ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 కల్పనలు- వాస్తవాలు
కోవిడ్ -19 పాజిటివ్ పెషెంట్‌లు అందరికీ క్షయ వ్యాధి (టిబి) నిర్ధారణ పరీక్షకు సిఫార్సు చేసిన కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ.
టిబి నిర్ధారణ అయిన అందరికీ కోవిడ్ -19 పరీక్షల నిర్వహణకు సిఫార్సు.
టిబి- కోవిడ్, టిబి-ఐఎల్ై,ఎస్.ఎ.ఆర్.ఐ
టిబి కేసులు పెరగడానికి, కోవిడ్ -19 కు సంబంధం ఉ న్నట్టు చూపే ఆధారాలు ఏవీ లేవు
Posted On:
17 JUL 2021 4:13PM by PIB Hyderabad
ఇటీవల కోవిడ్ -19 ఇన్‌ఫెక్షన్‌కు గురైన వారిలో క్షయవ్యాధి లక్షణాలు ఉ న్నట్టుండిపెరిగాయని, రోజుకు ఇలాంటి కేసులు డజను వరకు వస్తుండడంతో డాక్టర్లు ఆందోళన చెందుతన్నారంటూ కొన్ని మీడియా కథనాలు ప్రచారంలో ఉ న్నాయి.
ఇందుకు సంబంధించి ప్రభుత్వం వివరణ ఇచ్చింది. కోవిడ్ పాజిటివ్ పేషెంట్లు అందరికీ టిబి నిర్ధారణ పరీక్ష, అలాగే టిబి నిర్ధారణ అయిన అందరకి కోవిడ్ -19 పరీక్ష నిర్వహించాలని సిఫార్సుచేసినట్టు కేంద్ర ఆరోగ్యకుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ తెలిపింది. టిబి, కోవిడ్ -19 పై మరింత నిఘాపెట్టేందుకు సమ్మిళిత కృషిని ఆగస్టు2020లోగా చేపట్టాల్సిందిగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ కోరింది.
దీనికితోడు, టిబి-కోవిడ్ , టిబి-ఐఎల్ ఐ- ఎస్ఎఆర్ ఐ నిర్ధారణకు సంబంధించి బహుముఖ విధానం ఉండాలని కేంద్ర ఆరోగ్య ,కుటుంబ సంక్షేమ మంత్రిత్వశౄఖ పలు సూచనలు మార్గదర్శకాలు జారీ చేసింది. దీనిని రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలు అమలు చేస్తున్నాయి.
కోవిడ్ -19 సంబంధిత ఆంక్షల కారణంగా , టిబి కేసుల నోటిఫికేషన్ 2020లో 25 శాతం తగ్గిపోయింది.అయితే దీని ప్రభావాన్ని తగ్గించేందుకు ఒపిడిసెట్టింగ్‌లలో, అలాగే కమ్యూనిటీలలో కేసుల నిర్ధారణకు సంబంధించి అన్ని రాష్ట్రాలు ప్రత్యేక చర్యలు చేపట్టాయి.
ఇదికాక, కోవిడ్ -19 కారణంగా టిబి కేసులు పెరిగినట్టు గాని లేదా కేసులను కనుగొనేందుకుచేసిన కృషివల్ల టిబి కేసుల సంఖ్య పెరిగినట్టు సూచించే ఆధారాలు ఏవీ లేవు.
టిబి, కోవిడ్ -19 మరణాలకు సంబంధించి వాస్తవాల ఆధారంగా వాటిని తెలియజేయవలసి ఉంది. ఈ రెండూ అంటువ్యాధులే.ఇవి ప్రధానంగా ఊపిరితిత్తులపై దాడి చేస్తాయి. దగ్గు జ్వరం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు వంటివి రెండింటిలో ఉన్నప్పటికీ, టిబి లో ఇంక్యుబేషన్‌కాలం ఎక్కువ అలాగే వ్యాధి వ్యాప్తి నెమ్మదిగా ఉంటుంది.
దీనికితొడు,టిబి బాసిలి మానవ శరీరంలో నిద్రాణ స్థితిలో ఉండవచ్చు. ఏదైనా కారణం వల్ల ఆ వ్యక్తి రోగ నిరోధక శక్తి తగ్గినపుడు అది విజృంభించడానికి ప్రయత్నిస్తుంది. కోవిడ్ అనంతర స్థితికి కూడా ఇది వర్తిస్తుంది. ఏవరైనా వ్యక్తికి వైరస్ వల్ల గాని లేక చికిత్సవల్ల ప్రత్యేకించి రోగనిరోధక శక్తిని అణిచిపెట్టే స్టెరాయిడ్ల వంటి వాటివల్ల కాని ఎవరికైనా రోగనిరోధక శక్తి తగ్గవచ్చు.
ఎస్ఎఆర్ఎస్-సిఒవి-2 ఇన్‌ఫెక్షన్ ఎవరైనా వ్యక్తి ని క్రియాశీల టిబి వ్యాధి బారిన పడేలా చేయవచ్చు. ఎందుకంటే టిబిఅనేది బ్లాక్ ఫంగస్‌లా అదనుకోసం వేచిచూసే ఇన్‌ఫెక్షన్ వంటిది.
***
(Release ID: 1736526)
Visitor Counter : 190