కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 సమయంలో ఇఎస్ఐ ఆసుపత్రులకు విరాళాలు ఇచ్చిన దాతలను సన్మానించిన ఇఎస్ఐసి

Posted On: 15 JUL 2021 5:41PM by PIB Hyderabad

కోవిడ్-19 సమయంలో ఇఎస్ఐసి ఆసుపత్రులకు ఉదారంగా పరికరాలుసామాగ్రిని  విరాళాలు ఇచ్చిన దాతలను కేంద్ర కార్మికఉపాధిపర్యావరణఅటవీవాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ ఈ రోజు సత్కరించారు. ఈ కార్యక్రమంలో కార్మికఉపాధిపెట్రోలియంసహజ వాయువు శాఖ సహాయ  మంత్రి శ్రీ రామేశ్వర్ తేలికార్మికఉపాధి కార్యదర్శిశ్రీ అపూర్వ చంద్రడిజిఇఎస్ఐసి శ్రీ ముఖ్మీత్ ఎస్. భాటియా పాల్గొన్నారు.

 కోవిడ్ -19 మహమ్మారి  రెండవ దశలో తలెత్తిన  ఆరోగ్య సంక్షోభాన్ని  ప్రైవేట్ సంస్థలు, పౌర సంఘాలుస్వచ్చంధ సంస్థలు ప్రజల సహకారంతో ప్రభుత్వం ఎదుర్కొని విజయం సాధించింది. ఈ సమయంలో దాదాపు 100 మంది దాతలు ఇఎస్ఐసి ఆసుపత్రులకు 13 కోట్ల రూపాయల విలువ చేసే పరికరాలు, సామాగ్రిని విరాళాలుగా అందించారు. 

దాతలను సన్మానించడానికి ఏర్పాటైన సమావేశంలో ప్రసంగించిన శ్రీ భూపేంద్ర యాదవ్ ట్రాకింగ్టెస్టింగ్ మరియు చికిత్స విధానాన్ని అనుసరించి అనుసరించి దేశంలో 125 కోట్ల మంది ప్రజలకు అండగా నిలిచిందని అన్నారు.మాస్కులుపిపిఇ కిట్ల ఉత్పత్తి రంగంలో స్వయం సమృద్ధి సాధించిన భారతదేశం కోవిడ్ నివారణకు  రెండు స్వదేశీ వ్యాక్సిన్లు అభివృద్ధి చేసిందని అన్నారు. ఈ ఏడాది చివరినాటికి దేశంలో 257 కోట్ల టీకాల ఉత్పత్తి జరిగి ప్రజలకు అందుబాటులోకి వస్తాయని మంత్రి పేర్కొన్నారు. ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి ప్రతి ఒక్కరికి విద్యుత్, ఆరోగ్య సంరక్షణ అందించడానికి చర్యలను అమలు చేస్తున్నదని మంత్రి చెప్పారు. ప్రజల ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం ఆరోగ్య రంగానికి బడ్జెట్ కేటాయింపులను 137 శాతం పెంచిందని తెలిపారు. ఒకే ఉద్యోగి పనిచేస్తున్న సంస్థలకు కూడా సామాజిక భద్రతా నిబంధనలను అమలు చేస్తామని అన్నారు. 

అన్ని వర్గాలకు చెందిన ప్రజల సంక్షేమానికి  ప్రభుత్వం కృషి చేస్తోందని కార్మికఉపాధిపెట్రోలియంసహజ వాయువు శాఖ సహాయ  మంత్రి శ్రీ రామేశ్వర్ తేలి అన్నారు. 13 కోట్లకు పైగా ప్రజలకు సౌకర్యాలను కల్పిస్తున్నఇఎస్ఐసిని అభినందించారు. అయితే,కోవిడ్  మహమ్మారి పట్ల  అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజలకు సూచించారు. 

స్థానిక యంత్రంగం నుంచి అందిన ప్రతిపాదనల మేరకు దేశంలో 33 ఇఎస్ఐసి ఆస్పత్రులు కోవిడ్ చికిత్సను అందించాయి. దీనికోసం వీటిలో 400 వెంటిలేటర్లను, 4000 పడకలను ఏర్పాటు చేశారు. కోవిడ్ -19 ప్రారంభం అయిన 2020 ఏప్రిల్ నుంచి ఇంతవరకు ఇఎస్ఐసి ఆసుపత్రుల్లో దేశ వ్యాపితంగా 50,000 మందికి చికిత్స అందించడం జరిగింది.  ఫరీదాబాద్ (హర్యానా) మరియు  సనత్ నగర్ (తెలంగాణ) ఇఎస్ఐసి ఆసుపత్రుల్లో ప్లాస్మా చికిత్స ప్రారంభించబడింది.

ఇఎస్ఐసి ఆస్పత్రిని కోవిడ్ ఆస్పత్రిగా ప్రకటించిన సమయంలో ఇఎస్ఐ లబ్ధిదారులకు ఇతర ఆసుపత్రులతో ఒప్పందం కుదుర్చుకుని వైద్య సౌకర్యాలను అందించారు. కోవిడ్ ప్రత్యేక ఆస్పత్రిగా ఇఎస్ఐసి ఆస్పత్రి సేవలు అందించినంత వరకు ఇఎస్ఐ లబ్ధిదారులు సంప్రదింపులు / ప్రవేశం / పరీక్షల కోసం   

 టై-అప్ హాస్పిటల్స్‌ను సంప్రదించడానికి అవకాశం కల్పించారు. .  ఇఎస్ఐ  లబ్ధిదారులకు అతని / ఆమె అర్హతకు అనుగుణంగా రిఫెరల్ లేఖ లేకుండా నేరుగా టై-అప్ ఆసుపత్రి నుంచి  అత్యవసర / సాధారణ  వైద్య చికిత్సను పొందడానికి అనుమతించారు.

  ఇఎస్ఐ చట్టం క్రింద ఉన్న నగదు ప్రయోజనాలతో పాటు, కోవిడ్ -19 రిలీఫ్ స్కీమ్ ప్రారంభించబడింది. దీనిప్రకారంకోవిడ్  కారణంగా మరణించిన   బీమా కార్మికుడి సగటు వేతనంలో  90% వేతనాన్నిఅర్హత గల  బీమా కార్మికుడి  కుటుంబ సభ్యులకు  చెల్లించే సౌకర్యం కల్పించారు. ఉపాధి సమయంలో కలిగిన  గాయం వల్ల మరణించిన బీమా కార్మికుడి కుటుంబ సభ్యులకు సగటు వేతనంలో  90%ని చెల్లించడం జరుగుతూ వచ్చింది . కార్మికునిపై ఆధారపడి జీవిస్తున్న వారిని ఆదుకోవడానికి కోవిడ్ మరణాలు కూడా ఈ సౌకర్యాన్ని వర్తింప చేస్తున్నారు. కోవిడ్ బారిన పడి విధులకు హాజరుకాని కార్మికులకు 91 రోజుల సగటు వేతనంలో 70%ని సిక్ నెస్ బెనిఫిట్ గా చెల్లిస్తున్నారు . బీమా చేసిన కార్మికుడు ఉపాధి కోల్పోయిన సమయంలో  అతడు / ఆమె అటల్ బీమిట్ వ్యక్తి కళ్యాణ్ యోజన (ఎబివికెవై) కింద ఉపశమనం పొందవచ్చు  రోజుకు సగటున 50% గరిష్టంగా 90 రోజుల పాటు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఈ ఉపశమనం పొందటానికిబీమా చేసిన కార్మికుడు ఆన్‌లైన్‌లో www.esic.in లో క్లెయిమ్‌ను సమర్పించ వలసి ఉంటుంది.

కోవిడ్ -19 మహమ్మారి   సమయంలో ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్   తన వాటాదారులకు మరియు సాధారణ ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణను, నగదు ప్రయోజనాలను అందించడానికి బహుళ చర్యలను అమలు చేసింది.   సహేతుకమైన ఆరోగ్య సంరక్షణ వంటి సమగ్ర సామాజిక భద్రతా ప్రయోజనాలను ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అందిస్తోంది. ఉపాధి వల్ల కలిగే  గాయంఅనారోగ్యంమరణం వంటి అవసరమైన సమయాల్లో సంస్థ కార్మికులను అనేక విధాలుగా ఆదుకుంటున్నది. 3.4 కోట్ల కార్మిక కుటుంబాలు సభ్యులుగా ఉన్న సంస్థ ద్వారా 13.24కోట్ల మంది ప్రయోజనం పొందుతున్నారు. ప్రస్తుతం దేశం వివిధ ప్రాంతాల్లో 1502 డిస్పెన్సరీలు (మొబైల్ డిస్పెన్సరీలతో సహా)/308 ఐఎస్ఎం యూనిట్లు/159 ఇఎస్ఐ ఆస్పత్రులు , 744 బ్రాంచ్ / పే  కార్యాలయాలు మరియు 64 ప్రాంతీయ మరియు ఉప ప్రాంతీయ కార్యాలయాలు సంస్థ పరిధిలో సేవలు అందిస్తున్నాయి. ఇఎస్ఐ   పథకం నేడు 34 రాష్ట్రాలు మరియు దేశంలోని కేంద్రపాలిత ప్రాంతాలలో 566 జిల్లాల్లో అమలు జరుగుతోంది. 

 

***


(Release ID: 1736146) Visitor Counter : 198