ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

దేశవ్యాప్తంగా 40 కోట్లకు చేరువైన టీకా డోసుల పంపిణీ


కోలుకున్నవారి శాతం 97.31% కు పెరుగుదల
గత 24 గంటల్లో 38,079 కొత్త కోవిడ్ కేసులు

ప్రస్తుతం చికిత్సలో ఉన్న కేసులు 4,24,025, మొత్తం కేసుల్లో 1.36%
రోజువారీ పాజిటివిటీ 1.91%; 26 రోజులుగా 3% లోపే

Posted On: 17 JUL 2021 10:48AM by PIB Hyderabad

భారతదేశమంతటా ఇప్పటిదాకా ఇచ్చిన కోవిడ్ టీకా డోసుల సంఖ్య 40 కోట్ల మైలురాయికి దగ్గరవుతోంది. 50,09,914 శిబిరాల ద్వారా మొత్తం  39,96,95,879 టీకా డోసుల పంపిణీ పూర్తయినట్టు ఈ ఉదయం 7 గంటలకు అందిన సమాచారం సూచిస్తోంది. గత 24 గంటలలో 42,12,557 టీకాలిచ్చారు.  ఆ వివరాలు ఇలా ఉన్నాయి: 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

1,02,66,074

రెండో డోస్

75,14,892

కోవిడ్ యోధులు

మొదటి డోస్

1,77,79,913

రెండో డోస్

1,02,62,953

18-44 వయోవర్గం

మొదటి డోస్

12,18,20,703

రెండో డోస్

46,11,997

45-59 వయోవర్గం

మొదటి డోస్

9,69,30,030

రెండో డోస్

2,79,89,513

60 ఏళ్ళు పైబడ్డవారు

మొదటి డోస్

7,18,68,506

రెండో డోస్

3,06,51,298

మొత్తం

39,96,95,879

 

సార్వత్రిక టీకాల కార్యక్రమం కొత్తదశ జూన్ 21న ప్రారంభమైంది. టీకాల పరిధిని విస్తరించి దేశవ్యాప్తంగా  వేగంగా అమలు   చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతోంది.

కరోనా సంక్షోభం మొదలైనప్పటినుంచి ఇప్పటిదాకా 3,02,27,792 మంది కోలుకున్నారు. గత 24 గంటలలో 43,916 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకూ కోలుకున్నవారి శాతం  97.31% అయంది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001C2N9.jpg

గత 24 గంటలలో దేశవ్యాప్తంగా  38,079 కొత్త కేసులు నమోదయ్యాయి. 20 రోజులుగా కొత్త కేసులు 50 వేల లోపే ఉంటున్నాయి. కేంద్ర, రాష్ట ప్రభుత్వాల ఉమ్మడి కృషి ఫలితంగానే ఈ ధోరణి నమోదవుతోంది.

 https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002KLP0.jpg

చికిత్సలో ఉన్న కేసుల తగ్గుదల కూడా కనబడుతోంది. ప్రస్తుత దేశవ్యాప్తంగా చికిత్సలో ఉన్నవారు 4,24,025 మంది.

చికిత్సలో ఉన్న కేసులు మొత్తం పాజిటివ్ కేసులలో 1.36% మాత్రమే.

 https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003A1A1.jpg

కోవిడ్ నిర్థారణ పరీక్షల సామర్థ్యం దేశవ్యాప్తంగా పెంచటంతో గత 24 గంటల్లో 19,98,715 పరీక్షలు జరపగా ఇప్పటిదాకా చేసిన మొత్తం పరీక్షలు 44.20 కోట్లకు పైగా (44,20,21,954) అయ్యాయి.

 https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004ZNXE.jpg

ఒక వైపు పరీక్షలు పెరుగుతూ ఉండగా మరోవైపు పాజిటివిటీ  తగ్గుతూ వస్తోంది. వారపు పాజిటివిటీ ప్రస్తుతం  2.21% కాగా రోజువారీ పాజిటివిటీ  2.10%  అయింది. వరుసగా 26 రోజులుగా ఇది 3% లోపు,  40 రోజులుగా 5% లోపే ఉంటోంది

 

 ****


(Release ID: 1736397)