వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉత్తరప్రదేశ్కు చెందిన 14.71 కోట్ల మంది లబ్ధిదారులకు రికార్డుస్థాయిలో 109.33 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను ఉచితంగా పంపిణీ చేశారు.

రూ.40,093 కోట్ల విలువైన ఆహార ధాన్యాలను కేటాయించారు.

ప్రజాపంపిణీలో ఆటోమేషన్ విధానం.. పథకం యొక్క ప్రయోజనాలు నిజమైన లబ్ధిదారులకు చేరేలా చేస్తుంది. అంతేకాకుండా లబ్ధిదారులకు పూర్తి అర్హత లభిస్తుంది.

Posted On: 14 JUL 2021 1:19PM by PIB Hyderabad

అణగారినవర్గాల ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నయోజన పథకం కింద ఉత్తరప్రదేశ్కు రికార్డుస్థాయిలో 109.33 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను కేటాయించారు. ఈ పథకం కింద ఉత్తరప్రదేశ్లో 14.71 కోట్లకుపైగా మంది లబ్ధిపొందుతున్నారు. పంపిణీ చేసిన ఈ ఆహార ధాన్యాల విలువ రూ.40,093 కోట్లు.

ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నయోజన అమలులో భాగంగా ఆహార సబ్సిడీ, అంతర్రాష్ట్ర రవాణా ఖర్చులు, డీలర్ మార్జిన్, అదనపు డీలర్ మార్జిన్ తదితర ఖర్చులతోసహా పంపిణీకి అయ్యే ఖర్చులన్నింటినీ భారత ప్రభుత్వం భరిస్తుంది. ఈ ఆహార ధాన్యాలను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్రాల ప్రభుత్వాలకు ఉచితంగా అందజేస్తోంది.

జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ఒక్కొక్కరికి నెలకు 5 కిలోల ఆహార ధాన్యాలు (ఇందులో 3 కిలోల గోధుమలు మరియు 2 కిలోల బియ్యం ఉన్నాయి) అదనంగా పంపిణీ చేస్తున్నారు. జాతీయ ఆహార భద్రతా చట్టం  కింద దేశంలోనే అత్యధికంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి కేటాయిస్తున్నారు.

ఉత్తర ప్రదేశ్‌లో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పిఎంజికెఎవై) అమలుతీరు దశల వారీగా ఇలా ఉంది

Phase

Duration

Quantity

allocated to

Uttar Pradesh

(in Lakh

Metric Tonnes)

Quantity lifted by the State Government of

Uttar Pradesh

(in Lakh Metric

Tonnes)

Total cost (In Crores

Rs)

I

April to June 2020

21.47

21.45

9218

II

July to November

2020

36.35

35.19

12774

III

May & June 2021

14.71

14.69

5171

IV

July to November

2021

36.80

1.00

12930

 

Total

109.33

71.33

40093

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ప్రజా పంపిణీ వ్యవస్థలో ఆటోమేషన్ విధానం అమలుతో గత 3 నుంచి 4 సంవత్సరాల వ్యవధిలో పంపిణీ మరియు సేకరణ వ్యవస్థలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం భారీ మార్పుకు సాక్ష్యంగా నిలిచింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించడం పారదర్శకతకు దారితీసింది. ప్రభుత్వం పెద్దమొత్తంలో పొదుపు చేయగలిగింది.

ప్రజాపంపిణీ వ్యవస్థ కార్యకలాపాల్లో ఆటోమేషన్తో రాష్ట్ర ప్రభుత్వానికి, పౌరులకు ఎన్నో రెట్లు ప్రయోజనం కలిగింది.


ప్రభుత్వానికి కలిగిన ప్రయోజనాలు -

– లబ్దిదారుల బయోమెట్రిక్ అథెంటికేషన్ కారణంగా మోసపూరిత కార్యకలాపాలు తగ్గాయి.

– ఉత్తరప్రదేశ్ రాష్ట్రం 100 శాతం బయోమెట్రిక్ అథెంటికేషన్ ఆధారిత లావాదేవీలను నమోదు చేస్తోంది.

– దాదాపు 30 లక్షలకుపైగా నకిలీ లబ్ధిదారులను తొలగించారు. సుమారు 7 లక్షలకుపైగా వినియోగంలో లేని రేషన్ కార్డులను తొలగించారు.

– సుమారు 80వేల ఎఫ్పీఎస్ల ఆటోమేషన్ వల్ల యూపీ ప్రభుత్వానికి సుమారు 3000 కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి.

– సామర్థ్యం పెరగడంతోపాటు ప్రజాపంపిణీ వ్యవస్థ పనితీరు కూడా మెరుగుపడింది.


పౌరులకు కలిగే ప్రయోజనాలు -

– బయోమెట్రిక్ అథెంటికేషన్ వల్ల నిజమైన లబ్ధిదారుడు సరైన ధరకు, సరైన పరిమాణంలో ఆహారధాన్యాలను పొందుతాడు.

– అవకతవకలు, సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేకంగా హెల్ప్లైన్తోపాటు మొబైల్ ఫోన్ అప్లికేషన్ కూడా అందుబాటులోకి వచ్చింది. ప్రజలు తమ అభిప్రాయాలను తెలిపడం సులభతరమైంది.

– పోర్టబిలిటీ కారణంగా రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రానికి వెలుపల ఉన్నా.. ఏ చౌకధరల దుకాణం నుంచైనా కొనుగోలు చేసే వీలు కలిగింది.

 

సేకరణలో ఆటోమేషన్-

ఆటోమేషన్ కేవలం ప్రజా పంపిణీ వ్యవస్థకు మాత్రమే పరిమితం కాదు. ఆహార ధాన్యాల సేకరణ వ్యవస్థలోనూ భాగమైంది. ఉత్తరప్రదేశ్లో సేకరణ వ్యవస్థను మరింతగా బలోపేతం చేసేందుకు అనేక డిజిటల్ కార్యక్రమాలు చేపట్టారు. వాటిలో కొన్ని ఆటోమేషన్ చేశారు.

రైతుల భూరికార్డులను సేకరణ పోర్టల్తో అనుసంధానించడంతో నిజమైన భూ యజమానుల నుంచి సేకరణ జరిగిందనే విషయం నిర్ధారించుకోవడం సులభమైంది.

ప్రజా ఆర్థిక వ్యవహారాల నిర్వహణ వ్యవస్థ(పీఎఫ్ఎంఎస్) ద్వారా బ్యాంకు ఖాతాల వివరాల ధ్రువీకరణ తర్వాత ఎటువంటి అవకతవకలకు అవకాశం లేకుండా నిజమైన రైతుకు కనీస మద్ధతు ధర చెల్లిస్తున్నారు. రైతుల ఖాతాల్లోకి నేరుగా కనీస మద్ధతు ధర సొమ్ములు బదిలీ అవుతున్నాయి.

ఆన్లైన్లో గోధుమల డెలివరీ, ఈ బిల్లింగ్ విధానాన్ని దేశంలోనే మొట్టమొదటిసారిగా అమలు చేసిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్.


నిజమైన రైతుల నుంచి మాత్రమే ఆహార ధాన్యాల సేకరణ జరగడానికి, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చేయడానికి ప్రయోగాత్మకంగా రైతుల నుంచి బయోమెట్రిక్ అథెంటికేషన్ పద్ధతిలో కొనుగోలు చేయడం జరిగింది. దీనివల్ల నిజమైన అర్హత కలిగిన రైతులకు మాత్రమే కనీస మద్ధతు ధర దక్కుతుంది.

ఉత్తరప్రదేశ్‌లోని రైతుల సంక్షేమానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉంది.

 

***

 


(Release ID: 1735739) Visitor Counter : 159