిటివిటీ  తగ్గుతూ వస్తోంది. వారపు పాజిటివిటీ ప్రస్తుతం  2.08% కాగా రోజువారీ పాజిటివిటీ  2.61%  అయింది. వరుసగా 28 రోజులుగా ఇది 3% లోపు,  42 రోజులుగా 5% లోపే ఉంటోంది

***

 


(Release ID: 1736724) Visitor Counter : 186