మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ

దేశవ్యాప్తంగా పోలీసు సిబ్బంది కి లింగ సున్నితత్వం పై శిక్షణా కార్యక్రమం కోసం బి.పి.ఆర్. & డి. తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న - జాతీయ మహిళా కమీషన్

Posted On: 16 JUL 2021 5:08PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా పోలీసు సిబ్బంది కి లింగ సున్నితత్వం పై శిక్షణా కార్యక్రమం కోసం బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (బి.పి.ఆర్. & డి)తో, జాతీయ మహిళా కమీషన్, అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఢిల్లీ, మహిపాల్ పూర్ లోని, బి.పి.ఆర్. & డి. ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన, ఈ కార్యక్రమాన్ని, ఎన్‌.సి.డబ్ల్యు., చైర్‌ పర్సన్ శ్రీమతి రేఖా శర్మ; బి.పి.ఆర్. & డి., డైరెక్టర్ జనరల్, శ్రీ వి.ఎస్.కె. కౌముది;  ఎ.డి.జి., శ్రీ నీరజ్ సిన్హా; శిక్షణా విభాగం డి.ఐ.జి., వందన సక్సేనా, ప్రారంభించారు. జాతీయ మహిళా కమిషన్ సభ్యులు, అధికారుల సమక్షంలో, ఈ రెండు సంస్థల మధ్య అవగాహన ఒప్పందం పై సంతకాలు జరిగాయి. 

మహిళలకు సంబంధించిన చట్టాలు, విధానాలకు సంబంధించి పోలీసు సిబ్బంది లింగ సున్నితత్వాన్ని నిర్ధారించడంతో పాటు, మహిళలపై నేరాలతో వ్యవహరించేటప్పుడు, పోలీసు అధికారులలో వైఖరి, ప్రవర్తనలో మార్పులను తీసుకురావడం, ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం.  పోలీసులపై మహిళా ఫిర్యాదుదారుల నమ్మకాన్ని పెంపొందించే లక్ష్యాన్ని సాధించడానికి జాతీయ మహిళా కమిషన్ ఇప్పటికే, పోలీసు అధికారుల కోసం లింగ సున్నితత్వ కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తోంది.  ఈ లక్ష్యంతోనే, లింగ సంబంధిత సమస్యలపై అధికారులను సున్నితం చేయడానికి, వారి విధులను సమర్థవంతంగా నిర్వహించడానికి, వారికి అధికారం ఇవ్వడానికి,  ముఖ్యంగా లింగ ఆధారిత నేరాల కేసుల్లో దురభిమానం, పక్షపాతం లేకుండా చూసేందుకు, జాతీయ మహిళా కమిషన్, దేశవ్యాప్తంగా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది.

జాతీయ మహిళా కమిషన్, చైర్‌పర్సన్, శ్రీమతి రేఖా శర్మ మాట్లాడుతూ, అనేక సామాజిక-ఆర్ధిక కారకాల కారణంగా మహిళా బాధితుల పట్ల, పురుష బాధితుల కంటే భిన్నంగా ప్రవర్తించడం జరుగుతోందనీ,  అందువల్ల, మహిళలపై హింస కు సంబంధించిన అన్ని సందర్భాల్లో పోలీసులు, లింగ సున్నితత్వాన్ని పాటించవలసిన అవసరం ఉందనీ, సూచించారు.  "మహిళలపై హింస కేసులను మరింత సమర్థవంతంగా పరిష్కరించడానికి పోలీసు అధికారులలో అవసరమైన నైపుణ్యాలు మరియు వైఖరిని పెంపొందించడానికి, అన్ని స్థాయిలలో పోలీసు సిబ్బందిని సున్నితం చేయడానికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, రాష్ట్ర స్థాయి పోలీసు సంస్థలన్నీ, తగిన కార్యక్రమాలు చేపట్టడం అత్యవసరం,” అని శ్రీమతి శర్మ పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా, బి.పి.ఆర్. & డి., డైరెక్టర్ జనరల్, శ్రీ వి.ఎస్.కె. కౌముది మాట్లాడుతూ, జాతీయ మహిళా కమిషన్ మరియు బి.పి.ఆర్. & డి. మధ్య అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం మహిళల భద్రత పట్ల పోలీసు సిబ్బంది సున్నితత్వం కోసం కొత్త దశల సహకారానికి నాంది పలికిందని పేర్కొన్నారు.   లింగ సమస్యలపై పోలీసు సిబ్బందిని సున్నితం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమ నిర్వహణకు, మహిళా కమిషన్ పూర్తి బాధ్యత వహిస్తుండగా, బి.పి.ఆర్. & డి. తనకు చెందిన యూనిట్లు, ఇతర వాటాదారుల సమన్వయంతో ప్రత్యేక మాడ్యూల్‌ తో సౌకర్యాలు కల్పిస్తోంది.

ఈ శిక్షణ మూడు నుండి ఐదు రోజుల వ్యవధిలో నిర్వహించబడుతుంది. ఆశ్రమ పద్ధతి లో చిన్న ఇంటెన్సివ్ కోర్సుగా ఈ శిక్షణ మొత్తం 18 నుండి 24 గంటల సేపు ఉంటుంది.  ఇది లింగ సమస్యలు, మహిళలకు సంబంధించిన చట్టాలు, ఉత్తమ పద్ధతుల భాగస్వామ్యంతో పాటు అమలు చేసే ఏజెన్సీ ల పాత్ర పై, ఈ శిక్షణ లో  ప్రత్యేక దృష్టి ఉంటుంది.

భారత ప్రభుత్వ మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మహిళల ప్రయోజనాలను పరిరక్షించి, ప్రోత్సహించాలనే లక్ష్యంతో అత్యున్నత జాతీయ స్థాయి సంస్థ గా జాతీయ మహిళా కమిషన్ ఏర్పాటయింది. 

 

 *****



(Release ID: 1736310) Visitor Counter : 260