ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

“ఉమంగ్ యాప్”లో మ్యాప్ సేవలు!

మ్యాప్.మై ఇండియాతో, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్
టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అవగాహనా ఒప్పందం..

సమీపంలోని మండీలు, బ్లడ్ బ్యాంకులు తదితర
సదుపాయాలను యాప్ ద్వారా తెలుసుకునే అవకాశం.

Posted On: 16 JUL 2021 4:38PM by PIB Hyderabad

   ప్రభుత్వ అందించే వివిధ రకాల సేవలను ఆన్ లైన్ ద్వారా అందుబాటులోకి తెచ్చేందుకు, తద్వారా పౌరుల జీవితాలను మరింత సౌకర్యవంతం చేసేందుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఇటీవలి కాలంలో అనేక చర్యలు తీసుకుంది. డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేసే లక్ష్యంతో, ‘ఆత్మనిర్భర భారత్’ నినాదం స్ఫూర్తికి అనుగుణంగా కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ పలు చర్యలు తీసుకుంది. “ఉమంగ్ యాప్ (UMANG App)'' లో అధునాతన డిజిటల్ మ్యాప్ సేవలను పొందుపరిచింది. ఇందుకోసం మ్యాప్ మై ఇండియా అనే డిజిటల్ మ్యాప్ డాటా కంపెనీతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది.

   ఉమంగ్. యాప్.తో మ్యాప్.మై ఇండియా ఏకం కావడంతో దేశపౌరులకు మరిన్ని ప్రయోజనాలు అందుబాటులోకి వచ్చాయి.  పౌరులు తమకు సమీపంలోనే ఉన్న ప్రభుత్వ సదుపాయాలను కనుగొనేందుకు ఇది వీలు కల్పిస్తోంది. మండీలు, బ్లడ్ బ్యాంకులు వంటి సదుపాయాల సమాచారాన్ని పౌరులు కేవలం ఒక బటన్ క్లిక్ తో తెలుసుకునే అవకాశం ఏర్పడింది. ఆయా సదుపాయాలు లభించే వీధి, గ్రామం వంటి వివరాలతో సహా మొత్తం సమాచారం సవివరంగా తెలుసుకునేందుకు మ్యాప్ మై ఇండియా రూపొందించిన మ్యాప్ సేవలు ఉమంగ్ యాప్ ద్వారా ఎంతగానో దోహదపడుతున్నాయి. సదరు సదుపాయాలు, సేవలు ఎంతదూరంలో ఉన్నాయో, ఎలా వెళ్తే అక్కడికి చేరుకోవచ్చో అన్న వివరాలను రికార్డ్ చేసిన వాయిస్ తో వినిపించే ఏర్పాటు చేశారు. దారిలో ట్రాఫిక్ పరిస్థితి, భద్రతకు సంబందించిన అప్రమత్తం చేయడం తదితర అంశాలను కూడా ఇందులో పొందుపరిచారు. ఉమంగ్ యాప్, మ్యాప్.మై ఇండియా మధ్య అనుసంధానం వల్లనే ఇదంతా సాధ్యమైంది.

  ఈ కింద సూచించిన సేవల్లో ఉమంగ్ యాప్ ఇప్పటికే మ్యాప్ సేవలను మ్యాప్.మై ఇండియా సహకారంతో అందిస్తోంది:

  • మేరా రేషన్ – ఉమంగ్ యాప్ ద్వారా వినియోగదారులు ‘తమకు అతి సమీపంలోని చవుక ధరల దుకాణం’ ఉనికిని తెలుసుకోవచ్చు. మ్యాప్.మై ఇండియా పొందుపరిచిన మ్యాపుల ద్వారా ఈ దుకాణాల ఎక్కడెక్కడ ఉన్నాయో సూచికల ద్వారా తెలుసుకునే ఏర్పాటు ఈ యాప్ లో ఉంది.
  • ఈ నామ్ (eNAM) – ఉమంగ్ యాప్ ద్వారా 'నా సమీపంలో మండీ' అనే సేవను వినియోగించుకోవచ్చు. అతిసమీపంలో మండీ ఎక్కడుందో తెలుసుకునేందుకు, వినియోగదారులు అక్కడకు వెళ్లేందుకు మ్యాప్ సూచికలు దోహదపడతాయి.  
  • దామిని - ‘పిడుగుపాటుపై అప్రమత్తత’ ఈ యాప్ వినియోగ దారులకు పిడుగుపాటు సమాచారం తెలిపి వారిని అప్రమత్తం చేసే సదుపాయం దామిని పేరిట అందుబాటులోకి వచ్చింది.  కొన్ని నిమిషాల కిందట పిడుగు ఎక్కడ పడిందో దృశ్య రూపకంగా మ్యాపుల వివరించి అప్రమత్తం చేసే సేవలను ఈ యాప్ లో పొందుపరిచారు.  

యాప్ పౌరులకు అందించే ప్రయోజనాలను మరింతగా విస్తృతం చేసేందుకు కృషి జరుగుతోంది. త్వరలోనే ఈ కింది సేవలు కూడా ఉమంగ్ యాప్ పరిధిలోకి రాబోతున్నాయి.:

  • కార్మిక రాజ్య బీమా సంస్థ (ఇ.ఎస్.ఐ.సి.) - ఇ.ఎస్.ఐ. కేంద్రాలు, ఇ.ఎస్.ఐ. ఆధ్వర్యంలోని ఆసుపత్రులు, డిస్పెన్సరీలు సమీపంలో ఎక్కడెక్కడున్నాయో తెలుసుకునేందుకు ఉమంగ్ యాప్ లోని మ్యాప్ సేవల ద్వారా ఏర్పాట్లు చేస్తారు.
  • ఇండియన్ ఆయిల్ – సమీపంలో ఎక్కడెక్కడ వంట గ్యాస్ అవుట్ లెట్లు, పంపిణీ కేంద్రాలున్నాయో, ఇంధనం నింపే కేంద్రాలు ఎక్కడున్నాయో తెలియజేసే ఏర్పాటు.
  • భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్.హెచ్.ఎ.ఐ.): జాతీయ రహదారులపై ప్రయాణించేటపుడు ఎక్కడెక్కడ టోల్ ప్లాజాలు ఉన్నాయో, టోల్ చార్జీల వివరాలేమిటో ఈ యూప్ ద్వారా ముందే తెలుసుకోవచ్చు.
  • జాతీయ నేర రికార్డుల విభాగం (ఎన్.సి.ఆర్.బి.) నేర రికార్డులకు సంబంధించిన వివరాలను సమీపంలోని పోలీస్ స్టేషన్లకు మ్యాప్ ద్వారా తెలియజేయవచ్చు. 
  • ప్రధానమంత్రి గ్రామ షడక్ యోజన-పి.ఎం.జి.ఎస్.వై. (మేరీ షడక్) పి.ఎం.జి.ఎస్.వై. పథకం కింద నిర్మించిన రహదారులు ఎక్కడెక్కడ దెబ్బతిన్నాయో వినియోగ దారులు తెలుసుకుని, మరమ్మతులకోసం ఫిర్యాదు చేసేందుకు ఈ యాప్ దోహదపడుతుంది. యాప్.లోని మ్యాప్.మై ఇండియా ప్లాట్.ఫాం ఇందుకు ఉపయుక్తంగా ఉంటుంది.  

 

https://ci3.googleusercontent.com/proxy/xfhNKzmWhAbu12NgZNJMLS9IUYMsND8OTYjYXyMfn27nnuF_tV-BxzdI8FvFd5i47ok5Dm8PkkNXlUnjOoeyq81cffz8uEAjqfnd3RP4v0Sn95oANoMmSCkgRg=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002CL6F.jpg

https://ci5.googleusercontent.com/proxy/46waH3j0p2DpthZr_JA3pE7bCLBNe1qZJbQbhOQwWZyk3otUPO1RaI6wIJ1OxW0-ZAU-rFchsJniRr8FgKXy-KJr7nIS4JMv_iVk6JzLIxfJ1Am2r8RSdLw9hA=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003TV34.jpghttps://ci5.googleusercontent.com/proxy/zy3fQ4OLWt_3aGcsVF4m_M9YzlN-S2ismlrtakIxHarbFWZonRaCE1-z3tE5TblzkZNHmmK7Ee4ifHf8T9rQkssKCHeimotu60bIkGqQXXg6O2De=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/4DGMK.jpg

 

ఉమంగ్ (UMANG) యాప్ గురించి:

ఉమంగ్ మొబైల్ యాప్ (యూనిపైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్) అనేది భారత ప్రభుత్వం రూపకల్పన చేసిన వినూత్న సదుపాయం. పలు రకాల ప్రభుత్వ సేవలను అందించేందుకు ఎంతో సురక్షితమైన పద్ధతిలో ఈ యాప్.ను రూపొందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో పనిచేసే వివిధ సంస్థలు అందించే సేవలతో పౌరులను అనుసంధానం చేసే లక్ష్యంతో బహు భాషలతో ఈ యాప్ ను తయారు చేశారు. ఈ ఉమంగ్ యాప్ (UMANG App)ను 2017వ సంవత్సరంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆవిష్కరించారు. పలు రకాలైన ముఖ్యమై ప్రభుత్వ సేవలను ఒకే అనుసంధాన వేదికపై పొందుపరుస్తూ యాప్.ను రూపొందించారు. పౌరుల మొబైల్ ఫోన్లతో ప్రభుత్వం అనుసంధానమై ఉండాలన్న మరింత విస్తృత లక్ష్యంతో ఈ యాప్ తయారైంది. తాజా సమాచారం మేరకు,.. 257 శాఖలకు, 32 రాష్ట్రాలకు సంబంధించిన 1,251 సేవలు, 20,280 యుటిలిటీ బిల్లుల చెల్లింపు సేవలు ప్రస్తుతం ఉమంగ్ యాప్ అందిస్తోంది. మరిన్ని అదనపు సేవలు కూడా త్వరలో ఈ యాప్ ద్వారా అందుబాటులోకి రాబోతున్నాయి. ఆండ్రాయిడ్, ఐ.ఒ.ఎస్., వెబ్, కియోస్ ప్లాట్.ఫాంల ద్వారా ఉమంగ్ మొబైల్ యాప్.ను ఇప్పటికే 3.41కోట్లమంది వినియోగదారులు వినియోగించుకుంటున్నారు. పౌరులు తమ డిజీ లాకర్ ఖాతాలను కూడా ఉమంగ్ ద్వారా అనుసంధానం చేసుకోవచ్చు.  ఉమంగ్ లో పొందుపరిచిన ర్యాపిడ్ అస్సెస్మెంట్ సిస్టమ్ (ఆర్.ఎ.ఎస్.) ద్వారా వినియోగదారులు యాప్.పై తమ అభిప్రాయాలను కూడా తెలియజేయవచ్చు.

 

మ్యాప్.మై ఇండియా గురించి:

   మ్యాప్.మై ఇండియా అనేది స్వదేశీ పరిజ్ఞానంతో ఏర్పాటైన డిజిటల్ మ్యాప్ డాటా కంపెనీ. దేశరాజధాని న్యూఢిల్లీలో 1995లో ఈ కంపెనీని స్థాపించారు. మొత్తం దేశాన్ని డిజిటల్ మ్యాప్ రూపంలో ఈ కంపెనీ రూపొందించింది. వినియోగదారులు తమకు సమీపంలోని ఆవశ్యక ప్రాంతాలను కనుగొనేందుకు, సవివరమైన మ్యాప్ రూపంలో ఆ వివరాలను వీక్షించేందుకు ఈ ఏర్పాటు వీలు కలిగిస్తుంది.

 ఉమంగ్ యాప్ (UMANG App) డౌన్ లోడ్ చేసుకునేందుకు  97183-97183 అనే నంబరుకు మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది. ఈ కింది లింకుల ద్వారా కూడా ఉమంగ్ యాప్ అందుబాటులో ఉంటుంది.:

  1. వెబ్: https://web.umang.gov.in/web/#/
  2. ఆండ్రాయిడ్: https://play.google.com/store/apps/details?id=in.gov.umang.negd.g2c
  3. ఐ.ఒ.ఎస్.: https://apps.apple.com/in/app/umang/id1236448857

 

****



(Release ID: 1736309) Visitor Counter : 277