ఆయుష్
ఆయుర్వేదలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచింగ్ అండ్ రీసెర్చ్ (ఐటిఆర్ఎ), గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం
Posted On:
16 JUL 2021 11:03AM by PIB Hyderabad
ఆయుష్ మంత్రిత్వ శాఖ కింద జామ్‌నగర్ లో ఉన్న ఆయుర్వేద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచింగ్ అండ్ రీసెర్చ్ (ఐటిఆర్ఎ)కి గుజరాత్ ప్రభుత్వానికి మధ్య గుజరాత్ ఉప ముఖ్యమంత్రి శ్రీ నితిన్‌భాయ్ పటేల్, ఆయుష్వైద్య కార్యదర్శి రాజేష్ కోటేచా సమక్షంలో 2021 జులై 15వ తేదీన అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ అవగాహన ఒప్పందం ద్వారా జామ్‌నగర్‌లోని ఆయుర్వేద క్యాంపస్‌లో పనిచేస్తున్న అన్ని సంస్థలను ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఏకైక సంస్థ ఐటిఆర్‌ఎ గొడుగు కిందకు తీసుకువచ్చారు, ఇనిస్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ (ఐఎన్‌ఐ) హోదా పొందారు. అవగాహన ఒప్పందం ప్రాముఖ్యతను నొక్కిచెప్పిన శ్రీనితిన్‌భాయ్, ఇది ఆయుర్వేదంలోని అన్ని శాఖలలో విద్యావ్యవస్థను బలోపేతం చేయడానికి మార్గం సుగమం చేస్తుందని అన్నారు.
డైరెక్టర్, ఐటిఆర్ఎ, ప్రొఫెసర్ డాక్టర్ అనుప్ ఠాకర్, గుజరాత్ ఆయుర్వేద విశ్వవిద్యాలయం ఇంచార్జి రిజిస్ట్రార్ శ్రీ హెచ్.పి.ఝల ఈ అవగాహన ఒప్పందం ఇచ్చి పుచ్చుకున్నారు.

"ఈ ఏర్పాటు విద్య, పరిశోధన మరియు వైద్య రంగాలలో కొత్త తలుపులు తెరవడానికి కారణం అవుతుంది" అని ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి చెప్పారు. ఆయుర్వేద రంగంలో, కొత్త బోధన, వైద్య మరియు పరిశోధనా పద్ధతులను సిద్ధం చేయడం సులభం అవుతుందని, అధ్యయనం-పరిశోధన ప్రక్రియ వేగవంతం అవుతుందని అయన తెలిపారు. ఆయుర్వేద విద్య, పరిశోధన మొత్తం పరిధిని విస్తరిస్తుందని భావిస్తున్నట్టు చెప్పారు.
వైద్య రాజేష్ కోటేచా మాట్లాడుతూ ఆయుర్వేద రంగంలో కొత్త బోధన, వైద్య, పరిశోధన పద్ధతులను సిద్ధం చేయడం సులభం అవుతుంది. అధ్యయనం, పరిశోధన ప్రక్రియను మరింత లోతుగా చేయవచ్చని, ఆయుర్వేద విద్యకు, దేశవ్యాప్తంగా పరిశోధనా సంస్థలను పునః రూపకల్పన చేయడానికి ఐటిఆర్ఎ ఒక ఆదర్శవంతమైన సంస్థగా ఉంటుందని ఆయన అన్నారు.
****
(Release ID: 1736088)