సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

సిబ్బంది , శిక్ష‌ణ విభాగంలో డిపార్ట‌మెంటల్ వ్య‌యాన్ని 2021 ఏప్రిల్‌- జూన్ త్రైమాసిక కాలానికి 65 శాతం పొదుపు చేసినందుకు డిఒపిటిని అభినందించిన కేంద్ర మంత్రి

డాక్ట‌ర్ జితేంద్ర సింగ్‌. కేంద్ర ఆర్ధిక శాఖ నిర్దేశించిన 20 అన‌వ‌స‌ర వ్య‌యం త‌గ్గింపును మించి ఇది ఉంది.

సోమ‌వారం నుంచి పార్ల‌మెంటు స‌మావేశాలు ప్రారంభం కానున్న నేప‌థ్యంలో, సిబ్బంది, ప్ర‌జా ఫిర్యాదులు, పెన్ష‌న్ మంత్రిత్వ‌శాఖ‌కు సంబంధించి నిర్వ‌హించిన స‌మీక్షా స‌మావేశానికి అధ్య‌క్ష‌త వ‌హించిన మంత్రి

Posted On: 16 JUL 2021 5:16PM by PIB Hyderabad

2020-21 ఏప్రిల్‌- జూన్ త్రైమాసిక కాలానికి సంబంధించి డిపార్ట‌మెంట‌ల్ వ్య‌యంలో 65 శాతం పొదుపు సాధించినందుకు సిబ్బంది  శిక్ష‌ణ విభాగాన్ని కేంద్ర శాస్ట్ర సాంకేతిక శాఖ (స్వ‌తంత్ర‌)స‌హాయ‌మంత్రి , భూ విజ్ఞాన శాస్త్ర స‌హాయ‌మంత్రి (స్వ‌తంత్ర‌), ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం, సిబ్బంది, ప్ర‌జా ఫిర్యాదులు, పెన్ష‌న్‌, అటామిక్ ఎన‌ర్జీ, అంత‌రిక్ష శాఖ‌ల స‌హాయ‌మంత్రి డాక్ట‌ర్ జితేంద్ర‌ప్ర‌సాద్ అభినందించారు.2020 లో ఇదే కాలంతో పోల్చి చూసిన‌పుడు ఆర్ధిక శాఖ‌లోని వ్య‌య‌విభాగం నిర్దేశించిన  20 శాతం అన‌వ‌స‌ర వ్య‌యం త‌గ్గింపు కంటే ఇది ఎక్కువ గా ఉంది.నాలుగు ప‌ద్దుల కింద ఇందులో పొదుపు సాధించారు. విదేశీ ప్ర‌యాణం నూరుశాతం, దేశీయ ప్ర‌యాణం, 60.20 శాతం, ప‌రిపాల‌నాప‌ర‌మైన వ్య‌యం 85.84 శాతం, ప‌బ్లికేషేన్ లో  79.16 శాతం పొదుపు సాధించారు.

 

పార్ల‌మెంటు సమావేశాలు సోమ‌వారం నుంచి ప్రారంభానికి ముందు సిబ్బంది, ఫిర్యాదులు, పెన్ష‌న్ శాఖ మంత్రి డాక్ట‌ర్ జితేంద్ర సింగ్ నిర్వ‌హించిన స‌మ‌గ్ర స‌మీక్షా స‌మావేశంలో , అన‌వ‌స‌ర వ్యయాన్ని త‌గ్గించ‌డంలో డిఒపిటి పాత్ర‌ను ప్ర‌శంసించారు. ఇది ఎంతో ప్రాముఖ్య‌త క‌లిగిన‌ద‌ని అంటూ ఆయ‌న‌, ప‌ర్య‌ట‌న‌లు, ఆహారం, స‌మావేశాల‌పై 20 శాతం వ‌ర‌కు ఖ‌ర్చు త‌గ్గించాల్సిందిగా కేంద్ర ఆర్దిక మంత్రిత్వశాఖ అన్ని మంత్రిత్వ‌శాఖ‌ల‌ను ఆదేశించింద‌ని అన్నారు.

 

అలాగే. ప్ర‌భుత్వంలో నిర్ణ‌యాలుతీసుకోవ‌డంలో స‌మ‌ర్ధ‌త పెంచాల్సిందిగా ప్ర‌ధాన‌మంత్రి శ్రీ  న‌రేంద్ర మోదీ జారీ చేసిన ఆదేశాల మేర‌కు, సిబ్బంది, ప్ర‌జాఫిర్యాదులు, పెన్ష‌న్‌ల‌కు సంబంధించి ఈ మంత్రిత్వ‌శాఖ సాధించిన ప్ర‌గ‌తిని మంత్రి  స‌మీక్షించారు. స‌కాలంలో  ఫైళ్ల ప‌రిష్క‌రానికి ఫైళ్లు స‌మ‌ర్పించే విధానంపై ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్ష నిర్వ‌హించాల‌న్నారు. ఫైళ్లు క‌ద‌ల‌డం కేవ‌లం నాలుగు ద‌శ‌ల‌లకు త‌గ్గించాల‌న్నారు. ఈ ఆఫీస్ వ‌ర్ష‌న్ 7.0,  ఎల‌క్ట్రానిక్ ర‌శీదుల‌ను స‌ర్కులేట్ చేయ‌డానికి కేంద్రీకృత రిజిస్ట్రేష‌న్ యూనిట్‌, డెస్క్ ఆఫీస‌ర్ వ్య‌వ‌స్థ అమ‌లులోకి తేవడం వంటివి చేప‌ట్టాల‌న్నారు.

కోవిడ్‌పై పోరాటం గురించి ప్ర‌స్తావిస్తూ డాక్ట‌ర్ జితేంద్ర సింగ్‌, కేంద్ర ప్ర‌భుత్వానికి సంబంధించి డిఒపిటి ప‌ర‌స‌న‌ల్ మేనేజ్‌మెంట్ కు సంబంధించి నోడ‌ల్ డిపార్ట‌మెంట్‌గా ఉంద‌ని, మొద‌టి, రెండో వేవ్ స‌మ‌యంలో  కోవిడ్ వ్యాప్తిని వీలైనంత త‌గ్గించేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు  త‌గిన ఆదేశాలు ఇవ్వ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. బ‌యోమెట్రిక్ హాజ‌రు నుంచి మిన‌హాయింపు, కార్యాల‌యాల‌లో హాజ‌రును నియంత్రించ‌డం, ఆరోగ్య సేతు యాప్ వాడ‌కాన్ని మోబైల్ ఫోన్‌ల‌లో త‌ప్ప‌నిస‌రి చేయ‌డం, ఎపిఎఆర్‌ల‌ను స‌మ‌ర్పించ‌డానిఇక స‌మ‌యాన్ని పొడిగించ‌డం, ఫ్రంట్‌లైన్‌వ‌ర్క‌ర్ల‌కు ఐ జిఒటి లో శిక్ష‌ణ ఇవ్వ‌డం వంటివి కోవిడ్ -19 వ్యాప్తి నిరోధంలో కీల‌క పాత్ర పోషించాయ‌ని ఆయ‌న చెప్పారు.

. సిబ్బంది వ్య‌వ‌హారాల కేంద్ర కార్య‌ద‌ర్శి శ్రీ దీప‌క్ ఖండేక‌ర్‌, మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన ఇత‌ర అధికారులు ఈ స‌మావేశంలో త‌గిన వివ‌రాలు అందిచారు.

***



(Release ID: 1736308) Visitor Counter : 130