మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

కేంద్ర విద్యాశాఖ మంత్రి, కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి సంయుక్తంగా స్కూల్ ఇన్నోవేషన్ అంబాసిడర్ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు


ఉపాధ్యాయులు పరిణామం చెందారు: వారు ప్రతినిధులు మరియు ఆవిష్కరణకు రాయబారులు - కేంద్ర విద్యాశాఖ మంత్రి

స్కూల్ ఇన్నోవేషన్ అంబాసిడర్ ట్రైనింగ్ ప్రోగ్రాం గిరిజన ప్రాంతాల్లోని పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడానికి సహాయపడుతుంది - శ్రీ అర్జున్ ముండా

Posted On: 16 JUL 2021 2:43PM by PIB Hyderabad

కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, గిరిజన వ్యవహారాల మంత్రి శ్రీ అర్జున్ ముండా సంయుక్తంగా 50 వేల మంది పాఠశాల ఉపాధ్యాయుల కోసం "స్కూల్ ఇన్నోవేషన్ అంబాసిడర్ శిక్షణా కార్యక్రమం" ఈ రోజు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంఓఎస్‌ శ్రీమతి అన్నపూర్ణ దేవి; విద్యా మంత్రిత్వ శాఖ, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో పాటు ఎంఓఎస్‌ శ్రీ రాజ్‌కుమార్ రంజన్ సింగ్, ఎంఓఎస్‌ డాక్టర్ సుభాస్ సర్కార్ కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ప్రధాన్ మాట్లాడుతూ " ఉపాధ్యాయులు మన జీవితంలో అతిపెద్ద ప్రభావం చూపుతారు. మన విద్యార్థులను భవిష్యత్తుకు సిద్ధంగా ఉంచడానికి  ఉపాధ్యాయులు, మార్పు-ఏజెంట్లు మరియు ఆవిష్కరణల రాయబారులను తయారు చేయడమే మా లక్ష్యం అని అన్నారు.

సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచాన్ని పునఃరూపకల్పన చేస్తోందని మన విద్యార్థులకు దేశీయంగానే కాకుండా ప్రపంచ సవాళ్లను కూడా పరిష్కరించే అవకాశం ఉందని శ్రీ ప్రధాన్ నొక్కి చెప్పారు. ఈ రోజు ప్రారంభించిన ఈ కార్యక్రమం విద్యా మంత్రిత్వ శాఖ యొక్క ఇన్నోవేషన్ సెల్, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సిబిఎస్ఇ మరియు ఎఐసిటిఇల ఉమ్మడి ప్రయత్నం. ఇది నూతన ఆవిష్కరణ సామర్థ్యాలతో లక్షలాది మంది విద్యార్థులను పెంచి, ఆవిష్కరణ సంస్కృతిని అభివృద్ధి చేస్తుంది మరియు కొత్త మరియు శక్తివంతమైన భారతదేశానికి పునాది వేస్తుందని అన్నారాయన.

దేశవ్యాప్తంగా గిరిజన పిల్లల కోసం పెద్ద సంఖ్యలో పాఠశాలలకు ప్రయోజనం చేకూర్చేందుకు గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో విద్యా మంత్రిత్వ శాఖ ఆవిష్కరణ రంగంలో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అర్జున్ ముండా తెలిపారు. ఈ మేరకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం చాలా మంచి పరిణామాలను కలిగి ఉంటుందని ఇది ప్రధాని సంకల్పమైన సరికొత్త ఇండియా సాధనకు  సహాయపడుతుందని కేంద్రమంత్రి వివరించారు.

'ఎస్‌ఐఎటిపి' పిల్లల సృజనాత్మకతకు రెక్కలు ఇస్తుందని, వారి ఆలోచనలతో ప్రపంచానికి కొత్తదాన్ని ఇవ్వగలిగేలా ఒక వేదికను అందిస్తుందని శ్రీ అర్జున్ ముండా అన్నారు. గిరిజన పిల్లల కోసం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (ఇఎంఆర్ఎస్) ప్రధానమంత్రి యొక్క మరొక ప్రతిష్టాత్మక కార్యక్రమం, దీని కింద వచ్చే మూడేళ్ళలో గిరిజన ప్రాబల్య ప్రాంతాల్లో 740 ఇఎంఆర్ఎస్ ఏర్పాటు చేయబడుతుందని ఆయన అన్నారు. గిరిజన పిల్లలకు సాధ్యమైనంత ఉత్తమమైన విద్యను అందించడానికి గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ చేసిన ప్రయత్నం కాబట్టి ఇఎంఆర్ఎస్ విద్యార్థులు ఎస్‌ఐఎటిపి నుండి ఎంతో ప్రయోజనం పొందుతారు. ఉపాధ్యాయుల కోసం ఈ ప్రత్యేకమైన సామర్థ్యాన్ని పెంపొందించే కార్యక్రమం ద్వారా పిల్లలలో సృజనాత్మకత, సహకారం, విమర్శనాత్మక ఆలోచన మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాల అభివృద్ధికి ప్రాముఖ్యత లభించిందని ఈ మొత్తం కార్యక్రమంలో ఏకలవ్య పాఠశాలలను ఏకీకృతం చేయడం గిరిజన పిల్లల అర్ధవంతమైన అభివృద్ధి దిశలో ఒక పెద్ద అడుగు అని శ్రీ అర్జున్ ముండా వివరించారు.

ఈ సందర్భంగా గిరిజన వ్యవహారాల కార్యదర్శి శ్రీ అనిల్ కుమార్ ఝా మాట్లాడుతూ " నూతన విద్యా విధానంలో ఆవిష్కరణలను ప్రోత్సహించడం ప్రధానమైనదని అన్నారు. ఉపాధ్యాయులు బోధన యొక్క కొత్త పద్ధతులను రూపొందించాల్సిన అవసరం ఉంది; వారు మొదట తమను వ్రాతపూర్వక పాఠ్య పుస్తకాల సాధనంగా మార్గదర్శకులుగా మార్చుకోవాలి. ఏకాలవ్య ప్రపంచ విద్యా పాఠశాలను నిర్వహించడమే కాకుండా, గిరిజన విద్యార్థులకు శాస్త్రీయ విద్యను వ్యాప్తి చేయడంలో రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల కార్యక్రమాలకు గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకరిస్తోందని, ఈ కొత్త ప్రయత్నం గిరిజన పిల్లలలో నాణ్యమైన విద్యను ప్రోత్సహించడంలో సహాయపడుతుందని శ్రీ ఝా అన్నారు. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆది-ప్రక్షిణ్ పోర్టల్‌ను ప్రారంభించింది. ఇది శిక్షణా ఇన్‌పుట్‌ల రిపోజిటరీ కూడా వ్యవహరిస్తుంది. ఎస్‌ఐఎపి శిక్షణ మాడ్యూల్ కూడా ఈ పోర్టల్‌కు అనుసంధానించబడితే చాలా ప్రయోజనం కలుగుతుందని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమం పాఠశాల ఉపాధ్యాయుల కోసం వినూత్నమైన మరియు మొట్టమొదటి శిక్షణా కార్యక్రమం. ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఐపిఆర్, డిజైన్ థింకింగ్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, ఐడియా జనరేషన్ వంటి వాటిపై 50,000 మంది పాఠశాల ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం దీని లక్ష్యం.

ఈ కార్యక్రమాన్ని విద్యా మంత్రిత్వ శాఖ యొక్క ఇన్నోవేషన్ సెల్ మరియు పాఠశాల ఉపాధ్యాయుల కోసం ఎఐసిటిఈ రూపొందించింది. 'ఉన్నత విద్యా సంస్థ యొక్క అధ్యాపక సభ్యుల కోసం ఇన్నోవేషన్ అంబాసిడర్ శిక్షణ కార్యక్రమం' ఆధారంగా ఇది రూపొందించబడింది. ఈ శిక్షణ ఆన్‌లైన్ విధానంలో మాత్రమే ఇవ్వబడుతుంది.


 

*****



(Release ID: 1736206) Visitor Counter : 889