సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
కొత్త ఖాదీ ఉత్పత్తులు - ఖాదీ బేబీవేర్ & ప్రత్యేకమైన చేతితో తయారు చేసిన పేపర్ “యూజ్ & త్రో” స్లిప్పర్స్ ని ప్రారంభించిన
ఎంఎస్ఎంఈ మంత్రి శ్రీ నారాయణ్ రాణే
Posted On:
15 JUL 2021 4:50PM by PIB Hyderabad
ఎంఎస్ఎంఈ మంత్రి శ్రీ నారాయణ్ రాణే ఈ రోజు ఖాదీకి సంబంధించిన రెండు కొత్త ప్రత్యేకమైన ఉత్పత్తి శ్రేణి - ఖాదీ కాటన్ బేబీవేర్ మరియు ప్రత్యేకమైన ఖాదీ చేతితో తయారు చేసిన కాగితపు చెప్పులను ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ లోని ఖాదీ ఇండియా ప్రధాన షోరూంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్‌ఎంఇ రాష్ట్ర మంత్రి శ్రీ భాను ప్రతాప్ సింగ్ వర్మ, కెవిఐసి చైర్మన్ శ్రీ వినయ్ కుమార్ సక్సేనా పాల్గొన్నారు. మంత్రులు ఈ ఖాదీ ఉత్పత్తులను ప్రశంసించారు.
కొత్త ఉత్పత్తులలో పిల్లల కోసం ఖాదీ మొట్టమొదటి కాటన్ దుస్తులను తయారు చేసింది. కేవిఐసి స్లీవ్ లెస్ దుస్తులు (జాబ్లాస్), ఫ్రాక్‌లతో పాటు నవజాత పిల్లలు, 2 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లల కోసం బ్లూమర్లు, నాపీలను కూడా రూపొందించింది. పిల్లల మృదువైన, సున్నితమైన చర్మంపై మృదువుగా ఉండే 100 శాతం చేతితో నేసిన కాటన్ ఫాబ్రిక్‌ను కెవిఐసి ఉపయోగించింది. దద్దుర్లు లేదా చర్మపు చికాకు నుండి కూడా ఈ ఉత్పత్తి నిరోధిస్తుంది.
భారతదేశంలో మొట్టమొదటిసారిగా అభివృద్ధి చేసిన ఖాదీ చేతితో తయారు చేసిన కాగితం “యూజ్ & త్రో” చెప్పులను కూడా మంత్రులు ప్రారంభించారు. ఈ చేతితో తయారు చేసిన కాగితపు చెప్పులు 100 శాతం పర్యావరణ అనుకూలమైనవి, తక్కువ ఖర్చుతో ఉన్నవి. ఈ చెప్పులు తయారీకి ఉపయోగించే, చేతితో తయారు చేసిన కాగితం పూర్తిగా కలప రహితమైనది. కాటన్ & సిల్క్ రాగ్స్ మరియు వ్యవసాయ వ్యర్థాలు వంటి సహజ ఫైబర్స్ తో తయారు చేశారు. ఈ చెప్పులు తేలికైనవి, ఇల్లు, హోటల్ గదులు, ఆస్పత్రులు, ప్రార్థనా స్థలాలు, ప్రయోగశాలలు వంటి ప్రయాణ మరియు ఇండోర్ వాడకానికి బాగా సరిపోతాయి. ఇది పరిశుభ్రత కోణం నుండి కూడా ప్రభావవంతంగా ఉంటుంది.
ఖాదీ కాటన్ బేబీవేర్ ఒక్కొక్కటి ధర 599 రూపాయలు; చేతితో తయారు చేసిన కాగితం చెప్పులు అతి తక్కువ ధర జతకి 50 రూపాయలకె అందుబాటులోకి తెచ్చారు. రెండు కొత్త ఉత్పత్తులను కన్నాట్ ప్లేస్‌లోని ఖాదీ షోరూమ్‌లో అలాగే కెవిఐసి ఆన్‌లైన్ పోర్టల్ www.khadiindia.gov.in ద్వారా వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.
పర్యావరణ అనుకూలమైన మరియు స్థిరమైన ఉత్పత్తులు ఈ పోటీ మార్కెట్ లో ఉధృతంగా మార్కెటింగ్ చేయాలని శ్రీ రాణే అన్నారు. ఈ రంగంలో పెద్ద మార్కెట్ వాటాను స్వాధీనం చేసుకోవడం ద్వారా, కెవిఐసి మరింత ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని, దాని వినియోగదారులను కూడా విస్తృతంగా పెంచుకుంటుందని ఆయన అన్నారు.
కెవిఐసి చైర్మన్ శ్రీ సక్సేనా మాట్లాడుతూ కాగిత పరిశ్రమకు తోడ్పడటంతో పాటు, చేతివృత్తులవారికి స్థిరమైన ఉపాధి కల్పించడం కోసం చేతితో తయారు చేసిన కాగితం “యూజ్ & త్రో” స్లిప్పర్లను కెవిఐసి అభివృద్ధి చేసిందన్నారు. బేబీవేర్ తయారీ రంగంలోకి కెవిఐసి తొలిసారిగా అడుగుపెట్టిందని ఆయన అన్నారు.
***
(Release ID: 1736022)
Visitor Counter : 234