ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
తాము కోరుకున్న భాషలో సరైన సమయంలో సరైన సమాచారం రైతులు పొందేందుకు కిసాన్ సారథి డిజిటల్ ప్లాట్‌ఫాం ఆవిష్కరణ
డిజిటల్ ప్లాట్‌ఫాం ద్వారా శాస్త్రవేత్తల నుంచి నేరుగా వ్యవసాయ, తత్సంబంధిత వ్యక్తిగత సలహా, సూచనలను రైతులు పొందవచ్చుః ఐటి మంత్రి అశ్విని వైష్ణవ్
Posted On:
16 JUL 2021 3:21PM by PIB Hyderabad
తాము కోరుకున్న భాషలో సరైన సమయంలో సరైన సమాచారాన్ని రైతులకు అందించేందుకు కిసాన్ సారథి పేరిట డిజిటల్ ప్లాట్‌ఫాంను వ్యవసాయ, రైతాంగ సంక్షేమ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ లు శుక్రవారం సంయుక్తంగా వీడియో కాన్ఫరెన్స్ద్వారా ప్రారంభించారు. ఐసిఎఆర్ 93వ వ్యవస్థాపక దినోత్సవాన్ని 16 జులై 2021న జరుపుకుంటున్న నేపథ్యంలో ఈ ఆవిష్కరణ జరిగింది.
ఈ కార్యక్రమానికి మత్స్య, పశు సంవర్ధక, డైరీ మంత్రి పురుషోత్తం రూపాల, వ్యవసాయ, రైతాంగ సంక్షేమ శాఖ సహాయ మంత్రి కైలాస్ చౌదరి, వ్యవసాయ, రైతాంగ సంక్షేమ సహాయ మంత్రి సుశ్రీ శోభాకరాంద్లజే కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.
దృశ్య మాధ్యమం ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ కార్యదర్శి అజయ్ సాహ్నే, డిఎఆర్ ఇ కార్యదర్శి, ఐసిఎఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ త్రిలోచన్ మహాపాత్ర, డిజిటల్ ఇండియా కార్పొరేషన్ ఎండి & సిఇఒ అభిషేక్ సింగ్ తో పాటుగా మీత్ వై (MeitY), ఐసిఎఆర్, డిఎఆర్ ఇ సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఉన్న రైతులు, మీత్ వై (MeitY), ఐసిఎఆర్, డిఎఆర్ ఇ, కెవికె భాగస్వాములు, వాటాదారులు దృశ్య మాధ్యమం ద్వారా వీక్షించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మారుమూల ప్రాంతాలలో కూడా ఉన్న రైతులను చేరుకునేందుకు కిసాన్ సారథి వంటి సాంకేతిక చొరవలకు శ్రీకారం చుట్టి రైతులను సాధికారం చేసే విధంగా కార్యక్రమాన్ని రూపొందించిన ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖను, వ్యవసాయ, రైతాంగ్ సంక్షేమ శాఖను ఐటి మంత్రి వైష్ణవ్ అభినందించారు. ఈ డిజిటల్ ప్లాట్‌ఫాం సాధనం ద్వారా రైతులు వ్యవసాయం, సంబంధిత రంగాలకు సంబంధించిన వ్యక్తిగత సలహా సూచనలను తమతమ రంగానికి సంబంధించిన కృషి విజ్ఞాన కేంద్ర (కెవికె) శాస్త్రవేత్తలను నేరుగా పొందేందుకు అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు.
కనీస నష్టంతో తమ పంటను అమ్ముకునేందుకు మార్కెట్ల ప్రాంతాలను, రైతులు తమ పంటను పొలం నుంచి వేర్ హౌజ్‌లకు రవాణా చేసేందుకు నూతన సాంకేతిక చొరవలపై పరిశోధనలు చేయవలసిందిగా ఐసిఎఆర్ శాస్త్రవేత్తలను వైష్ణవ్ కోరారు. రైతులను సాధికారం చేసేందుకు వ్యవసాయ, రైతాంగ సంక్షేమ మంత్రిత్వ శాఖకు,మత్స్య, పశుసంవర్ధక, రైతులను సాధికారం చేసే డైరీ శాఖలకు అవసరమైన మద్దతును ఇచ్చేందుకు ఎలక్ట్రానిక్స్, ఐటి మంత్రిత్వ శాఖ, కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాయని కేంద్ర ఐటి మంత్రి హామీ ఇచ్చారు. అలాగే, పంట రవాణా సమయాన్ని కనిష్టం చేసేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రణాళికలను సిద్ధం చేస్తోందని ఆయన ప్రస్తావించారు.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్‌కు 93వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ, వ్యవసాయ, రైతాంగ సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌జీ సమర్ధవంతమైన నాయకత్వం, మార్గదర్శనంలో కిసాన్ సారథి చొరవ రైతుల నిర్ధిష్ట ప్రాంతానికి సంబంధించిన సమాచార అవసరాలను తీర్చడమే కాక వ్యవసాయ విస్తరణ, విద్య, ఐఇఎఆర్ పరిశోధనా కార్యకలాపాలకు తోడ్పడుతుందని మంత్రి తెలిపారు.
***
(Release ID: 1736203)
Visitor Counter : 264